War 2 Collection: ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘వార్ 2′(Coolie Movie) ఎంతటి భారీ అంచనాల నడుమ విడుదల అయ్యిందో మన అందరికీ తెలిసిందే. కానీ ఈ చిత్రానికి మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది. ఆన్లైన్ లో అయితే క్రిటిక్స్ ఈ చిత్రానికి డిజాస్టర్ టాక్ చెప్పారు. తెలుగు వెర్షన్ వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఒక్కమాటలో చెప్పాలంటే 4వ రోజు తోనే తెలుగు వెర్షన్ వసూళ్లు ఆగిపోయాయి. 5వ రోజు నుండి అయితే కనీసం జిల్లాల వారీగా షేర్స్ రావడం కూడా ఆగిపోయాయి. నేటి నుండి కమీషన్ బేసిస్ మీద రన్ చేస్తే తప్ప, ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకోవడం కష్టం. తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు అతి కష్టం మీద ఈ చిత్రానికి కోటి రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి, నేటి నుండి అది కూడా కష్టమే అంటున్నారు.
Also Read: 5వ రోజు భారీగా పడిపోయిన ‘కూలీ’ వసూళ్లు..బ్రేక్ ఈవెన్ కష్టం లాగానే ఉందే!
అసలే సినిమాకు పాజిటివ్ టాక్ లేదు, దానికి తోడు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, దీంతో వచ్చే డబ్బులు కూడా రావడం లేదని బయ్యర్స్ వాపోతున్నారు. ఈ చిత్రం అన్ని భాషల్లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. నాలుగు రోజులకు కలిపి కేవలం 120 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 263 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా. తెలుగు వెర్షన్ వసూళ్లు మొత్తానికే ఆగిపోయినప్పటికీ, హిందీ వెర్షన్ వసూళ్లు మాత్రం చాలా డీసెంట్ గా ఉన్నాయి. 5వ రోజున భారీ డ్రాప్స్ అయితే సొంతం చేసుకుంది కానీ, తెలుగు వెర్షన్ తో పోలిస్తే చాలా బెటర్ అనుకోవచ్చు. బాలీవుడ్ ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి 5 వ రోజున 10 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.
బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా 1 లక్షా 45 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. అందులో 80 శాతం హిందీ వెర్షన్ వసూళ్లు ఉండడం విశేషం. ఈ చిత్రానికి కచ్చితంగా నష్టాలు రావడం అయితే పక్కా, ఫలితం డిజాస్టర్ రేంజ్ లోనే ఉంటుంది, కానీ 5వ రోజు వచ్చిన వసూళ్లే కొన్ని రోజులు మైంటైన్ చేస్తే కచ్చితంగా నష్టాల భారం కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ చిత్రం పూర్తిగా హృతిక్ బాక్స్ ఆఫీస్ స్టామినా మీదనే ఆధారపడుంది, ఆయన ఎంత వరకు ఈ చిత్రాన్ని కాపాడుతాడో చూడాలి. సెకండ్ వీకెండ్ కూడా హిందీ లో డీసెంట్ రేంజ్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.