https://oktelugu.com/

Balayya with Mythri Movie Makers: బాలయ్య విలన్ పై మైత్రీ మల్లగుల్లాలు !

నట సింహం నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో తన 107వ సినిమాని చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ సినిమాలో తమిళ విలక్షణ కథానాయకుడు విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు అంటూ ఓ రూమర్ తెగ హల్ చల్ చేసింది. ఈ రూమర్ పై అసలు వాస్తవం ఏమిటంటే. విలన్ గా చేయడానికి విజయ్ సేతుపతి అంగీకరించలేదు. బాలయ్యకి విలన్ అనే ప్రతిపాదనను విజయ్ […]

Written By:
  • admin
  • , Updated On : August 17, 2021 / 11:51 AM IST
    Follow us on

    నట సింహం నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో తన 107వ సినిమాని చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ సినిమాలో తమిళ విలక్షణ కథానాయకుడు విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు అంటూ ఓ రూమర్ తెగ హల్ చల్ చేసింది.

    ఈ రూమర్ పై అసలు వాస్తవం ఏమిటంటే. విలన్ గా చేయడానికి విజయ్ సేతుపతి అంగీకరించలేదు. బాలయ్యకి విలన్ అనే ప్రతిపాదనను విజయ్ సేతుపతి తిరస్కరించాడు. కాబట్టి బాలయ్య సినిమాలో విజయ్ సేతుపతి ఇక లేనట్లే. అయితే, విజయ్ సేతుపతి ‘ఉప్పెన’ సినిమాలో విలన్ గా నటించి, నా సినిమాలో ఎందుకు చేయడు అని బాలయ్య కాస్త అసంతృప్తిగా ఉన్నాడట.

    బాలయ్య కోపానికి కారణం మైత్రీ మూవీ మేకర్స్. ఉప్పెన సినిమాని నిర్మించింది ఆ సంస్థే. ఒక కొత్త హీరోకి విజయ్ సేతుపతిని ఒప్పించారు, నా సినిమాకి ఎందుకు ఒప్పించలేదు అనేది బాలయ్య పాయింట్. మొత్తానికి బాలయ్య కోపాన్ని తగ్గించాలి అంటే.. ఇప్పుడు బాలయ్యకి విలన్ గా మంచి పేరు ఉన్న హీరో కావాలి.

    ఈ క్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ కి దొరికిన మరో హీరో మాధవన్. మాధవన్ ను ఒప్పించడానికి మైత్రీ మల్లగుల్లాలు పడుతోంది. మరి మాధవన్ అయినా బాలయ్యకి విలన్ గా ఒప్పుకుంటాడో లేదో చూడాలి. ఇక క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత సారధ్యంలో ఈ సినిమా రానుంది. అన్నట్టు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది కూడా ఇంకా తేలలేదు.

    రీసెంట్ గా బాలయ్య సరసన హీరోయిన్ గా త్రిష పేరు కూడా వినిపించింది. ప్రస్తుతం ఆమె ఖాళీగానే ఉంది. బాలయ్య సినిమా వస్తే వదులుకోదు. అందుకే ప్రస్తుతం త్రిషను హీరోయిన్ గా ఫైనల్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.