https://oktelugu.com/

Raj Tarun-Lavanya : లావణ్య దగ్గర 70 లక్షలు దోచేసిన రాజ్ తరుణ్..ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయాడుగా!

నేడు లావణ్య మరో బాంబు పేల్చింది. ఆమె మాట్లాడుతూ 'ఒకప్పుడు రాజ్ తరుణ్ ని నేనే పోషించాను. రెండు సంవత్సరాల పాటు ఆయనకి సినిమాలు లేవు. దీంతో అద్దె ఇంటికి మేము మారాల్సి వచ్చింది. నెల తిరిగే లోపు అద్దె 60 వేలు కట్టాల్సి వచ్చేది. అవన్నీ నేనే చూసుకున్నాను. మా తల్లితండ్రులు రాజ్ తరుణ్ కి అవసరం పడినప్పుడు వాళ్లకు ఉన్న స్థలాలను అమ్మేసి ఆయనకి 70 లక్షల రూపాయిలు ఇచ్చాడు.

Written By:
  • Vicky
  • , Updated On : September 8, 2024 / 08:02 PM IST

    Raj Tarun-Lavanya

    Follow us on

    Raj Tarun-Lavanya : రాజ్ తరుణ్ – లావణ్య వ్యవహారానికి ఇక తెరపడింది, ఇక రోజు టీవీ లో డిబేట్స్ చూసే బాధ తప్పింది అని అనుకుంటున్న ఆడియన్స్ కి ఇప్పుడు మరో ట్విస్ట్ తగిలింది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ ముంబై లోని ఒక ప్రైవేట్ హోటల్ గదిలో లో కలిసి ఉన్న సమయాన్ని గమనించి లావణ్య అక్కడికి వెళ్ళింది. నేరుగా గదిలోకి వెళ్లి మాల్వీ మల్హోత్రా ని అడ్డమైన బూతులు తిడుతూ, రాజ్ తరుణ్ ని ‘ఇక పదా నువ్వు..బట్టలు సర్దుకో’ అంటూ రచ్చ చేసింది. రాజ్ తరుణ్ కూడా సీరియస్ గానే రియాక్ట్ అయ్యాడు, గొడవ పెద్దది అవుతుండడం గమనించి మాల్వీ మల్హోత్రా రాజ్ తరుణ్ ని గదిలోకి పంపించింది. ఆ తర్వాత ఆ గొడవ మొత్తాన్ని ఆమె ఒక్కటే హ్యాండిల్ చేసింది.

    ఇదంతా పక్కన పెడితే నేడు లావణ్య మరో బాంబు పేల్చింది. ఆమె మాట్లాడుతూ ‘ఒకప్పుడు రాజ్ తరుణ్ ని నేనే పోషించాను. రెండు సంవత్సరాల పాటు ఆయనకి సినిమాలు లేవు. దీంతో అద్దె ఇంటికి మేము మారాల్సి వచ్చింది. నెల తిరిగే లోపు అద్దె 60 వేలు కట్టాల్సి వచ్చేది. అవన్నీ నేనే చూసుకున్నాను. మా తల్లితండ్రులు రాజ్ తరుణ్ కి అవసరం పడినప్పుడు వాళ్లకు ఉన్న స్థలాలను అమ్మేసి ఆయనకి 70 లక్షల రూపాయిలు ఇచ్చాడు. దానికి సంబంధించిన సాక్ష్యాలు, అకౌంట్ డీటెయిల్స్, స్క్రీన్ షాట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, త్వరలోనే బయటపెడుతాను. ఇన్నేళ్లు కలిసి కాపురం చేసి, ఇప్పుడు నేను వద్దు అంటాడా?, అసలు వదిలే సమస్యే లేదు’ అంటూ ఆమె మీడియా ముందుకు వచ్చి చెప్పుకుంది. అలాగే శేఖర్ బాషా గురించి లావణ్య మాట్లాడుతూ ‘శేఖర్ బాషా తనకి సంబంధం లేని ఈ వ్యవహారం దూరి మా పేరు చెప్పుకొని బాగా ఫేమస్ అయ్యాడు. ఈరోజు చూడండి అతను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి కూర్చున్నాడు. బిగ్ బాస్ కి వెళ్ళడానికే అతను కావాలని ఈ విషయంలో తలదూర్చాడు’ అంటూ చెప్పుకొచ్చింది లావణ్య. ఈమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారాయి.

    ఇదంతా పక్కన లావణ్య ఇప్పటికీ ఎందుకు ఇంత రచ్చ చేస్తుంది అనే విషయం ఆడియన్స్ కి అర్థం కాలేదు. బయటకి లీక్ అయిన ఆడియో కాల్స్ అన్నిటిని వింటే, రాజ్ తరుణ్ – లావణ్య విడిపోయి చాలా కాలం అయ్యింది. లావణ్య మస్తాన్ బాషా అనే వ్యక్తితో ప్రేమాయణం నడిపి, అతినితో విడిపోయిన తర్వాత అతని మీద కేసు పెట్టింది. ఇప్పుడు ఆమెకి రాజ్ తరుణ్ ఎవరితో కలిసి ఉంటే ఆమెకు ఎందుకు. అసలు సున్నిత మనస్తత్వం గల రాజ్ తరుణ్, ఈమె పెట్టే టార్చర్ ని తట్టుకోలేక తనని తానూ ఏమైనా చేసుకుంటే అప్పుడు లావణ్య కి సమ్మగా ఉంటుందేమో అని సోషల్ మీడియాలో నెటిజెన్స్ అంటున్నారు.