Saripodha Shanivaram : సరిపోదా శనివారం’ 11 రోజుల వసూళ్లు.. బ్రేక్ ఈవెన్ ని దాటి లాభాల్లోకి..ఇప్పటి వరకు ఎంత వచ్చిందంటే!

ఈ సినిమా 11 రోజులకు గాను ఎంత వసూళ్లను రాబట్టిందో ఒక్కసారి ఈ కథనం లో క్లుప్తంగా చూద్దాం. ముందుగా నాని కి మంచి స్ట్రాంగ్ జోన్స్ గా పిలవబడే నైజాం ప్రాంతంలో ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 11 రోజులకు గాను 13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

Written By: Vicky, Updated On : September 8, 2024 8:00 pm

కంగువా సినిమా

Follow us on

Saripodha Shanivaram :  ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య విడుదలైన నేచురల్ స్టార్ నాని ‘సరిపోదా శనివారం’ చిత్రం మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిన వరదలను సైతం తట్టుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దిగ్విజయంగా రన్ అవుతూ, నాని లో వరుసగా మూడవ హిట్ గా నిల్చింది. ఆయన స్థాయిని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. ఇప్పటికీ కూడా ఈ చిత్రం కొత్త సినిమాలను డామినేట్ చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. 42 కోట్ల రూపాయిల థియేట్రికల్ బిజినెస్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా 11 రోజులకు గాను ఎంత వసూళ్లను రాబట్టిందో ఒక్కసారి ఈ కథనం లో క్లుప్తంగా చూద్దాం. ముందుగా నాని కి మంచి స్ట్రాంగ్ జోన్స్ గా పిలవబడే నైజాం ప్రాంతంలో ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 11 రోజులకు గాను 13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఫుల్ రన్ లో ఈ చిత్రం 20 కోట్ల రూపాయిల షేర్ మార్కుని కూడా అందుకునే అవకాశం ఉందట. అదే కనుక జరిగితే దసరా తర్వాత నాని కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ చిత్రం గా ఈ చిత్రాన్ని పరిగణించొచ్చు. వరుస ఫ్లాప్స్ తో డీలా పడిన దిల్ రాజు, ఈ సినిమా నైజాం రైట్స్ ని కొనుగోలు చేసాడు. ఇప్పుడు ఈ చిత్రానికి భారీ లాభాలు రావడంతో ఆయన చాలా రిలాక్స్ గా ఉంటున్నాడు. అయితే సీడెడ్ ప్రాంతంలో ఈ చిత్రానికి అనుకున్న స్థాయి వసూళ్లు రాలేదు. ట్రేడ్ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి అక్కడ 3 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతం లో 3 కోట్ల 42 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో కోటి 80 లక్షల రూపాయిలు, వెస్ట్ గోదావరి జిల్లాలో కోటి 20 లక్షల రూపాయిలు, గుంటూరు జిల్లాలో కోటి 65 లక్షల రూపాయిలు, కృష్ణ జిల్లాలో కోటి 63 లక్షల రూపాయిలు, నెల్లూరు జిల్లాలో కోటి 6 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది.

మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రం 27 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టగా, ఓవర్సీస్ లో 12 కోట్ల రూపాయిలు, కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతాలలో 6 కోట్ల 50 లక్షల రూపాయిలు, మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 45 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటి వరకు బయ్యర్స్ కి రెండు కోట్ల రూపాయిలు లాభాలు రాగా, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఫుల్ రన్ లో ఈ చిత్రం 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టబోతుంది.