Megastar Chiranjeevi: బాలీవుడ్ లో ‘కపూర్’ ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంది. ఐతే, దక్షిణాదిలో తన కుటుంబాన్ని కూడా ‘కపూర్’ ఫ్యామిలీ లాగా చూడాలకున్నానని మెగాస్టార్ చిరంజీవి తాజాగా కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ‘ఆచార్య’ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు చిరు. తాజాగా ఆయన ఓ ఆంగ్ల న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఆచార్య’ తన కుటుంబానికి ఎంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చారు.
అలాగే తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ.. ‘హిందీ సినీ ఇండస్ట్రీలో కపూర్ ఫ్యామిలీకి ఎంతో గొప్ప పేరు ఉంది. హిందీ ఇండస్ట్రీ అంటే కపూర్ ఫ్యామిలీ. కపూర్ ఫ్యామిలీ అంటే హిందీ ఇండస్ట్రీ అని చెప్పుకునేవారు. అలాంటి గొప్ప గౌరవం తెలుగులో మెగా ఫ్యామిలీకి దక్కాలన్నది నా కోరిక. మా ఫ్యామిలీ నుంచి హీరోలుగా వచ్చిన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లు హీరోలుగా గొప్పగా రాణిస్తూ ఇండస్ట్రీలో తమకంటూ ఓ స్టేటస్ తెచ్చుకున్నారు.
Also Read: NTR – Rajamouli: ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్ లో ఆగిపోయిన సినిమా ఏమిటో తెలుసా?
వాళ్ళ కెరీర్ పట్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను’ అంటూ చిరు చెప్పుకొచ్చారు. అలాగే చిరు ఇంకా మాట్లాడుతూ.. ‘హిందీ పరిశ్రమలో మనం ఎన్నో అనుమానాలు భరించాం. ఢిల్లీ లో హిందీ సినిమా ఇండస్ట్రీకి ఓ గౌరవం ఉంది. హిందీ సినీ పరిశ్రమకు పెద్ద పీట వేసేవారు. కానీ.. తెలుగు సినిమాలను తెలుగు హీరోలను పెద్దగా పట్టించుకునే వారు కాదు. అప్పుడు నాకు చాలా అవమానంగా అనిపించేది.
ఐతే ఇప్పుడు బాహుబలి, ట్రిపుల్ ఆర్, పుష్ప, రాధే శ్యామ్ వంటి తెలుగు సినిమాలతో మన క్రేజ్ ఇండియా వైడ్ గా విస్తరించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. తెలుగుకి ప్రతి భాషలో గొప్ప గౌవరం దక్కింది. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ నే చెప్పుకునేవారు. కానీ.. సినిమా అంటే తెలుగు సినిమా అంటున్నారు. ముఖ్యంగా బాహుబలి తర్వాత తెలుగు చిత్రసీమకు గొప్ప గౌరవం దక్కింది.
నేను ఎక్కడికి వెళ్లినా పదే పదే టాలీవుడ్ ని పొగుడుతున్నారు’ అంటూ చిరు క్రేజీ కామెంట్స్ చేశారు. ఇక ఆచార్య పై ఇప్పటికే మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ కలిసి ఈ భారీ సినిమాని నిర్మిస్తున్నారు. చిరు – చరణ్ మధ్య ఉండే సన్నివేశాలు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్ మెంట్ అందిస్తాయట. ఈ చిత్రం రన్ టైం 2 గంటల 58 నిమిషాలు ఉండనుంది.
Also Read:Air Conditioner Side Effects: ఏసీ వినియోగిస్తున్నారా? అయితే జాగ్రత్తలు పాటించాల్సిందే?