https://oktelugu.com/

NTR – Rajamouli: ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్ లో ఆగిపోయిన సినిమా ఏమిటో తెలుసా?

NTR – Rajamouli: మన టాలీవుడ్ లో కేవలం అభిమానులు మాత్రమే కాకుండా ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిని కనబరిచే కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి..అలాంటి కాంబినేషన్స్ లో ఒక్కటే ఎన్టీఆర్ మరియు రాజమౌళి కాంబినేషన్..రాజమౌళి తోలి సినిమా ఎన్టీఆర్ హీరో గా నటించిన స్టూడెంట్ నెంబర్ 1 అనే సినిమాతో ప్రారంభం అయినా సంగతి మన అందరికి తెలిసిందే..తోలి సినిమా తోనే రాజమౌళి ఇండస్ట్రీ లో సెన్సేషన్ సృష్టించాడు..అతి తక్కువ థియేటర్స్ లో విడుదల అయినా ఈ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 27, 2022 / 02:41 PM IST
    Follow us on

    NTR – Rajamouli: మన టాలీవుడ్ లో కేవలం అభిమానులు మాత్రమే కాకుండా ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిని కనబరిచే కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి..అలాంటి కాంబినేషన్స్ లో ఒక్కటే ఎన్టీఆర్ మరియు రాజమౌళి కాంబినేషన్..రాజమౌళి తోలి సినిమా ఎన్టీఆర్ హీరో గా నటించిన స్టూడెంట్ నెంబర్ 1 అనే సినిమాతో ప్రారంభం అయినా సంగతి మన అందరికి తెలిసిందే..తోలి సినిమా తోనే రాజమౌళి ఇండస్ట్రీ లో సెన్సేషన్ సృష్టించాడు..అతి తక్కువ థియేటర్స్ లో విడుదల అయినా ఈ సినిమా అప్పట్లోనే 14 కోట్ల రూపాయిల షేర్ వరుకు రాబట్టింది..మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పమనక్కర్లేదు..మాస్ లో ఎన్టీఆర్ క్రేజ్ ని ఈ సినిమా వేరే లెవెల్ కి తీసుకెళ్లింది..ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ కొనేళ్లు వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడ్డాడు..అప్పుడు మళ్ళీ ఆయన రాజమౌళి తో తీసిన యమదొంగ సినిమా ద్వారా సెన్సషనల్ రికార్డ్స్ సృష్టించి సరికొత్త ఇన్నింగ్స్ ని ప్రారంబించాడు.

    NTR – Rajamouli

    యమదొంగ సినిమా తర్వాత మళ్ళీ ఇన్నేళ్లకు వీళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన #RRR మూవీ ఎంతతి సెన్సషనల్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..విడుదల అయినా అన్ని భాషలకు కలిపి ఈ సినిమా ఇప్పటి వరుకు 1100 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..అయితే తొలుత #RRR కి ముందుగా ఎన్టీఆర్ తో రాజమౌళి గరుడ అనే సోలో సినిమా చెయ్యాల్సి ఉండింది అట..అప్పట్లో ఈ సినిమా స్టోరీ డిస్కషన్స్ జరిగాయి అనే వార్తలు కూడా వచ్చాయి.

    Also Read: Navneet & Ravi Rana: మన తెలుగు హీరోయిన్/ ఎంపీ ‘నవనీత్ ’ మహారాష్ట్రలో ఇలా ఎందుకు రచ్చ చేస్తోంది? వెనుక ఎవరున్నారు?

    కానీ ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ, ఆ సినిమాకి బదులు #RRR లాంటి మల్టీస్టార్ర్ర్ చేసాడు రాజమౌళి..భవిష్యత్తులో అయినా ఆ సినిమా ఉంటుందా లేదా అంటూ రాజమౌళి ని ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా లో ట్యాగ్ చేసి అడుగుతున్నారు..ఒక్కవేల మరోసారి ఎన్టీఆర్ తో సినిమా చేస్తే రాజమౌళి కచ్చితంగా ఈ స్టోరీ నే ఎంచుకుంటాడు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.

    NTR – Rajamouli

    ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా తర్వాత గీత ఆర్ట్స్ లో అల్లు అర్జున్ తో ఒక్క మూవీ ఉంటుంది అనే టాక్ వినిపిస్తుంది..ఈ రెండు సినిమాల తర్వాతనే ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్ లో మరో సినిమా వచ్చే అవకాశం ఉంటుంది అని వినికిడి..ఇక ఎన్టీఆర్ కూడా #RRR తర్వాత ప్రముఖ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు..ఈ మూవీ జూన్ నెల నుండి షూటింగ్ కార్యక్రమాలు ప్రారంబించుకోనుంది..ఈ సినిమా తర్వాత ఆయన KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్నారు..ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యిపోయిన తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు అనే టాక్ వినిపిస్తుంది..చేతిలో ఉన్న ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి అయినా తర్వాతనే రాజమౌళి తో సినిమా ఉందే అవకాశం ఉంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.

    Also Read:Nagababu Chit Chat: పవన్ సీఎం కాగానే అది గ్యారంటీ.. నాగబాబు వ్యంగ్యాస్త్రలు !

    Tags