https://oktelugu.com/

ఆ హీరో స్నేహానికి కృష్ణ ఎంతో విలువ ఇస్తారట !

అవి ‘జై ఆంధ్రా’ కోసం ఉద్యమం జరుగుతున్న రోజులు. నిర్మాత హనుమాన్‌ ప్రసాద్‌ నుండి విజయవాడలో వ్యాపారం చేసుకుంటున్న ఒక కుర్రాడికి ఫోన్ వచ్చింది. మీ ఫోటోలు చూశాము, మద్రాసు వస్తే.. మేకప్ టెస్ట్ చేద్దాం, రండి అని అడ్రెస్ చెప్పి ఫోన్ పెట్టేశారు. విషయం ఆ కుర్రాడు తన సన్నిహితులకు వివరంగా చెప్పాడు. అందరూ ‘వెళ్లు వెళ్లు’ అంటూ ఆ కుర్రాడిని ప్రోత్సహించారు. కానీ అతనికి ఎక్కడో భయం. ఒకవేళ ఫిల్మ్ సక్సెస్ కాకపోతే ? […]

Written By:
  • admin
  • , Updated On : June 19, 2021 / 05:41 PM IST
    Follow us on

    అవి ‘జై ఆంధ్రా’ కోసం ఉద్యమం జరుగుతున్న రోజులు. నిర్మాత హనుమాన్‌ ప్రసాద్‌ నుండి విజయవాడలో వ్యాపారం చేసుకుంటున్న ఒక కుర్రాడికి ఫోన్ వచ్చింది. మీ ఫోటోలు చూశాము, మద్రాసు వస్తే.. మేకప్ టెస్ట్ చేద్దాం, రండి అని అడ్రెస్ చెప్పి ఫోన్ పెట్టేశారు. విషయం ఆ కుర్రాడు తన సన్నిహితులకు వివరంగా చెప్పాడు. అందరూ ‘వెళ్లు వెళ్లు’ అంటూ ఆ కుర్రాడిని ప్రోత్సహించారు.

    కానీ అతనికి ఎక్కడో భయం. ఒకవేళ ఫిల్మ్ సక్సెస్ కాకపోతే ? పైగా ఇప్పుడు తాను చేస్తోన్న బిజినెస్‌ బావుంది, ఫ్యామిలీ లైఫ్ కూడా చాల బాగుంది. ఇవన్నీ వదులుకుని ఎందుకు వెళ్లాలి ? అని చెబుతున్నాడు. ఏ..? మరి నీ స్నేహితుడు కృష్ణ ఎందుకు సినిమాల్లోకి వెళ్ళాడు ?. ఆ మాటకు ఆలోచనలో పడ్డాడు ఆ కుర్రాడు. ఒక్కసినిమా హిట్‌ అయితే చాలు, జీవితం మరోలా ఉంటుంది.. తన ఫ్రెండ్ కృష్ణ లైఫ్ ను దగ్గర ఉండి చూశాడు.

    అందుకే తనకు అలాంటి లైఫ్ వచ్చే అవకాశం ఉంది. అందుకే ‘జై ఆంధ్రా’ ఉద్యమంలో కూడా విజయవాడ నుంచి నెల్లూరు దాకా ఒక లారీ పట్టుకుని వెళ్లి, అక్కడినుంచి మద్రాసుకు చేరుకున్నాడు. కానీ మద్రాసులో కూడా ‘జై ఆంధ్రా’ మూమెంటే కనిపిస్తోంది. పైగా అక్కడ మన తెలుగు హీరోలు, సినిమా వాళ్లందరూ పానగల్లు పార్కులో నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు.

    సరే.. తన స్నేహితుడి కృష్ణ గురించి ఆరా తీస్తే, తను కూడా అక్కడే ఉన్నాడని చెప్పారు. ఇక ఎలాగోలా కష్టపడి అతను పానగల్లు పార్కుకు వెళ్లి కృష్ణని కలిసి కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు. కృష్ణ కూడా స్నేహితుడిని ప్రేమగా పలకరించి ‘ఏంటి రాజబాబు..ఎలా ఉన్నావ్‌. ఎంతసేపైంది వచ్చి?’ అంటూ మాటలు కలిపారు. గంట సేపు వరకు ఆ మాటలు సాగాయి.

    కానీ ఆ మాటలలో తన మేకప్‌టెస్ట్‌ గురించి అతను కృష్ణకు చెప్పలేదు.అలాగే కృష్ణ కూడా తన స్నేహితుడు మేకప్ టెస్ట్ కోసం వచ్చాడని, ఆ టెస్ట్ ఏమైంది అని అడగలేదు. కట్ చేస్తే.. నాలుగు నెలలు తర్వాత సినిమా షూటింగ్ మొదలు అయింది. ఆ కుర్రాడే సినిమా హీరో అయ్యాడు. అయితే ఒక రోజు షూటింగ్ ముగిసిన తరుత నిర్మాత వచ్చి..

    మీ ఫ్రెండ్ కృష్ణ గారు ఎప్పటికప్పుడు సినిమా గురించి అడిగి తెలుసుకుంటున్నారు. నీ మేకప్ టెస్ట్ రోజు కూడా కృష్ణగారు ఫోన్ చేసి మరి నీ గురించి బాగా చెప్పారు. ఆ మాటకు షాక్ అయ్యాడు. ఆ కుర్రాడు. ఇంతకీ ఆ కుర్రాడే మురళీమోహన్. స్నేహానికి కృష్ణగారు ఎంతో విలువ ఇస్తారు.