లాక్ డౌన్ ఎత్తివేత.. జులై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేస్తూ శనివారం నిర్ణయం తీసుకుంది. దీంతో వచ్చే నెల జులై 1 నుంచి విద్యాసంస్థల ప్రారంభానికి చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది. కరోనా వైరస్ మూడో దశ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా విద్యాసంస్థలను ఓపెన్ చేయాలని స్పష్టం చేసింది. దీంతో ఇది సాహసోపేత నిర్ణయమనే చెప్పాలి. విద్యాసంస్థల ప్రారంభమై విద్యాశాఖ అధికారులకు సంబంధిత మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మూడో దశ భయాందోళనలు నెలకొన్న దృష్ట్యా తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత […]

Written By: Srinivas, Updated On : June 19, 2021 5:31 pm
Follow us on

తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేస్తూ శనివారం నిర్ణయం తీసుకుంది. దీంతో వచ్చే నెల జులై 1 నుంచి విద్యాసంస్థల ప్రారంభానికి చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది. కరోనా వైరస్ మూడో దశ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా విద్యాసంస్థలను ఓపెన్ చేయాలని స్పష్టం చేసింది. దీంతో ఇది సాహసోపేత నిర్ణయమనే చెప్పాలి.

విద్యాసంస్థల ప్రారంభమై విద్యాశాఖ అధికారులకు సంబంధిత మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మూడో దశ భయాందోళనలు నెలకొన్న దృష్ట్యా తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అయితే విద్యార్థుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించేలా తప్పనిసరిగా ఆదేశాలు పాటించాల్సి ఉంటుంది.

కరోనా కేసులు తగ్గడంతో తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం జరిగిన కేబినెట్ సమావేశం జరిగింది. వైరస్ తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ ఎత్తివేయాలని నిర్ణయించారు. రాష్ర్టంలో 12 వ తేదీ నుంచి లాక్ డౌన్ విధించారు. తొలుత ఉదయం 6 నుంచి 10 గంటల వరకే బయటకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.

తరువాత దాన్ని మధ్యాహ్నం 1 గంట వరకు పొడిగించారు. తర్వాత సాయంత్రం 5 గంటల వరకు విధించారు. ఆదివారం నుంచి సినిమా థియేటర్లు ప్రారంభం కానున్నాయి. లాక్ డౌన్ వల్ల సినిమా హాళ్లు దాదాపు మూసి ఉంటున్నాయి. కేసులు తగ్గడంతో వాటిని ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో సినీ పరిశ్రమకు ప్లస్ కానుంది.