Homeఎంటర్టైన్మెంట్Sonu Sood: రియల్ హీరో సోనూసూద్ కి నోటీసులు జారీ... ఎందుకంటే ?

Sonu Sood: రియల్ హీరో సోనూసూద్ కి నోటీసులు జారీ… ఎందుకంటే ?

Sonu Sood: రియల్ హీరో నటుడు సోనూసూద్‏కు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మరోసారి షాకిచ్చింది. ఆరు అంతస్తుల నిర్మాణాన్ని హోటల్‏గా మార్చారని సోనూసూద్‏కు కార్పొరేషన్ వారు నోటీసులు జారీ చేశారు. ఆరు అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం కాగా దానిని హోటల్‏గా మార్చారని… తిరిగి ఆ భవనాన్ని ఇంటిగా పునరుద్దరించాలని గుర్తు చేస్తూ నవంబర్ 15న నోటిసులు జారీ చేసింది బీఎంసీ. ఈ మేరకు మహారాష్ట్రకు చెందిన హక్కుల కార్యకర్త గణేశ్ కుస్ములు సోనూసూద్ పై బీఎంసీకి కంప్లైంట్ చేశారు.

mumbai muncipal corporation issues notice to sonusood

రెసిడెన్షియల్ భవనాన్ని మొదట బాలికల వసతి గృహంగా, ఆ తర్వాత హోటల్‏గా మార్చారని తన ఫిర్యాదులో పేర్కోన్నాడు. అందువల్ల ఈ భవంతిని కూల్చేయాలని ఆయన కోరారు. దీంతో ఈ ఏడాది ప్రారంభంలోనే బీఎంసీకి సోనూసూద్ కు మధ్య సంప్రదింపులు జరిగాయి. ఇక ఇదే విషయంపై సోనూసూద్ సుప్రీం కోర్టు వరకు వెళ్లారు. ఆ తర్వాత విచారణ అనంతరం తన పిటిషన్‏ను వెనక్కు తీసుకుని ఆ హోటల్‏ను తిరిగి నివాస భవనంగా మార్చేందుకు అంగీకరించారు. ఇక తాజాగా బీఎంసీ పంపిన నోటీసులో ” భవనంలోని 1 నుంచి 6వ అంతస్థులలో మీరు వసతి… బోర్డింగ్ కార్యకలాపాలను నిలిపివేసినట్లుగా లేఖలో పేర్కోన్నారు.

మంజూరైన ప్లాన్ ప్రకారం ఆ భవనం కేవలం నివాస అవసరాలకు మాత్రమే ఉపయోగించబడుతుందని పేర్కోన్నారు. అదనంగా/మార్పు/పురోగతిలో అవసరమైన పని మార్పు ఉంది. కానీ అక్టోబర్ 20న భవనాన్ని చెక్ చేయగా.. ఆమోదించబడిన ప్లాన్ ప్రకారం మీరు ఇంకా ఆ భవనాన్ని పునరుద్ధరించలేదు. మీరు భవనాన్ని నివాసం కోసం పునరుద్దరిస్తామని జూలైలోనే మాకు హామీ ఇచ్చారు ” అంటూ గుర్తు చేసింది బీఎంసీ. ఇక ఆ భవనం పునరుద్ధరణ కోసం సోనూసూద్ కు ఏడు రోజుల సమయం ఇచ్చింది బీఎంసీ.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version