SonuSood: యాక్షన్ థ్రిల్లర్​తో హీరోగా రానున్న సోనూ.. షూటింగ్​ ప్రారంభం అప్పుడే

SonuSood: బాలీవుడ్​ స్టార్​ నటుడు సోనూసూద్​ హీరోగా కనిపించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు విలన్​గా మాత్రమే కనిపించిన సోనూ.. కొత్త సినిమాతో హీరోగా వస్తున్నాడు. జీ స్టూడియోస్​ తాజాగా తన తదుపరి యాక్షన్ చిత్రాన్ని ప్రటించింది. ఫతే టైటిల్​తో రానున్న ఈ సినిమాలో సోనూ సూద్​ హీరోగా కనిపించనున్నారు. అభినందన్​ గుప్తా దర్శకత్వం వహిస్తోన్నఈ సినమాను నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో సోను సూద్​ను […]

Written By: Raghava Rao Gara, Updated On : December 23, 2021 2:05 pm
Follow us on

SonuSood: బాలీవుడ్​ స్టార్​ నటుడు సోనూసూద్​ హీరోగా కనిపించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు విలన్​గా మాత్రమే కనిపించిన సోనూ.. కొత్త సినిమాతో హీరోగా వస్తున్నాడు. జీ స్టూడియోస్​ తాజాగా తన తదుపరి యాక్షన్ చిత్రాన్ని ప్రటించింది. ఫతే టైటిల్​తో రానున్న ఈ సినిమాలో సోనూ సూద్​ హీరోగా కనిపించనున్నారు. అభినందన్​ గుప్తా దర్శకత్వం వహిస్తోన్నఈ సినమాను నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.

ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో సోను సూద్​ను మునుపెన్నడు చూడని విభిన్న పాత్రలో చూడబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ముఖ్యంగా అబ్బురపరిచే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్​ చేస్తాయట.  జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సెట్స్​ పైకి వెళ్లనుంది.

కాగా, కరోనా కాలంలో ఎంతో మంది పేద ప్రజలకు సాయంగా ఉంటూ సూపర్​హీరోగా మారిపోయారు. ఇప్పటికే కొన్ని వేల మందికి అండగా నిలిచి.. వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఇప్పటికీ సాయమని అడిగిన వారికి లేదనకుండా చేయి అందిస్తున్నారు. కాగా, సోనూ చివరగా రోహిత్​ శెట్టి కాప్​ యూనివర్స్​ సింబాలో కనిపించారు. ఇప్పటి వరకు రియల్​ లైఫ్​ హీరోగా గుర్తంపు పొందిన సోనూ.. సినిమాలోనూ హీరోగా కనిపించేందుకు రెడీ అయిపోయాడు. ఇప్పటి వరకు విలన్​గానే కనిపించిన సోనూను హీరోగా ఎలా ఆదరిస్తారో చూడాలి.