https://oktelugu.com/

Manchu Mohanbabu: బాలయ్య అఖండ చిత్రంతో ఇండస్ట్రికి మళ్ళీ ఊపిరిపోశాడు: మోహన్ బాబు

Manchu Mohanbabu:  నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘అఖండ’. ఈ సినిమాలో ప్రగ్యాజైస్వాల్‌ హీరోయిన్‌గా నటించగా… ప్రముఖ హీరో శ్రీకాంత్ విలన్ గా నటించారు. అలానే జగపతిబాబు, పూర్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కాగా మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న విడుద‌లై ‘అఖండ’ విజయాన్ని దక్కించుకుంది. కలెక్షన్ల పరంగా ధియేటర్లలో మోత మోగిస్తుంది ఈ చిత్రం. ముఖ్యంగా బాలయ్య అఘోరా పాత్రలో నట విశ్వరూపం చూపించారని […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 6, 2021 / 08:17 PM IST
    Follow us on

    Manchu Mohanbabu:  నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘అఖండ’. ఈ సినిమాలో ప్రగ్యాజైస్వాల్‌ హీరోయిన్‌గా నటించగా… ప్రముఖ హీరో శ్రీకాంత్ విలన్ గా నటించారు. అలానే జగపతిబాబు, పూర్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కాగా మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న విడుద‌లై ‘అఖండ’ విజయాన్ని దక్కించుకుంది. కలెక్షన్ల పరంగా ధియేటర్లలో మోత మోగిస్తుంది ఈ చిత్రం. ముఖ్యంగా బాలయ్య అఘోరా పాత్రలో నట విశ్వరూపం చూపించారని చెప్పాలి. శ్రీకాంత్ కూడా విలన్ గా తన నటనతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లారు.

    ఇక ఈ విజయంతో బాలయ్య అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దుగా మారింది. ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ‘అఖండ’ సినిమాపై పలువురు ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌, రామ్‌, కళ్యాణ్ రామ్‌, అనిల్‌ రావిపూడి ఈ సినిమాను వీక్షించి తమ అభిప్రాయాలను సోషల్‌ మీడియాలో పంచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ ‘అఖండ’ సినిమాను ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో ‘కరోనా ప్రభావంతో థియేటర్లకి ప్రేక్షకులు రారు… చూడరు అనుకుంటున్న క్లిష్టపరిస్థితుల్లో ‘అఖండ’ సినిమా విజ‌యం సినీ పరిశ్రమకి మళ్లీ ఊపిరి పోసింది అని రాశారు. దీంతో విడుదలకి సిద్ధంగా ఉన్న మరికొన్ని చిత్రాలకు ధైర్యాన్నిచ్చింది. నా సోదరుడు బాలయ్యకు, దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాటు ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు. అదేవిధంగా ఈ మంచి సినిమాని ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ మోహన్‌బాబు పేర్కొన్నారు.