https://oktelugu.com/

జనసైనికులు మారాల్సిన టైం వచ్చిందా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, జనసైనికులు మారాల్సిన టైం వచ్చినట్లు కన్పిస్తుంది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతోపాటు సినిమాల్లో బీజీగా ఉన్నారు. సినిమా బ్యాక్ గ్రౌండే పవన్ కల్యాణ్ కి బలం.. అదే అతడికి కొండంత క్రేజ్. అయితే రాజకీయాల్లో ఆయనకు ఈ క్రేజీ ఏమాత్రం ఉపయోగపడలేదని కిందటి ఎన్నికలతోనే తేలిపోయింది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను నమ్మే రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఫ్యాన్స్ మాత్రం సినిమాలను.. రాజకీయాలను వేరుగా చూస్తున్నట్లు తేలిపోయింది. సినిమాల్లో ఆయనను […]

Written By: , Updated On : September 11, 2020 / 04:03 PM IST
Janasena

Janasena

Follow us on

Janasenaపవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, జనసైనికులు మారాల్సిన టైం వచ్చినట్లు కన్పిస్తుంది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతోపాటు సినిమాల్లో బీజీగా ఉన్నారు. సినిమా బ్యాక్ గ్రౌండే పవన్ కల్యాణ్ కి బలం.. అదే అతడికి కొండంత క్రేజ్. అయితే రాజకీయాల్లో ఆయనకు ఈ క్రేజీ ఏమాత్రం ఉపయోగపడలేదని కిందటి ఎన్నికలతోనే తేలిపోయింది.

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను నమ్మే రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఫ్యాన్స్ మాత్రం సినిమాలను.. రాజకీయాలను వేరుగా చూస్తున్నట్లు తేలిపోయింది. సినిమాల్లో ఆయనను ఆరాధించి ఫ్యాన్స్ మాత్రం ఓట్ల విషయానికొచ్చే సరికి మాత్రం పక్క పార్టీలవైపు చూస్తుండటం గమనార్హం. అందువల్లే కిందటి ఎన్నికల్లో జనసేన పార్టీ కేవలం ఒక్కటంటే ఒక్క సీటును గెలుచుకుంది.

Also Read: చంద్రబాబు గారూ…. మీరు మాట్లాడేది మీకైనా అర్థమవుతుందా….?

పవన్ కల్యాన్ ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అయితే ఆయన ఎప్పుడు కూడా పూర్తి టైం రాజకీయాలకు కేటాయించిలేదు. అటూ సినిమాలు చేస్తూనే ఇటు రాజకీయాలు చేస్తున్నారు. పవన్ పార్ట్ టైం రాజకీయాలు చేస్తుండటంతో ప్రజలు ఆయనను ఇంకా సినిమా స్టార్ గానే చూస్తున్నారు. మరీ పవన్ ఫ్యాన్స్ అయినా ఆయన వైపు ఉన్నారా? అంటే అది కూడా లేదని ఎన్నికల రిజల్ట్ ను బట్టి తెలుస్తోంది.

ఇదిలా ఉంటే పవన్ ఫ్యాన్స్, జనసైనికులు మీడియాకుగానీ.. ఇతర పార్టీల ట్రాపులో ఈజీ పడిపోతున్నారు. ప్రజా పోరాటాలపై కాకుండా అనవస విషయాల్లో స్పందిస్తూ జనసేన పార్టీని ప్రజల్లో మరింత చులకగా భావాన్ని తీసుకొస్తున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ పుట్టిన సందర్భంగా పవన్ ఫ్యాన్స్, జనసైనికులు పంతంపట్టి #Happy Birthday Power star Pawan Kalyan ట్యాగులతో రికార్డు సృష్టించారు.

పవన్ కల్యాణ్ అభిమాని, నటి మాధవీలత ఇటీవల పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఓ లేఖ రాసింది. పవన్ కల్యాణ్ అనవసరమైన వారికి రిప్లయ్ ఇస్తూ.. తన అభిమానులను పట్టించుకోలేదని అనే అంశాన్ని లేఖలో పేర్కొంది. దీనిని టీవీ9 పదేపదే టెలికాస్ట్ చేసింది. ఆ టీవీ తీరును జనసేన పార్టీ తప్పుబడుతూ లేఖ కూడా రాసింది. ఈ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ #shamelesstv9 అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేశారు.

అయితే ఆ వెంటనే టీవీ9 తనపై వచ్చిన మచ్చను చెరుపుకునేందుకు పవన్ తో ‘వకీల్ సాబ్’ చిత్రం తెరకెక్కిస్తున్న దర్శకుడు వేణు శ్రీరామ్ తో ఇంటర్వ్యూ టెలికాస్ట్ చేసింది. దీనికి జనసేన, పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సదరు ఛానల్ ను తిట్టిననోటితో.. పొడిడేలా చేసుకుంది. ఇలా పవన్ ఫ్యాన్స్, జనసేనికులు మీడియా, ఇతర పార్టీల ట్రాపులో పడిపోతున్నారు. వారు ఆడించినట్లు ఆడుతున్నారు.

Also Read: వైసీపీ మద్దతు కోసం బీజేపీ విన్నపాలు… జగన్ ఏం చేస్తారో…?

దీంతో జనసేన పార్టీకి రాజకీయాల్లో సీరియస్ లేదని ప్రచారం జనాల్లోకి వెళుతోంది. ఇప్పటికైనా పవన్ ఫ్యాన్ష్ ఆచితుచి వ్యవహరించాలని లేకపోతే జనసేన పార్టీకి తీరని నష్టం ప్రమాదం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పవన్ ఫ్యాన్స్, జనసైనికులు తీరు మార్చుకుంటారో.. లేదో వేచి చూడాల్సిందే..!