spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss OTT Telugu Elimination: ముగిసిన ముమైత్ ఖాన్ ప్రయాణం.. కారణం వాళ్లే...

Bigg Boss OTT Telugu Elimination: ముగిసిన ముమైత్ ఖాన్ ప్రయాణం.. కారణం వాళ్లే !

Bigg Boss OTT Telugu Elimination: బిగ్‌బాస్ అభిమానులను భారీ అంచనాలతో అలరించడానికి గ్రాండ్ గా లాంచ్ అయిన ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ ఫస్ట్ వీకెండ్ గడిచింది. ఇక మొదటి వారంలో ఇంటి నుంచి బయటకు ఎవరు వస్తారా ? అని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, ముమైత్ ఖాన్ ఫస్ట్ వీక్ లోనే బయటకు వచ్చేసింది. ఎలిమినేషన్‌ లో సరయు, ముమైత్ ఖాన్‌లు చివరి వరకు మిగిలారు. ఓ దశలో తానే కచ్చితంగా ఎలిమినేట్ అవుతాను అంటూ సరయు వెక్కి వెక్కి ఏడ్చేసింది కూడా.

Bigg Boss OTT Telugu Elimination
Mumaith Khan

‘7 ఆర్ట్స్ సరయు.. 7 డేస్ సరయు’ అంటూ మళ్లీ తనను బ్యాడ్ గా ట్రోల్స్ చేస్తారంటూ సరయు తట్టుకోలేకపోయింది. కట్ చేస్తే.. సరయు, ముమైత్ ఖాన్‌ లలో ముమైత్ ఎలిమినేట్ అయ్యింది. ఇక తాను సేఫ్ అయ్యాను అని తెలిసినా కూడా సరయు తన ఎమోషన్ని అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయింది. పెద్దగా గుక్కపట్టి ఏడ్చేసింది. అయితే, విచిత్రంగా తానూ ఎలిమినేట్ అయ్యానని తెలిశాక కూడా ముమైత్ ఖాన్ మాత్రం అలాగే నవ్వుతూ కనిపించింది.

పైగా ఎవ్వరూ తన వద్దకు రావొద్దని, తనను కొంత సేపు వదిలేయండని ముమైత్ ఖాన్ మధ్యలో సీరియస్ కూడా అయ్యింది. వెంటనే ముమైత్ ఖాన్ స్మోకింగ్ జోన్‌లోకి వెళ్లి స్కోక్ చేస్తూ కొన్ని ఆరోపణలు కూడా చేసింది. నన్ను కావాలనే బ్యాడ్ చేస్తున్నారు అని, బయటకు కూడా తనను అలానే చూపిస్తున్నారు అంటూ ముమైత్ ఫీల్ అయ్యింది.

పనిలో పనిగా అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ అరియానా, తేజస్వీ, అషూ ఇలా కనిపించిన వారందరికీ ముమైత్ ఖాన్ ఒక సలహా పడేసింది. మరి ఆ జాగ్రత్త ఎదో తానే తీసుకుని ఉండి ఉంటే.. మరో రెండు వారాలు అయినా హౌస్ లో ఉండేది కదా అని నెటిజన్లు కూడా ముమైత్ పై సెటైర్లు వేస్తున్నారు. ఇక స్టేజ్ మీదకు రాగానే ముమైత్ తెగ కన్నీరు పెట్టేసుకుంది.

Bigg Boss OTT Telugu Elimination
Bigg Boss OTT Telugu Elimination

ఫస్ట్ సీజన్‌ లో తన పై పడిన బ్యాడ్ మార్క్‌ ను పోగొట్టుకోవడానికి ఇప్పుడు వచ్చాను అని, కానీ ఇప్పుడు కూడా అదే బ్యాడ్ మార్క్ తో ఇంటికి వెళ్లిపోతుండటం తనను చాలా బాధిస్తోంది అంటూ ముమైత్ ఎమోషనల్ అవుతూ సెలవిచ్చింది. ఇక తనకు అందరూ అగ్రెసివ్ అనే ట్యాగ్ ఇచ్చి.. కావాలనే బ్యాడ్ చేశారు అంటూ శివ, చైతూ, బిందు మాధవి, మిత్రా శర్మలను వేస్ట్ అనేసింది. చివరకు ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ లో ముమైత్ ప్రయాణం ఇలా ముగిసింది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Sidiri Appalaraju Arrest

Sidiri Appalaraju Arrest: అరెస్టు చేసే దాకా తెచ్చుకున్న ఆ మాజీ మంత్రి!

Sidiri Appalaraju Arrest: ఎట్టకేలకు మాజీమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి...
Healthy Dinner

Healthy Dinner: రాత్రి సమయంలో ఈ ఆహారం తింటున్నారా…

Healthy Dinner: ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు ఉద్యోగాలు ఇతర కారణాలతో ఒత్తిడిని ఎదుర్కొని సరైన నిద్ర పోవడం లేదు. మరికొందరు రాత్రి సమయంలో జీర్ణం...
RRB JE Recruitment 2026

RRB JE Recruitment 2026: రైల్వేలో యువతకు బంపర్‌ ఆఫర్.. ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకోకండి!

RRB JE Recruitment 2026: భారతీయ రైల్వేలు దేశంలోని అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థల్లో ఒకటి. ఇప్పుడు ఆ సంస్థలోని ముఖ్యమైన టెక్నికల్‌ పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు (ఆర్‌ఆర్‌బీ)...
Cockroach Facts

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే...
JP Nadda

JP Nadda: నడ్డా చెప్పింది నిజమే.. పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు..

JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం....
Oktelugu Epaper