PV Sindhu Kacha Badam Song: సామాన్యులను కాదు.. సెలబ్రెటీలను కూడా ‘కచా బాదమ్’ సాంగ్ ఊపు ఊపేస్తోంది. ఓ వీధి వ్యాపారి పాడిన ఈ పాట ఇప్పుడు దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పాటగా నిలిచింది. సెలబ్రెటీలు సైతం ఈ పాటకు స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంటున్నారు.దీనికి మరింత ప్రాచుర్యం కల్పిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ వేరుశనగల వ్యాపారి భుబన్ బద్యాకర్ పాడిన ‘కచా బాదమ్ సాంగ్’ ఏ రేంజ్ కు వెళ్లిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సైకిల్ పై వేరుశనగలు అమ్ముకునే ఓ సాధారణ వ్యక్తిని పబ్ లో లైవ్ సింగర్ గా మార్చేసి పాడిన ఈ పాట దేశాన్ని షేక్ చేసింది. ఆ సాంగ్ ఒరిజినల్ ట్యూన్ కు, రీమిక్స్ చేసిన పాడిన విధానం అద్భుతంగా వచ్చేసింది. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో ఓ సెన్షేషన్. మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చేస్తున్నాయి.
Also Read: Ravichandran Ashwin :టెస్ట్ క్రికెట్ లో అశ్విన్ సంచలనం.. కపిల్ దేవ్ రికార్డ్ బద్దలు
అలాంటి హిట్ సాంగ్ కు స్పెప్పులేశారు వరల్డ్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు. ఇప్పటివరకూ ఈ పాటకు ఫిల్మ్ ఇండస్ట్రీ, స్పోర్ట్స్ స్టార్స్ పాదం కలపగా.. తాజాగా పీవీ సింధు సైతం ఈ పాటకు స్టెప్పులేసి అలరించింది.
కచ్చా బాదం సాంగ్ కు లయబద్దంగా స్టెప్పులు వేసిన పీవీ సింధు వీడియో ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది. యూట్యూబ్ లోనూ లక్షల్లో వ్యూస్, లైకులు వస్తున్నాయి. షేర్ చేసిన నాలుగు గంటల్లోనే రెండున్నర లక్షల మంది లైక్ లు కొట్టారు. సింధూను పొగడ్తలతో ముంచేశారు.
Also Read: KA Paul: పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే.. నన్ను ప్రధానమంత్రిని చేయండి.. కేఏ పాల్ కామెడీ కితకితలు..
భుబన్ బద్యాకర్ అనే వీధి వ్యాపారి పాడిన ఈ బెంగాలీ పాట ఇప్పుడు ప్రాంతాలు, భాషలకు అతీతంగా ఫేమస్ అయ్యింది. ఎక్కడ చూసినా ఈపాటనే హమ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ జనాలు ఎంజాయ్ చేస్తున్నారు.
View this post on Instagram