Mullapudi Brahmanandam: టాలీవుడ్ లో నేడు విచారకరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నిర్మాత ముళ్ళపూడి బ్రహ్మానందం(Mullapudi Brahmanandam) నేడు కన్ను మూసారు. ఆయన వయస్సు 68 ఏళ్ళు. టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ఆయన నిర్మించాడు. అయితే గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న బ్రహ్మానందం,, పరిస్థితి మరింత విషమించడంతో తన తుది శ్వాసని విడిచాడు. ఈయన ప్రాణాలను రక్షించేందుకు డాక్టర్లు చాలా గట్టి ప్రయత్నాలే చేసారు కానీ, చివరికి ఫలితం లేకుండా పోయింది. ఈయన ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకువై అత్యంత సన్నిహితుడు. ఈవీవీ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఆయన తనయుడు అల్లరి నరేష్(Allari Naresh) ని హీరో గా పెట్టి ‘నేను’ అనే చిత్రాన్ని నిర్మించాడు. నరేష్ కేవలం కామెడీ మాత్రమే చేయగలడు అని అనుకుంటున్న రోజుల్లో విడుదలైన ఈ చిత్రం నరేష్ లోని సరికొత్త యాంగిల్ ని ఆడియన్స్ కి పరిచయం చేసింది.
Also Read: ‘సికిందర్’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..సల్మాన్ కి ఇంత తక్కువనా?
కమర్షియల్ గా ఈ చిత్రం గొప్ప సక్సెస్ కాలేదు కానీ, అల్లరి నరేష్ కి మంచి పేరుని అయితే తీసుకొచ్చింది. ఈ చిత్రం తో పాటు అల్లుడు గారు వచ్చారు, మనోహరం, ఓ చిన్నదానా వంటి సినిమాలను నిర్మించాడు. వీటిలో మనోహరం, ఓ చిన్నదానా చిత్రాలు కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. నిర్మాతగా బ్రహ్మానందం ని ఇండస్ట్రీ లో నిలబెట్టాయి. కానీ ఎందుకో ఆయన సినీ ఇండస్ట్రీ అంటే రిస్క్ అని అనుకున్నాడో ఏమో తెలియదు కానీ, కొన్నాళ్ళకు సినీ ఇండస్ట్రీ కి దూరమై ఇతర వ్యాపారాల్లో గొప్పగా రాణించాడు. తన పిల్లలను జీవితం లో సెటిల్ కూడా చేసేశాడు. ప్రస్తుతం కుమారుడు ఆస్ట్రేలియా లో ఉద్యోగం చేస్తున్నాడు. తన తండ్రి చనిపోయాడు అనే వార్త తెలుసుకున్న కుమారుడు బుధవారం రోజున ఇండియా కి చేరుకోనున్నాడు. ఆయన వచ్చిన తర్వాత అంత్యక్రియ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా టాలీవుడ్ లో కొంతమంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేసారు, ఆయన ఆత్మా ఎక్కడున్నా శాంతిని కోరుకోవాలని ప్రార్థన చేసారు.