Mukul Dev Death News: తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లోనూ విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ముకుల్ దేవ్(Mukul Dev), రీసెంట్ గానే చనిపోయిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసిన సంగతి తెలిసిందే. హిందీ లో మంచి పాపులారిటీ ని సంపాదించిన తర్వాత ఈయన తెలుగులోకి రవితేజ ‘కృష్ణ’ చిత్రం ద్వారా విలన్ గా మన తెలుగు ఆడియన్స్ కి పరిచమయ్యాడు. ఈ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘జట్కా’ అనే క్యారక్టర్ ఆరోజుల్లో మంచి క్రేజ్ ని తెచ్చుకుంది. ఈ సినిమా ద్వారా వచ్చిన ఫేమ్ తో ఆయన తెలుగు లో ఏక్ నిరంజన్,సిద్ధం, కేడీ, అదుర్స్,బెజవాడ, నిప్పు,భాయ్ వంటి సినిమాలు చేసాడు. ఇందులో అత్యధిక శాతం సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
2019వ సంవత్సరం వరకు యాక్టీవ్ గా సినిమాలు చేస్తూ బిజీ గా ఉంటూ వచ్చిన ముకుల్ దేవ్,ఆ తర్వాత ఎందుకో కొంతకాలం వరకు సినిమాలకు దూరం అయ్యాడు. మళ్ళీ 2022 వ సంవత్సరం లో ‘అంత్ – ది ఎండ్’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన ముకుల్ దేవ్,మళ్ళీ మూడేళ్ళ గ్యాప్ తీసుకొని ఈ ఏడాది ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ చిత్రం లో నటించాడు. రీసెంట్ గానే ఈయనకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. ఆ తర్వాత ఇంతలోపే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. ముకుల్ దేవ్ ఎలా చనిపోయాడు అనే దాని గురించి సోషల్ మీడియా లో రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. ముకుల్ దేవ్ సోదరుడు రాహుల్ దేవ్(Rahul Dev) కూడా ఒక ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్ట్ మరియు విలన్ అనే సంగతి మన అందరికీ తెలిసిందే. రీసెంట్ గా ఆయన ముకుల్ దేవ్ చనిపోవడానికి గల కారణాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
Also Read: Kapil Dev : కపిల్ దేవ్ ను వెనక్కి నెట్టి అరుదైన రికార్డు ను దక్కించుకున్న బుమ్రా
ఆయన మాట్లాడుతూ ‘ముకుల్ దేవ్ మానిస్కంగా కృంగిపోవడం వల్ల చనిపోయాడు అంటూ సోషల్ మీడియా లో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. గత కొంతకాలం నుండి ముకుల్ దేవ్ ఆహరం సరిగా తీసుకోవడం లేదు. దీంతో అతని ఆరోగ్యం క్షీణించింది. వారం రోజుల పాటు ICU లో ఉన్నాడు. దానికి తోడు ఒంటరి తనం ముకుల్ దేవ్ ని వేధించేది. 2019 వ సంవత్సరం లో తండ్రి చనిపోయాడు. ఆ తర్వాత భార్య అతనితో విడాకులు తీసుకుంది. ఈ రెండు సంఘటనలు ముకుల్ దేవ్ ని మానసికంగా కృండదీసాయి. పట్టించుకునేవారు లేక ఒంటరి వాడు అయ్యాడు. ఇప్పుడిప్పుడే మళ్ళీ కోలుకొని సినిమాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలోపే ఇలా జరిగింది’ అంటూ చెప్పుకొచ్చాడు రాహుల్ దేవ్.