https://oktelugu.com/

Kapil Dev : కపిల్ దేవ్ ను వెనక్కి నెట్టి అరుదైన రికార్డు ను దక్కించుకున్న బుమ్రా…

ఇండియన్ టీమ్ ప్రస్తుతం తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతుంది. ఫార్మాట్ ఏదైనా కూడా గెలుపు ఒక్కటే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఇండియన్ టీమ్ లో చాలామంది ప్లేయర్లు వాళ్ళ సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 18, 2024 / 10:48 AM IST

    Kapil Dev

    Follow us on

    Kapil Dev : ఇండియన్ టీమ్ ప్రస్తుతం తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతుంది. ఫార్మాట్ ఏదైనా కూడా గెలుపు ఒక్కటే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఇండియన్ టీమ్ లో చాలామంది ప్లేయర్లు వాళ్ళ సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నారు. ఇక గత పది సంవత్సరాల క్రితం ఇండియన్ టీమ్ ఎలా ఉన్నా కూడా ఇప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్ గా తయారైంది. అన్ని ఫార్మాట్లల్లో నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకునే రేంజ్ లో మ్యాచ్ లను ఆడుతూ ముందుకు సాగుతుంది…

    బ్రిస్బెన్ వేదికగా ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరుగుతున్న మూడోవ టెస్ట్ మ్యాచ్ లో జస్ప్రిత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ వేస్తూ ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లకు చమటలు పట్టిస్తున్నాడు. మొదటి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు తీసి వాళ్ళ వెన్ను విరిచిన బుమ్రా సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా రెండు వికెట్లను తీసి వాళ్ళ జోరుకు బ్రేక్ వేశాడు. మొత్తానికైతే బుమ్రా హవా కొనసాగుతుందనే చెప్పాలి. ఫార్మాట్ ఏదైనా బూమ్రా వికెట్లు తీయడమే లక్ష్యంగా బౌలింగ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అతనికి ఈజీగా వికెట్లు దక్కుతుంటాయి. తద్వారా ప్రత్యర్థి బ్యాట్స్మెన్ లకి ఒత్తిడిని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. ఇక ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా గడ్డపైన అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా నిలవడం అనేది ఇప్పుడు అతనికి దక్కిన మరొక గొప్ప గౌరవంగా మనం భావించవచ్చు…ఇక ఇప్పటి వరకు బుమ్రా ఆస్ట్రేలియా మీద 52 వికెట్లు తీశాడు. లబుషన్ వికెట్ తీయడంతో 52 వికెట్లు తీసిన భారత బౌలర్ గా గుర్తింపు కూడా సంపాదించుకున్నాడు. అయితే ఇంతకుముందు ఈ రికార్డు ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ అయిన కపిల్ దేవ్ పేరు మీద ఉండేది. ఆయన 51 వికెట్లను తీశాడు. ఇక ఇప్పుడు బుమ్రా ఆ రికార్డును బ్రేక్ చేశాడు… ఆస్ట్రేలియా మీద అంత పెద్ద రికార్డును సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటివరకు చాలామంది ఇండియన్ బౌలర్లు ప్రయత్నం చేసినప్పటికి ఆయన రికార్డ్ ను బ్రేక్ చేయడం ఎవరివల్లా కాలేదు.

    బుమ్రా తనదైన రీతిలో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాట్స్మెన్ గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాడు. కాబట్టి అతను మాత్రమే ఈ రికార్డుని చాలా అలవోకగా అందుకోగలిగాడు…ఇక మొత్తానికైతే బుమ్రా లాంటి బౌలర్ ఉండడం వల్ల ఇండియన్ టీమ్ కి చాలా వరకు కలిసి వస్తుందనే చెప్పాలి. అతను ఇండియన్ టీమ్ ని గెలిపించిన వైనం మనం చూస్తూనే వస్తున్నాం.

    ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ టీమ్ ఈరోజు బౌలింగ్ లో స్ట్రాంగ్ గా ఉంది అంటే దానికి ముఖ్య కారణం జస్ప్రిత్ బుమ్రా అనే చెప్పాలి. ఒకప్పుడు ఇండియన్ టీమ్ కి పేసర్ల నుంచి చాలా కొరత ఏర్పడేది.

    దానివల్ల ఇండియన్ టీమ్ చాలా మ్యాచులను చివరి వరకు వచ్చి ఓడిపోతూ ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే బుమ్రా లాంటి ఒక స్టార్ పేసర్ ఇండియన్ టీం లో ఉండడం టీం కి బలాన్ని చేకూరుస్తుందనే చెప్పాలి.