Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ‘ చిత్రం విడుదలై 18 రోజులు పూర్తి అయ్యింది. ఈ 18 రోజుల గ్యాప్ లో ఎన్నో కొత్త సినిమాలు విడుదల అయ్యాయి. కానీ ఒక్క సినిమా కూడా ‘పుష్ప 2’ మేనియా ని అడ్డుకోలేకపోయాయి. ఇప్పటికీ ఈ చిత్రం ఆడియన్స్ కి మొట్టమొదటి ఛాయస్ గా ఉంది. మూడవ వీకెండ్ లో కూడా ఈ చిత్రానికి తెలుగు, హిందీ భాషల్లో భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. పైగా అల్లు అర్జున్ ఇప్పుడు తరచూ వార్తల్లో ఉంటున్నాడు. సంధ్య థియేటర్ లో తొక్కిసిలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీ లో అల్లు అర్జున్ ని తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలు మరోసారి నేషనల్ లెవెల్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇవన్నీ ఈ సినిమా వసూళ్ల పై నెగటివ్ ప్రభావం చూపకపోగా, అంతకు ముందు రోజు వచ్చిన వసూళ్లకంటే ఎక్కువ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం.
అయితే ఈ చిత్రం 18 రోజుల్లో ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టింది, 18 వ రోజు ఏ రేంజ్ వసూళ్లను నమోదు చేసింది అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం నిన్న ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు. నార్త్ ఇండియా లో అయితే హిందీ వెర్షన్ కి ఏకంగా 24 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు, 32 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా ఈ చిత్రానికి 18 వ రోజు 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఒక సినిమాకి ఇలాంటి సునామీ లాంటి లాంగ్ రన్ ని చూసి చాలా కాలం అయ్యిందంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.
మొత్తం మీద 18 రోజులకు గాను ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 1617 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. క్రిస్మస్ కి కచ్చితంగా భారీ స్థాయి వసూళ్లు వస్తాయి. క్రిస్మస్ తర్వాత వీకెండ్ కూడా కూడా ఉంది. కాబట్టి ఈ చిత్రం రెండు వేల కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, ఆల్ టైం ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ అవ్వడం కష్టమే కానీ, బ్రేక్ ఈవెన్ మార్కుని మాత్రం కచ్చితంగా అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. బ్రేక్ ఈవెన్ కి 213 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు అవసరం ఉండగా,ఈ వారం ఆ మార్కుని కూడా అందుకోబోతుంది. తమిళం, మలయాళం వెర్షన్స్ లో మాత్రం బ్రేక్ ఈవెన్ అందుకోవడం అసాధ్యమే, ఈ రెండు భాషల్లో భారీ డిజాస్టర్ గా నిల్చింది.