The Union Movie Review: ‘ది యునియన్’ ఫుల్ మూవీ రివ్యూ…

మార్క్ వాల్ బర్గ్, హల్ బెర్రి ఇద్దరు జంటగా నటించినా 'ది యూనియన్' సినిమా కథ విషయానికి వస్తే ఒక సిఐఎ ఎజెంట్ అందరి సమాచారాన్ని దొంగలించి పారిపోతాడు. ఇక అతన్ని పట్టుకోడానికి మైక్, రోగ్జైన్ ఇద్దరూ కలిసి ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వకుండా ఏం చేశారు అనేదే ఈ సినిమాలోని ప్రధానాంశం గా తెరకెక్కించారు.

Written By: Gopi, Updated On : August 17, 2024 12:24 pm

The Union Movie Review

Follow us on

The Union Movie Review: హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్ల నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అది పెను ప్రభంజనాన్ని సృష్టించడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న చాలా రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతాయి… ఇక ఆ క్రమంలోనే చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ‘ది యూనియన్’ అనే సినిమా నెట్ ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ లో అవలెబుల్ లో ఉంది…ఇక ఈ సినిమా ఎలా ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

మార్క్ వాల్ బర్గ్, హల్ బెర్రి ఇద్దరు జంటగా నటించినా ‘ది యూనియన్’ సినిమా కథ విషయానికి వస్తే ఒక సిఐఎ ఎజెంట్ అందరి సమాచారాన్ని దొంగలించి పారిపోతాడు. ఇక అతన్ని పట్టుకోడానికి మైక్, రోగ్జైన్ ఇద్దరూ కలిసి ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వకుండా ఏం చేశారు అనేదే ఈ సినిమాలోని ప్రధానాంశం గా తెరకెక్కించారు.. ఇక మైక్ రోగ్జైన్ కి క్రాష్ కోర్స్ ఇచ్చి తనకు తెలిసిన వాడు అవడంతో అతన్ని నియమించుకుంటుంది. ఆ క్రమం లో వీళ్లిద్దరి మధ్య ప్రేమ అనేది చిగురుస్తుంది. ఇక ఫైనల్ గా వన్ని పట్టుకున్నారా లేదా అసలేం జరిగింది అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు ఈ సినిమాని ఒక రొటీన్ రెగ్యూలర్ హాలీవుడ్ సినిమాల మాదిరిగానే తెరకెక్కించాడు. కానీ సీమ మొత్తం లో ఎక్కడ కూడా హై అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో సినిమాని తెరకెక్కించలేకపోవడం ఈ సినిమాకి ఒక మైనస్ గా మనం చెప్పుకోవచ్చు… ఇక సినిమా చూస్తున్నంత సేపు ఎంగేజింగ్ గా అనిపించినప్పటికీ ముందు హాలీవుడ్ సినిమాల్లో చేసిన సీన్లనే మనం రిపీటెడ్ గా చూస్తున్నాము అనే ఫీల్ అయితే కలుగుతుంది. కాబట్టి ఈ సినిమాలో దర్శకుడు కొత్తగా ఏమీ చూపించలేదని అనిపిస్తుంది…

మ్యూజిక్, సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే అవి చూడడానికి కొంతవరకు ఓకే అనిపించేలా ఉన్నాయి. మొత్తానికైతే ఈ సినిమా కథ బాగున్నప్పటికీ దాన్ని ఎంగేజింగ్ గా తీసుకెళ్లడంలో దర్శకుడు కొంతవరకు మాత్రమే సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు…నిజానికి స్పై థ్రిల్లర్ అంటే ఇంకా బాగా చూపించవచ్చు కానీ అలా చేయలేదు..ఫలితంగా ఇది ప్రేక్షకులను అంతగా ఎంటర్ టైన్ చేయలేదనే చెప్పాలి…

ఆర్టిస్ట్ లా పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే మార్క్ వాల్ బర్గ్, హాలి బెర్రీ ఇద్దరు చాలా మంచి పర్ఫామెన్స్ అయితే ఇచ్చారు… ఇక మొత్తానికైతే ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు సినిమా మొత్తాన్ని వాళ్ల భుజాలపై తీసుకెళ్లారనే చెప్పాలి. ఇక ఇంటర్వెల్ కి ముందు వచ్చే కొన్ని సీన్లలో వీళ్ళ హవ భావాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా రహస్యపు ఏజెంట్ ని పట్టుకోవడానికి వీళ్ళు చూపించిన తెగువ కూడా చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా అనిపిస్తుంది. ఇక ప్రతి సీన్లో వాళ్ళను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఒక డీసెంట్ పెర్ఫార్మెన్స్ ని ఇచ్చారు…ఇక చివర్లో హాలిబెర్రి చేసిన స్కిన్ షో కూడా ప్రేక్షకులను అలరిస్తుంది… ఇక మొత్తానికైతే వీళ్లు చాలా మంచి పర్ఫామెన్స్ అయితే ఇచ్చారు. కానీ సినిమాను ఇంకా గ్రిప్పింగ్ గా రాసుకొని ఉంటే ఫలితం ఇంకోలా వుండేది…

టెక్నికల్ అంశాలు

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే విజువల్స్ మాత్రం చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి. కానీ ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ తో నిండిపోతుంది అనుకున్న ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా కొంతవరకు నిరాశను కలిగిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసిన కూడా యాక్షన్ ఎలిమెంట్స్ అనేవి మనకు పెద్దగా కనిపించవు. ఒక స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అదొకటి చాలా మైనస్ గా మారిందనే చెప్పాలి. ఇంతకు ముందు గూఢచారి ఏజెంట్ గా వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలావరకు తన ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఇక స్పై థ్రిల్లర్ సినిమాలకి యాక్షన్ ఎపిసోడ్స్ చాలా కీలక పాత్రను పోషిస్తూ ఉంటాయి. కానీ ఇందులో అవి మాత్రం మిస్ అవ్వడం అనేది చాలావరకు మైనస్ అయింది… ఇక ఎడిటర్ కూడా తన ప్రతిభను చూపిస్తూ చాలా వరకు ప్రతి సీన్ ను షార్ప్ ఎడిట్ కట్ చేయడానికి ప్రయత్నం చేశాడు…అది కొన్ని చోట్ల వర్కౌట్ అయింది. కానీ ఇంకొన్ని ప్లేసేస్ లో మాత్రం అంత ఇంపాక్ట్ చూపించలేకపోయింది…

ప్లస్ పాయింట్స్

విజువల్స్
మార్క్ వాల్ బర్గ్, హలి బెర్రీ యాక్టింగ్

మైనస్ పాయింట్స్

కొన్ని సీన్లు బోర్ గా ఉండటం…
యాక్షన్ ఎపిసోడ్స్ లేకపోవడం

రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2/5

చివరి లైన్
స్పై సినిమాలు నచ్చే వాళ్ళు ఒకసారి చూడవచ్చు…