Mr Bachchan OTT: విడుదలైన రోజే ఓటీటీ లోకి ‘మిస్టర్ బచ్చన్’..రవితేజ కి ఇలాంటి ఫ్లాప్ మళ్ళీ రాదేమో!

వంద కోట్ల రూపాయిల షేర్ ని అవలీలగా కొట్టగలిగే స్థానం లో ఉండాల్సిన ఈ మల్టీ టాలెంటెడ్ హీరో ఇంకా 40 కోట్ల మార్కెట్ దగ్గరే ఆగిపోయాడు. ఇది ఆయన అభిమానులను తీవ్రంగా కలిచివేస్తున్న విషయం.

Written By: Vicky, Updated On : August 15, 2024 9:48 pm

Mr Bachchan OTT

Follow us on

Mr Bachchan OTT: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి, మెగాస్టార్ చిరంజీవి తర్వాత నేటి తరం యువ హీరోలకు ఆదర్శంగా మారిన హీరో మాస్ మహారాజా రవితేజ. ఒకప్పుడు రవితేజ అంటే ఒక బ్రాండ్. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్స్ తో సరిసమానమైన వసూళ్లు వచ్చేవి. రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్ లో తీసుకునేవాడు. ‘మిరపకాయ్’ వరకు అదే రేంజ్ ని కొనసాగిస్తూ వచ్చిన రవితేజ ఆ తర్వాత చేతికి అందిన సినిమా చెయ్యడం, స్క్రిప్ట్ ని సరిగా పట్టించుకోకపోవడం వల్ల వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకొని కెరీర్ గ్రాఫ్ ని తగ్గించుకుంటూ పోయాడు.

వంద కోట్ల రూపాయిల షేర్ ని అవలీలగా కొట్టగలిగే స్థానం లో ఉండాల్సిన ఈ మల్టీ టాలెంటెడ్ హీరో ఇంకా 40 కోట్ల మార్కెట్ దగ్గరే ఆగిపోయాడు. ఇది ఆయన అభిమానులను తీవ్రంగా కలిచివేస్తున్న విషయం. ‘రాజా ది గ్రేట్’ చిత్రం తర్వాత రవితేజ 12 సినిమాలు చేస్తే అందులో కేవలం క్రాక్,ధమాకా చిత్రాలు మాత్రమే సూపర్ హిట్స్ గా మిగిలాయి. ఇక నేడు భారీ అంచనాల నడుమ విడుదలైన మిస్టర్ బచ్చన్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. ఫలితంగా ఈ చిత్రం నేడు సెలవు దినం అయినప్పటికీ కూడా నామ మాత్రం ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి. ఒక సినిమా కలెక్షన్స్ భవిష్యత్తు సాయంత్రం షోస్ మీదనే ఆధారపడి ఉంటుంది. కానీ మిస్టర్ బచ్చన్ చిత్రానికి నేషనల్ హాలిడే రోజు , అది కూడా సాయంత్రం షోస్ హౌస్ ఫుల్స్ కాలేదు. దీనిని బట్టీ ఈ సినిమా భవిష్యత్తు ఏమిటో మీకు ఈపాటికే అర్థం అయిపోయి ఉంటుంది.

ఈ వీకెండ్ తోనే క్లోసింగ్ పడే అవకాశం ఉండడంతో, ఈ చిత్రాన్ని మూడు వారాల్లోనే ఓటీటీ లోకి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ముందుగా కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమాని ఆరు వారాల తర్వాతనే ఓటీటీ విడుదల చెయ్యాలి. కానీ ఫ్లాప్ టాక్ రావడం తో నెట్ ఫ్లిక్స్ సంస్థ మూడు వారాల్లోనే విడుదల చేస్తే ఫ్యాన్సీ అమౌంట్ ఇస్తామని నిర్మాత ముందు ఆఫర్ పెట్టడం తో ఈ డీల్ ఖరారు అయ్యినట్టు తెలుస్తుంది. ఇలా కేవలం కొన్ని సినిమాలకు మాత్రమే విడుదలైన మొదటి రోజు ఇలాంటి ఆఫర్లు వస్తుంటాయి. అది కూడా క్రేజీ కాంబినేషన్ మూవీస్ కి ఘోరమైన ఫ్లాప్ టాక్ వచ్చినప్పుడు మాత్రమే. కచ్చితంగా రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్ క్రేజీనే. అందుకే ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కూడా మంచి ఫ్యాన్సీ ఆఫర్ ని నిర్మాత ముందు పెట్టింది నెట్ ఫ్లిక్స్ సంస్థ. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకి రానున్నాయి.