Nara Lokesh: నారా లోకేష్ స్వాతంత్ర్య వేడుకల ప్రసంగం.. ఆటాడుకుంటున్న వైసీపీ సోషల్ మీడియా

అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఏపీలో వైసీపీ సోషల్ మీడియా బలోపేతం అవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో అధికార కూటమి నాయకులు చేస్తున్న తప్పులను బయటపెడుతోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 15, 2024 9:55 pm

Nara Lokesh(1)

Follow us on

Nara Lokesh: ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో చిన్న తప్పు జరిగినా నష్టం పెద్ద ఎత్తున ఉంటుంది. అందువల్ల మాట్లాడే ప్రతి మాట, చేపట్టే ప్రతి పని జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఈ విషయంలో ఒకింత అప్రమత్తంగా ఉండాలి. అలా లేకపోతే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సోషల్ మీడియాలో పరువు పోతుంది. అసలు సోషల్ మీడియాకు ఒక విధి విధానం ఉంటే కదా అనే ప్రశ్న రావచ్చు. కానీ నేటి రోజుల్లో ప్రజలతో అనుసంధానం కావాలంటే కచ్చితంగా సోషల్ మీడియా కావాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఇది మరింత ఎక్కువగా కావాలి.. అలాంటప్పుడు రాజకీయ నాయకులు జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యంగా తెలుగు భాషా విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలా లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో సోషల్ మీడియా ఇంత బలంగా లేదు కాబట్టి.. రాజకీయ నాయకులు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా.. ఎలాంటి మాటలు మాట్లాడినా పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు.

అధికారాన్ని కోల్పోయిన తర్వాత..

అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఏపీలో వైసీపీ సోషల్ మీడియా బలోపేతం అవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో అధికార కూటమి నాయకులు చేస్తున్న తప్పులను బయటపెడుతోంది. అయితే వైసిపి శుద్ధ పూసా అనే అనుమానం మీకు రావచ్చు. ఆ లెక్కన మన దేశంలో ఉన్న రాజకీయ పార్టీలలో ఏది కూడా శుద్ధ పూస కాదు. దేనికుండే మరకలు దానికి ఉన్నాయి. కాకపోతే ఎన్నికల రోజున ఓటర్ల మనోగతమే అంతిమంగా కావాల్సింది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా కూటమి నాయకులను టార్గెట్ చేస్తోంది. వారు ఏమాత్రం చిన్న తప్పు చేసినా భారీగా ట్రోల్ చేస్తోంది. గురువారం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని వైసీపీ సోషల్ మీడియా ఉదయం నుంచి ఏపీ మంత్రి నారా లోకేష్ ను టార్గెట్ చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం లో ఆయన చేసిన ప్రసంగంలో తప్పులను వెతికి ట్రోల్ చేస్తోంది..

తెలుగు భాష మీద పట్టు తక్కువ

సాధారణంగా నారా లోకేష్ కు తెలుగు భాష మీద పట్టు చాలా తక్కువ. గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు తెలుగు మాట్లాడే విషయంలో తడబాటుకు గురయ్యేవారు. అసలే క్లిష్టమైన భాష కావడంతో.. తప్పులు దొర్లి రకరకాల అర్ధాలు తెరపైకి వచ్చేవి. దీంతో నారా లోకేష్ వైసీపీ సోషల్ మీడియా చేతిలో విపరీతమైన విమర్శలకు గురయ్యేవారు. ఈ క్రమంలో ఆయన తన భాషను మరింత మెరుగుపరుచుకున్నారు. తెలుగు భాష మీద పట్టును పెంచుకున్నారు. అయినప్పటికీ అది సరిపోవడం లేదు. ఎందుకంటే గురువారం జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో ఆయన మాట్లాడిన మాటల్లో తప్పులు యథాలాపంగా దొర్లాయి. దీంతో వైసిపి సోషల్ మీడియా విభాగం పండగ చేసుకుంది. ఆయన మాట్లాడిన మాటలను ఎత్తిచూపుతూ.. పదేపదే ట్రోల్ చేయడం మొదలుపెట్టింది. దీంతో నెటిజన్ల కు కావలసినంత కాలక్షేపం దొరికింది. ఇదే సమయంలో టిడిపి సోషల్ మీడియా విభాగం వైసీపీకి గట్టిగా కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టింది. గతంలో జగన్ మాట్లాడిన మాటలు తాలూకు వీడియోలను పోస్ట్ చేసి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. స్వాతంత్ర దినోత్సవం రోజున అమరవీరులను స్మరించుకోవలసిన సందర్భంలో.. అటు టిడిపి, ఇటు వైసిపి పోటాపోటీగా సోషల్ మీడియాలో యుద్ధం చేసుకున్నాయి.