https://oktelugu.com/

Manchu family Involved In Another Controversy: మ‌రో వివాదంలో చిక్కుకున్న మోహన్ బాబు కుటుంబం.. ఏమైందంటే..?

Manchu family Involved In Another Controversy:  తెలుగు ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేకత గురించి చెప్పనవసరం లేదు. అయితే ఈ న‌డుమ ఈ కుటుంబంలో ఎవరో ఒకరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతూ ఉన్నారు. మా ఎల‌క్ష‌న్స్ త‌ర్వాత నుంచే వీరు ఇలా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మంచు లక్ష్మి, విష్ణు, మోహ‌న్ బాబు మీద ఎక్కువ‌గా ట్రోలింగ్స్ జ‌రుగుతున్నాయి. వాళ్లు మీడియా ముందుకు వ‌స్తే చాలు రెడీ అన్న‌ట్టు ట్రోల‌ర్స్ వారి మీద వీడియోలు […]

Written By: , Updated On : February 28, 2022 / 12:06 PM IST
Follow us on

Manchu family Involved In Another Controversy:  తెలుగు ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేకత గురించి చెప్పనవసరం లేదు. అయితే ఈ న‌డుమ ఈ కుటుంబంలో ఎవరో ఒకరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతూ ఉన్నారు. మా ఎల‌క్ష‌న్స్ త‌ర్వాత నుంచే వీరు ఇలా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మంచు లక్ష్మి, విష్ణు, మోహ‌న్ బాబు మీద ఎక్కువ‌గా ట్రోలింగ్స్ జ‌రుగుతున్నాయి. వాళ్లు మీడియా ముందుకు వ‌స్తే చాలు రెడీ అన్న‌ట్టు ట్రోల‌ర్స్ వారి మీద వీడియోలు చేస్తున్నారు.

Manchu family Involved In Another Controversy

Manchu family Involved In Another Controversy

ఇక మొన్న వ‌చ్చిన మోహన్ బాబు సినిమా స‌న్ ఆఫ్ ఇండియా మీద కూడా ఎలాంటి ట్రోల్స్ జ‌రిగాయో అంద‌రికీ తెలిసిందే. ఈ విధంగా మంచు కుటుంబం ఏదో ఒక విష‌యంలో ట్రోలింగ్ తో ఇబ్బంది ప‌డుతూనే ఉంటుంది. అయితే తాజాగా మంచు వారి కుటుంబం ఓ భూ వివాదంలో చిక్కుకున్న‌ట్టు తెలుస్తోంది. అది తెలిసి అంతా షాక్ అయిపోతున్నారు.

Also Read:   పెద్ద హీరోలు నోరు ఎత్తలేకపోయినా ప్రకాష్ రాజ్ తన గళమెత్తాడు !

ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండ‌లంలో భూ రిజిస్ట్రేష‌న్ లో కొన్ని త‌ప్పులు దొర్లిన‌ట్టు తెలుస్తోంది. ఈ మండ‌లంలో ఉన్న పేద‌ల‌కు ప్ర‌భుత్వాలు ఇచ్చేట‌టువంటి డీకేటీ భూమిని మోహన్ బాబు, ఆయన కొడుకు విష్ణు పేర్ల మంజూరు చేయడం వివాదస్పదంగా మారిపోయింది. కాగా ఈ భూమి మొత్తం దాదాపు నాలుగున్నర ఎకరాలుగా ఉంద‌ని తెలుస్తోంది.

Manchu family Involved In Another Controversy

Manchu family Involved In Another Controversy

దీని మార్కెట్ విలువ రూ.7కోట్లుగా ఉంటుందని అంచ‌నా వేస్తున్నారు. ఈ భూమిని ప్ర‌స్తుతం మోహన్ బాబు, విష్ణు పేర్లతో రిజిస్టర్ చేశారు. అయితే పేద‌ల‌కు ఇచ్చేట‌టువంటి భూమి మోహ‌న్ బాబు కుటుంబం పేరు మీద‌కు ఎలా వ‌చ్చింద‌ని ఆరా తీస్తున్నారు. అయితే ఈ డీకేటీ భూమి ప‌క్క‌నే గ‌తంలో మోహ‌న్ బాబు భూములు కొనుగోలు చేసిన‌ట్టు తెలుస్తోంది. స‌ర్వే నెంబ‌ర్ ఒక్క‌టే కావ‌డంతో పొరపాటున ఇలా రిజిస్ట‌ర్ అయిందా అని అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. అయితే దీని మీద ఇప్ప‌టి వ‌ర‌కు రెవెన్యూ అధికారులు గానీ అటు మంచు ఫ్యామిలీ గానీ స్పందించ‌లేదు.

Also Read:  పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్రీట్.. భీమ్లానాయక్ అట్టర్ ఫ్లాప్ అట !

Tags