మహేష్ తో సినిమా.. మంజుల అత్యాశకు పోతుందా?
సూపర్ స్టార్ కృష్ణ.. మహేష్ బాబు సోదరిగా మంజుల చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ‘షో’ సినిమాతో మంజుల నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత ‘ఆరెంజ్’లో రాంచరణ్ సిస్టర్ గా మంజుల కన్పించింది. అప్పుడప్పుడు తప్పా ఆమె సిరీయస్ గా సినిమాల్లో నటించడం లేదు. దీంతో ఆమె మహేష్ సోదరిగానే అభిమానులు చూస్తున్నారు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ మంజుల ఆ మధ్య ‘మనసుకు నచ్చింది’ అనే సినిమాకు దర్శకత్వం వహించింది. అయితే ఈ మూవీ […]
Written By:
NARESH, Updated On : November 8, 2020 / 03:02 PM IST
సూపర్ స్టార్ కృష్ణ.. మహేష్ బాబు సోదరిగా మంజుల చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ‘షో’ సినిమాతో మంజుల నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత ‘ఆరెంజ్’లో రాంచరణ్ సిస్టర్ గా మంజుల కన్పించింది. అప్పుడప్పుడు తప్పా ఆమె సిరీయస్ గా సినిమాల్లో నటించడం లేదు. దీంతో ఆమె మహేష్ సోదరిగానే అభిమానులు చూస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
మంజుల ఆ మధ్య ‘మనసుకు నచ్చింది’ అనే సినిమాకు దర్శకత్వం వహించింది. అయితే ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలింది . దీంతో ఆమె అటూ నటిగా.. ఇటూ దర్శకురాలిగా రాణించలేకపోతుంది. మంజుల మాత్రం తన సోదరుడైన సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తానంటూ తాజాగా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’లో ఇరుక్కుపోయిన ఎన్టీఆర్.. సేఫ్ అయిన చెర్రీ?
మహేష్ సోదరి అయిన మంజుల నటిగా.. దర్శకురాలిగా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. ఇలాంటి నేపథ్యంలో మంజుల దర్శకత్వంలో మహేష్ నటిస్తాడా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. చిన్న సినిమాను తీసి మెప్పించలేకపోయిన మంజుల సూపర్ స్టార్ నటించే సినిమాను ఏమేరకు డీల్ చేయగలదు? అనే ప్రశ్న తలెత్తుతోంది.
Also Read: ‘బాహుబలి’ విసిరిన ఛాలెంజ్ ను పూర్తి చేసిన ‘మగధీరుడు’..!
మంజుల దర్శకత్వలో యంగ్ హీరోలే సినిమాలు చేసేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో మహేష్ తో సినిమా చేస్తానంటూ మంజుల ప్రకటించడం అత్యాశేననే కామెంట్స్ విన్పిస్తున్నాయి. దీంతో మంజుల ముందుగా ఓ సినిమాను తీసి విజయం సాధించిన తర్వాత మహేష్ సినిమా చేస్తానిని చెబుతోంది. మహేష్ తో సినిమా చేయాలని కలలు కంటున్న మంజుల ఆశలు నెరవేరుతాయో లేదో వేచిచూడాల్సిందే..!