https://oktelugu.com/

‘బాహుబలి’ విసిరిన ఛాలెంజ్ ను పూర్తి చేసిన ‘మగధీరుడు’..!

వృక్షో రక్షితి రక్షితః.. చెట్లను మనం కాపాడితే అవి మనల్నే కాకుండా మన ముందుతరాల వారిని కూడా కాపాడుతాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాక  సీఎం కేసీఆర్ హరితహారం పథకం ప్రవేశపెట్టి విరివిరిగా మొక్కలు నాటిస్తున్న సంగతి తెల్సిందే.  ఈ పథకం స్ఫూర్తితోనే రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తీసుకొచ్చారు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన వ్యక్తి మరో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 8, 2020 / 02:58 PM IST
    Follow us on

    వృక్షో రక్షితి రక్షితః.. చెట్లను మనం కాపాడితే అవి మనల్నే కాకుండా మన ముందుతరాల వారిని కూడా కాపాడుతాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాక  సీఎం కేసీఆర్ హరితహారం పథకం ప్రవేశపెట్టి విరివిరిగా మొక్కలు నాటిస్తున్న సంగతి తెల్సిందే.  ఈ పథకం స్ఫూర్తితోనే రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తీసుకొచ్చారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన వ్యక్తి మరో ముగ్గురిని నామినేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలి. ఇలా ప్రతీఒక్కరిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం అయ్యేలా ఎంపీ సంతోష్ కుమార్ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు సెలబ్రెటీలతో గ్రీన్ ఛాలెంజ్ కు ప్రచారం కల్పిస్తూ ముందుకు తీసుకెళుతున్నాడు.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’లో ఇరుక్కుపోయిన ఎన్టీఆర్.. సేఫ్ అయిన చెర్రీ?

    మెగాస్టార్ చిరంజీవి.. అక్కినేని నాగార్జున, సమంత, డార్లింగ్ ప్రభాస్ తదితర స్టార్లు ఇప్పటికే గ్రీన్ ఛాలెంజ్ ను పూర్తి చేశారు. తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. ఇటీవల గ్రీన్ ఇండియాలో ఛాలెంజ్ లో భాగంగా ‘బాహుబలి’ ప్రభాస్ మొక్కలు నాటి ‘మగధీరుడు’ రాంచరణ్ ను నాామినేట్ చేశాడు. దీంతో ఆదివారం ఎంపీ సంతోష్ కుమార్ తోపాటు రాంచరణ్ మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను పూర్తి చేశాడు.

    Also Read: బిగ్ బాస్ ట్వీస్ట్.. కెప్టెన్ ఎలిమినేషన్.. ఇప్పుడెలా?

    గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు శ్రీకారం చుట్టిన సంతోష్ కుమార్ ను రాంచరణ్ అభినందించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కు తన స్నేహితుడు ప్రభాస్ పాల్గొనడమే కాకుండా.. తనకు కూడా మొక్కలు నాటే అవకాశాన్ని కల్పించడం సంతోషంగా ఉందన్నాడు. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈసందర్భంగా రాంచరణ్ బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్.. దర్శకుడు రాజమౌళి..’ఆర్‌ఆర్‌ఆర్‌’టీం.. మెగా ఫ్యాన్స్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని కోరాడు.