https://oktelugu.com/

విక్రమ్ టైలర్ టాక్: విరుచుకుపడిన కమల్ హాసన్..!

లోకనాయకుడు కమల్ హాసన్ 66వ పుట్టిన రోజు సందర్భంగా ‘విక్రమ్’ ట్రైలర్ రిలీజైంది. చాలా సర్ ప్రైజ్ విడుదలైన విక్రమ్ ట్రైలర్ తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతోంది. 2.22నిమిషాల నిడివితో విడుదలైన ఈ విక్రమ్ ట్రైలర్ సస్పెన్స్ తో ఆద్యంతం అలరించింది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ కమల్ హాసన్ 1986లో నటించిన క్లాసిక్ మూవీ టైటిల్ విక్రమ్. అదే టైటిల్ తో హర్రర్ యాక్షన్ థ్రిల్లర్ గా ‘విక్రమ్’ మూవీ మరోసారి ప్రేక్షకుల […]

Written By:
  • NARESH
  • , Updated On : November 8, 2020 / 03:08 PM IST
    Follow us on

    లోకనాయకుడు కమల్ హాసన్ 66వ పుట్టిన రోజు సందర్భంగా ‘విక్రమ్’ ట్రైలర్ రిలీజైంది. చాలా సర్ ప్రైజ్ విడుదలైన విక్రమ్ ట్రైలర్ తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతోంది. 2.22నిమిషాల నిడివితో విడుదలైన ఈ విక్రమ్ ట్రైలర్ సస్పెన్స్ తో ఆద్యంతం అలరించింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    కమల్ హాసన్ 1986లో నటించిన క్లాసిక్ మూవీ టైటిల్ విక్రమ్. అదే టైటిల్ తో హర్రర్ యాక్షన్ థ్రిల్లర్ గా ‘విక్రమ్’ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కమల్ 232 చిత్రం వస్తున్న ‘విక్రమ్’ మూవీకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’లో ఇరుక్కుపోయిన ఎన్టీఆర్.. సేఫ్ అయిన చెర్రీ?

    ఈ మూవీలో కమల్ హాసన్ పేరులేని పాత్రలో నటిస్తున్నాడు. ఇక ట్రైలర్ విషయానికొస్తే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దెయ్యంలా ఉంది. ఆ దెయ్యం పాత్రలో నటించింది విశ్వనటుడు కమల్ హాసన్. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

    గొడ్డళ్లు.. గన్స్ దాచుకొని శత్రువులపై కమలహాసన్(దెయ్యం) దాడి చేయడం కన్పించింది. వింతచేష్టలతో శత్రువులను చంపుతూ బెంబేలెత్తిస్తోంది. ఈ మూవీ టీజర్ ను కమల్ హాసన్ పుట్టినరోజు కానుకగా కనుకరాజ్ అభివర్ణించారు

    Also Read: మహేష్ తో సినిమా.. మంజుల అత్యాశకు పోతుందా?

    విక్రమ్ టీజర్ మా ప్రియమైన గురువు(కమలహాసన్)కు వినయపూర్వకమైన బహుమతి. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. దయచేసి మాకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూ ఉండండి అంటూ లోకేష్ పేర్కొన్నాడు. కనగరాజ్ ప్రతిభపై పూర్తి నమ్మకంతో కమల్ హాసన్ ఈ మూవీకి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.