https://oktelugu.com/

Movie Time: మూవీ టైమ్ : వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ !

Movie Time: ఖమ్మంలో సినియర్ ఎన్టీఆర్ విగ్రహం..ఆవిష్కరణకు జూనియర్‌ ఎన్టీఆర్ సన్నద్ధం అవుతున్నాడు. ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్‌ బండ్‌ పై దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ 100 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ఫ్యాన్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చొరవతో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ ప్రతిమను ఏర్పాటు చేసేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మే 28న ఎన్టీఆర్‌ 100వ జయంతి సందర్భంగా జూనియర్‌ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరణ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 22, 2022 / 11:13 AM IST
    Follow us on

    Movie Time: ఖమ్మంలో సినియర్ ఎన్టీఆర్ విగ్రహం..ఆవిష్కరణకు జూనియర్‌ ఎన్టీఆర్ సన్నద్ధం అవుతున్నాడు. ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్‌ బండ్‌ పై దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ 100 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ఫ్యాన్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చొరవతో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ ప్రతిమను ఏర్పాటు చేసేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మే 28న ఎన్టీఆర్‌ 100వ జయంతి సందర్భంగా జూనియర్‌ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయాలన్న లక్ష్యంతో పనులు చేస్తున్నారు.

    Varalakshmi

    ఇక ‘మైఖేల్’లో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తోంది. కాగా సందీప్‌ కిషన్‌ హీరోగా రానున్న ఈ ప్యాన్‌ ఇండియా చిత్రంలో తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక విలన్‌ గా ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ నటిస్తున్నాడు. అయితే, ఈ చిత్రంలో మరో ముఖ్య పాత్ర కోసం వరలక్ష్మీ శరత్ కుమార్‌ను ఎంచుకున్నారు. క్రాక్, నాందితో మెప్పించింది వరలక్ష్మీ.

    Also Read: ల‌వ‌ర్‌తో బ‌య‌ట‌కు వెళ్లిన అమ్మాయి.. బెదిరించి దారుణానికి ఒడిగ‌ట్టిన మందుబాబులు..!

    ntr

    వైరల్ అవుతున్న మరో క్రేజీ అప్ డేట్ విషయానికి వస్తే.. కెనడియన్-అమెరికన్ బ్యూటీ అయిన పమేలా ఆండర్సన్ తన 5వ భర్త డాన్ హేహర్ట్స్‌ కి కూడా విడాకులు ఇవ్వబోతుంది. తన బాడీగార్డుగా ఉండే హేహర్ట్స్‌ ని 2020 క్రిస్మస్ సందర్భంగా పమేలా వివాహం చేసుకుని.. అతనితో కెనడాలో కొన్నాళ్ళు ఉంది. అయితే, తాజాగా తన ఐదో భర్త నుంచి కూడా విడాకుల కోసం పమేలా దరఖాస్తు చేసుకుంది. పమేలా ‘బేవాచ్’, ‘స్కారీ మూవీ3’ సినిమాల్లో నటించింది.

    Also Read: ఎవ‌రు కాద‌న్నా.. ప్రపంచంలోనే నెం.1 లీడర్ మోడీ.. ఇంకా పెరుగుతున్న చరిష్మా..

    Tags