https://oktelugu.com/

Young Girl: ల‌వ‌ర్‌తో బ‌య‌ట‌కు వెళ్లిన అమ్మాయి.. బెదిరించి దారుణానికి ఒడిగ‌ట్టిన మందుబాబులు..!

Young Girl: ఆడ పిల్ల‌ల‌పై రోజురోజుకూ దారుణాలు పెరిగిపోతున్నాయి. ఒంటరిగా క‌నిపించినా.. వెంట ఎవ‌రినైనా తెచ్చుకున్నా స‌రే అఘాయిత్యాలు మాత్రం ఆగ‌ట్లేదు. మ‌రీ ముఖ్యంగా అమ్మాయిలు ప్రేమ‌లో ఉంటే.. త‌మ బాయ్ ఫ్రెండ్ తో క‌లిసి బ‌య‌ట‌కు వెళ్తారు. ఇలా ఏకాంతాన్ని కోరుకునే ప్రేమికులే టార్గెట్ గా కొంద‌రు ఆక‌తాయిలు రెచ్చిపోతున్నాయి. చివ‌ర‌కు వారి జీవితాల‌ను నాశ‌నం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఓ అమ్మాయి ఇలాగే బ‌లైపోయింది. పీలేరు ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి స్థానికంగా డిగ్రీ […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 22, 2022 / 11:10 AM IST
    Follow us on

    Young Girl: ఆడ పిల్ల‌ల‌పై రోజురోజుకూ దారుణాలు పెరిగిపోతున్నాయి. ఒంటరిగా క‌నిపించినా.. వెంట ఎవ‌రినైనా తెచ్చుకున్నా స‌రే అఘాయిత్యాలు మాత్రం ఆగ‌ట్లేదు. మ‌రీ ముఖ్యంగా అమ్మాయిలు ప్రేమ‌లో ఉంటే.. త‌మ బాయ్ ఫ్రెండ్ తో క‌లిసి బ‌య‌ట‌కు వెళ్తారు. ఇలా ఏకాంతాన్ని కోరుకునే ప్రేమికులే టార్గెట్ గా కొంద‌రు ఆక‌తాయిలు రెచ్చిపోతున్నాయి. చివ‌ర‌కు వారి జీవితాల‌ను నాశ‌నం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఓ అమ్మాయి ఇలాగే బ‌లైపోయింది.

    Young Girl

    పీలేరు ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి స్థానికంగా డిగ్రీ చ‌దువుతోంది. తాను ప్రేమించిన క్లాస్ మేట్ తో ఏకాంతాన్ని కోరుకున్న ఆ అమ్మాయి.. అత‌నితో బ‌య‌ట‌కు వెళ్లేందుకు సిద్ధ ప‌డింది. అయితే ఇద్ద‌రూ క‌లిసి బైక్ మీద ఓ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. అయితే ఇలా బ‌య‌ట‌కు వెళ్ల‌డం వారికి కొత్తేమీ కాదు. ఇంత‌కు ముందు కూడా వారు చాలా సార్లు బ‌య‌ట‌కు వెళ్లారు. ఆ ధైర్యంతోనే మ‌రోసారి ఇలా బ‌య‌ట‌కు వెళ్లారు.

    కాగా ఇలా ఒంట‌రిగా ఉన్న వారిని కొంద‌రు మందు బాబులు గ‌మనించారు. ప్రేమికుల‌ను వెన‌క నుంచి వీడియోలు, ఫొటోలు తీశారు. ఇది గ‌మ‌నించిన జంట అక్క‌డి నుంచి వెళ్లిపోయేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ మందుబాబులు అడ్డ‌గించి త‌మ‌కు వైన్ తీసుకు రావాల‌ని లేదంటే వీడియోలు సోష‌ల్ మీడియాలో పెడుతామంటూ బెదిరించారు. ఇక అబ్బాయి వైన్ తీసుకురావ‌డానికి వెళ్ల‌డంతో.. వారంతా ఆ అమ్మాయి మీద అత్యాచారానికి పాల్ప‌డ్డారు.

    Also Read: మీరు అందంగా మారిపోవాలా ? ఐతే ఇలా చేయండి !

    ఇక అబ్బాయి సాయంతో ఇంటికి చేరిన ఆ అమ్మాయి.. విష‌యం ఎవ‌రితోనూ చెప్ప‌లేక త‌న‌లో తానే తీవ్ర మ‌న‌స్థాపానికి గుయింది. కాగా స‌రిగ్గా వారంత తర్వాత ఆత్మహత్యాయత్నం చేసుకుంది. స‌మ‌యానికి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డింది. కాగా కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. ఆరా తీయ‌గా.. అస‌లు విష‌యం బ‌య‌ట ప‌డింది. దీంతో త‌ల్లిదండ్రులు త‌మ ప‌రువు పోతుంద‌ని, త‌మ‌కు న్యాయం అక్క‌ర్లేద‌ని, త‌మ‌ను వదిలేయాలంటూ కోరారు. అయితే పోలీసులు మాత్రం ఈ కేసును చాలా సీక్రెట్ గా ఎంక్వ‌యిరీ చేస్తున్నారు. ఇక గ‌తంలో తాడేపల్లిలో కూడా ఇలాంటి దారుణ‌మే వెలుగు చూసింది. ఇలా రోజు రోజుకూ అమ్మాయిల మీద అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి.

    Also Read: కిడ్నీలో రాళ్లను సహజంగా కరిగించే గొప్ప మార్గాలు !

    Tags