https://oktelugu.com/

Rajamouli: రాజమౌళి – మహేష్’ సినిమాలో గోపీచందే విలన్ !

Rajamouli: సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి ఓ పాన్ ఇండియా సినిమా తీయాలని ప్లాన్ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే, మళ్ళీ చాలా కాలం తర్వాత మహేష్, రాజమౌళి కలయికలో రానున్న సినిమా గురించి ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం రాజమౌళి గోపిచంద్‌ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో నిజం, వర్షం, జయం సినిమాల్లోనూ విలనిజం చూపించి మెప్పించాడు గోపీచంద్. కాకపోతే, ఇప్పుడు […]

Written By:
  • Shiva
  • , Updated On : January 22, 2022 / 11:19 AM IST
    Follow us on

    Rajamouli: సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి ఓ పాన్ ఇండియా సినిమా తీయాలని ప్లాన్ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే, మళ్ళీ చాలా కాలం తర్వాత మహేష్, రాజమౌళి కలయికలో రానున్న సినిమా గురించి ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం రాజమౌళి గోపిచంద్‌ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో నిజం, వర్షం, జయం సినిమాల్లోనూ విలనిజం చూపించి మెప్పించాడు గోపీచంద్.

    Rajamouli-Mahesh Babu

    కాకపోతే, ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సమయంలో విలన్ క్యారెక్టర్‌ కు ఒప్పుకుంటాడో లేదో మరి. అయితే, రాజమౌళి దర్శకుడు కాబట్టి.. అలాగే మహేష్ బాబు సినిమాలో విలన్‌ పాత్ర కాబట్టి.. గోపీచంద్ ఒప్పుకునే ఛాన్స్ ఉంది. పైగా రాజమౌళి అంటేనే భారీ సినిమా. ఇక మహేష్ సినిమా కూడా భారీగానే ఉంటుంది. మరి గోపీచంద్ కూడా ఈ టీంలో జాయిన్ అయితే.. ఫుల్ కిక్ ఉంటుంది ఫ్యాన్స్ కి.

    ఇక గత ఆరు నెలలుగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విజయేంద్ర ప్రసాద్ తన టీమ్ తో కలిసి మహేష్ – రాజమౌళి సినిమా స్క్రిప్ట్ పై కసరత్తులు చేస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్‌ ఈ సినిమా కథను ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ నేపథ్యంలో రాశారని.. ఆ ఫారెస్ట్‌ లో ఉన్న నిధుల గుట్టల పై ఈ సినిమా సాగుతుందని గతంలో వార్తలు వినిపించాయి.

    gopichand

    ఫారెస్ట్‌ లో ఉన్న నిధుల అంటే.. ఆ నిధుల కోసం ప్రపంచ సాహస వీరులు అంతా పోటీ పడతారని.. ఎవరికీ వారు ఎత్తులకు పై ఎత్తులు వేసి క్రమంలో ప్రత్యర్థులను చంపుతూ నిధి వేటకు బయలు దేరుతారని తెలుస్తోంది. మొత్తమ్మీద ఫారెస్ట్‌ లో జరిగే యాక్షన్‌ ఎడ్వెంచరెస్‌ సీన్లు అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. ఎలాగూ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించడంలో రాజమౌళి మహా దిట్ట.

    కాబట్టి.. ఈ సినిమా ఎలా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ నేపథ్యం ఇండియన్ సినిమాకి పూర్తిగా కొత్త నేపథ్యం కూడా. ఇంతవరకు భారతీయ సినీ చరిత్రలో ఆ నేపథ్యంలో సినిమా రాలేదు. అందుకే ఇండియన్ తెర పై ఈ సినిమాకి భారీ బజ్ క్రియేట్ అవ్వడం ఖాయం. అన్నట్టు ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ లో ఉండే వింత జంతువుల పై కూడా ప్రత్యేక ఫైట్ సీన్స్ ఉంటాయట. నేషనల్ స్టార్ డైరెక్టర్ గా జక్కన్న ఈ సినిమా విషయంలో ఫుల్ క్లారిటీ గా ఉన్నాడు.

    Tags