Stars Marriage: సినిమాలంటే ఇష్టముండని వారెవరూ ఉండరు. ఒకప్పుడు తమ అభిమాని హీరో సినిమా వస్తుందంటే పండుగలా భావించేవారు. సినిమా రిలీజ్ అయిన రోజు కటౌట్లు కట్టి సందడి చేసేవారు. ఇప్పటికీ కొందరు హీరోల సినిమాల సినిమాలకు అలానే చేస్తున్నారు. అయితే కొందరు హీరోలపై చూపించే అభిమానం స్టార్లను ఆకర్షిస్తుంది. ఇలాంటి వారు చూపించే ప్రేమకు ఫిదా అయిన వారు వారితో జీవితం పంచుకోవాలని అనుకుంటారు. అలా కొంత మంది హీరోలు తమను అభిమానించేవారినే పెళ్లి చేసుకున్నారు. అలాంటి వారు తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. వారిలో కొందరి గురించి.
మాధవన్-సరిత: సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోగా గుర్తింపు పొందిన మాధవన్ ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. ఇప్పటికీ సినిమాల్లో కనిపిస్తూ ఉన్నారు. మాధవన్ కండక్ట్ చేసే పబ్లిక్ స్పీకింగ్ వర్కింగ్ క్లాసులకు సరిత హాజరయ్యారు. అలా మాధవన్ అంటే అభిమానం ఉన్న సరితను చూసి ప్రేమలో పడ్డారు. అలా 1999లో వీరు పెళ్లి చేసుకున్నారు.

రజనీకాంత్-సరిత: సూపర్ స్టార్ రజనీ కాంత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ అయిన తరువాత ఆయన ఇంటర్వ్యూ కోసం చాలా మంది క్యూ కట్టేవారు. అలా ఓ మ్యాగ్జిన్ ఇంటర్వ్యూ కోసం రజనీకాంత్ వద్దకు వెళ్లిన సరితను చూసి ఇంప్రెస్ అయ్యారు. ఆ తరువాత తన మనసులోని మాటను చెప్పి ఆమెను పెళ్లి చేసుకున్నారు.
విజయ్-సంగీత: ఇళయ దళపతిగా గుర్తింపు పొందిన తమిళ హీరో విజయ్ అంటే అందరికీ అభిమానమే. ఆ అభిమానం విదేశాల్లో కూడా ఉంది. లండన్ కు చెందిన సంగీత విజయ్ కి వీరాభిమాని. అయితే తనతో జీవితం పంచుకోవాలన్న విషయం స్నేహితుతల ద్వారా తెలిపింది. అటు విజయ్ కూడా ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడంతో వీరిద్దిరికి 1999లో పెళ్లి జరిగింది.
అమీర్ ఖాన్-కిరణ్ రావు: బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో అమర్ ఖాన్ తొలిచూపులోనే కిరణ్ రావును చూసి ప్రేమలో పడ్డారు. లగాన్ సినిమా సమయంలో వీరి పరిచయం జరిగింది. ఆ తరువాత ఈమెను ప్రేమించిన అమీర్ ఖాన్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకున్నారు.

రాజేశ్ ఖన్నా-డింపుల్ కపాడియా: సినిమాల్లోకి రాకముందే రాజేశ్ ఖన్నా అంటే డింపుల్ కపాడియాకు వీరాభిమాని. తన సన్నిహితుల ద్వారా ఈ విషయాన్ని డింపుల్ చెప్పింది. ఆ తరువాత రాజేష్ ఖన్నా కూడా ఆమెను ఇష్టపడడంతో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.
శిల్పాశెట్టి -రాజ్ కుంద్రా: కొన్ని రోజుల కిందట రాజ్ కుంద్రా పేరు సంచలనంగా మారింది. శిల్పాశిట్టి సినిమా హీరోయిన్ కావడంతో ఆమెపై రాజ్ కుంద్రా ఎంతో అభిమానం పెంచుకున్నాడు. అయితే తనను పెళ్లి చేసుకవాలని అనుకునప్పుడు ఆ విషయం తనతో చెప్పడానికి కాస్త భయపడ్డాడు. కానీ తన ప్రేమను వ్యక్తం చేయడంతో వీరిద్దరి పెళ్లి 2009లో జరిగింది.
జితేంద్రా -శోభాకపూర్: జితేంద్ర సినిమాలు లైక్ చేయని వారుండరు. అలాగే శోభా కపూర్ సైతం ఆయనపై అభిమానం పెంచుకుంది. ఆ తరువాత వీరిద్దరు 1974లో పెళ్లి చేసుకున్నారు.
దిలీప్ కుమార్ -సైరాబాను: దిలీప్ కుమార్ పై చిన్నప్పటి నుంచే అభిమానం పెంచుకున్న సైరాభాను.. ఆయనతో కలిసి జీవించాలని కలలు కనేది. కానీ ఆ కలను సైరా భాను సార్థకం చేసుకున్నారు. 1966లో ఆయనను వివాహం చేసుకున్నారు.