OTT Releases This Week: వేసవిలో ఎండలు మండిపోయాయి. ఇప్పటికీ భానుడి భగభగ మంటూనే ఉన్నాడు. అయితే జూన్ మొదటి వారం వేసవికి వీడ్కోలు చెప్పే సమయం వచ్చిందని అంటున్నారు. అయితే వాస్తవానికి ఈ పాటికి వర్షాలు పడి చల్లటి వాతావరణంలో ఉండాలి. ఈ కూల్ వెదర్ లో మంచి సినిమాకు వెళ్లాలని ఎవరైనా అనుకుంటారు. ఈ నేపథ్యంలోనే కొందరు నిర్మాతలు, డైరెక్టర్లు జూన్ మొదటి వారాన్ని కొన్ని సినిమాలకు రిలీజ్ వీక్ గా ఫిక్ష్ చేసుకున్నారు. వాతావరణమైతే చల్లబడలేదు గానీ ముందే ఫిక్స్ అయిన సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అవేంటో చూద్దాం.
ఆదిపురుష్:
ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ నటిస్తున్న ఈ మూవీ జూన్ 16న థియేటర్లోకి వస్తోంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ , మలయాళం భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతోంది. ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఫ్యాన్స్ తో పాటు ఇతరులు సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
ద ఫ్లాష్:
స్పైడర్ మ్యాన్, హిట్ మ్యాన్ లందరూ కలిసి ఒకే తెరపై కనిపిస్తే ఎలా ఉంటుంది? అనే నేపథ్యంలో మేకింగ్ జరుపుకున్న హాలీవుడ్ చిత్రం ‘ద ఫ్లాస్’. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ జూన్ 15న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు విపరీతంగా పెరిగాయి.
ఓటీటీ మూవీస్:
థియేటర్లోనే కాకుండా ఓటీటీ వేదికగా పలు సినిమాలు, సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. థియేటర్లోకి వెళ్లలేని వారు ఓటీటీ ద్వారా వినోదం పొందతున్న విషయం తెలిసిందే. అయితే ఓటీటీలో వీక్షించేవారు ఎప్పుడెప్పుడు ఏ మూవీ రిలీజ్ అవుతుందా? అని ఎదురుచూస్తన్నారు. అలాంటి వారి కోసం ఈ లిస్ట్ ను చూడండి..
జూన్ 15: జీ కర్దా అనే హిందీ మూవీ సిరీస్ ప్రారంభం కాబోతుంది. దీనితో పాటు రావణ కొట్టం అనే తమిళ సిరీస్ కూడా స్ట్రీమింగ్ కానుంది. వీటిని అమెజాన్ ప్రైమ్ లో వీక్షించవచ్చు.
జూన్ 15: రఫ్లూ చక్కర్ అనే హిందీ సిరీస్ జియో సినిమా వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
జూన్ 16: ఈ రోజు ఎక్ర్ ట్రాక్షన్ అనే హాలీవుడ్ సీరీస్ 2వ భాగంగ స్ట్రీమింగ్ కానుంది. దీనిని నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు. ఇదే రోజు ఐలవ్ యూ అనే హిందీ సినిమా జియో సినిమా వేదికగా ప్రారంభం కానుంది.
జూన్16: ఈటీవీ విన్ లో ఈరోజు నుంచి ‘కనులు తెరిచినా కనులు మూసినా’ అనే మూవీ స్ట్రీమింగ్ కానుంది.
జూన్ 16: ఫర్జానా అనే తమిళ మూవీ సోనీ లైవ్ లో ప్రసారం కానుంది.
జూన్ 17: థియేటర్లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న బిచ్చగాడు 2ను డిస్నీ + హాట్ స్టార్ లో రన్ కానుంది.