Squid Game Season 2 Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొరియన్ సినిమాలకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. వాళ్ళు క్రియేటివిటీని వాడుతూ అడ్వెంచర్ జానర్ కి సంబంధించిన సినిమాలను చేయడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. అందుకే వరల్డ్ సినిమా ఇండస్ట్రీలో కూడా కొరియన్ సినిమాలకు చాలా ప్రత్యేకమైన స్థానం అయితే ఉంటుందనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ల నుంచి వచ్చే వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి…ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొరియన్ సినిమాలకు చాలా మంచి ఆదరణ అయితే దక్కుతుంది… 2021 లో వచ్చిన ‘స్క్విట్ గేమ్ ‘ సిరీస్ ప్రేక్షకులలో మంచి ఆదరణను దక్కించుకుంది… ఇక ఇప్పుడు డిసెంబర్ 26వ తేదీన ‘స్క్విడ్ గేమ్ 2’ సిరీస్ నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీ అవుతుంది. ఇక ఇదిలా ఉంటే స్క్విడ్ గేమ్ మొదటి పార్ట్ లో ఏముంది? అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ముందుగా ఈ సిరీస్ కథ విషయానికి వస్తే 456 మంది అప్పుల పాలై జీవితం మీద విరక్తి పుట్టి ఏం చేయాలో తెలియని దయనీయమైన స్థితిలో ఉన్న వ్యక్తులను సెలెక్ట్ చేసుకొని వాళ్ళందర్నీ ఒక దీవిలోకి తీసుకెళ్లి అక్కడ వాళ్లకు సంబంధించిన కొన్ని గేమ్స్ ను అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆ గేమ్స్ కూడా చాలా సిల్లీగా ఉంటాయి. రెడ్ లైట్, గ్రీన్ లైట్, గోలీలాట, టగఫ్ వార్ లాంటి గేమ్స్ ను ఆడిపిస్తూ ఉంటారు. అయితే ఈ గేమ్ లో ఓడితే మరోసారి గేమ్ లో ఆడొచ్చు అనే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఒకసారి గేమ్ లో ఆడితే వాళ్ళు గేమ్ లో నుంచే కాదు. ఈ భూమ్మీద నుంచి కూడా అవుట్ అయిపోతారు.అంటే గేమ్ లో ఓడిపోతే చంపేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా వాళ్ళ గేమ్ ని ఆడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది.
కాబట్టి ఒళ్లు దగ్గర పెట్టుకొని గేమ్ ని ఆడుతూ అంటారు. అయితే ప్రతి ఒక్కరు వాళ్లకు సంబంధించిన ప్రైజ్ మనీ గెలవాలనే కోరుకుంటుంటారు. మరి ఇందులో ఎవరు ఫైనల్ గా ప్రైజ్ మనీ గెలిచారు. ఈ గేమ్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఏం లాభం వస్తుంది. ఇలాంటి విషయాలు మీకు తెలియాలంటే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ని మీరు చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు ఈ సిరీస్ ని చాలా డెప్త్ గా తెరకెక్కించే ప్రయత్నం అయితే చేశాడు. ముఖ్యంగా ఇందులో మెయిన్ క్యారెక్టర్ ని పోషించిన షియెంగ్ జీ హున్ తన అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇచ్చాడు. తన మొదటి భార్య తనను వదిలేసి వెళ్లిపోవడంతో ఆయన రెండో భార్యను పెళ్లి చేసుకుంటాడు.వీళ్ళకి ఒక పాప కూడా ఉంటుంది.తను ఏ పని చేయకుండా ఖాళీగా ఉండడం వల్ల తన భార్య తన నుంచి తన కూతురిని తీసుకొని వెళ్లి అమెరికాలో సెటిల్ అవ్వాలనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో తన కూతుర్ని మాత్రం తనతో పెంచుకోవాలని చూస్తూ ఉంటాడు.
దానికి డబ్బులు కావాలి ఎలాగైనా సరే డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ ఆట ఆడడానికి వస్తాడు ఎంతో ఎమోషనల్ గా ఒక్కొక్క గేమ్ ను క్రియేట్ చేశాడు దర్శకుడు…ఇక ఈ సిరీస్ లో వచ్చే ప్రతి ఒక్క ఎపిసోడ్ చూస్తున్న కొద్ది ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక ఒక్కొక్కరుగా ఈ గేమ్ ని ఆడితే గెలవలేరని ఉద్దేశ్యం తో అక్కడ కలిసిన కొంతమంది ఫ్రెండ్స్ తో ఈ గేమ్ ని ఆడడం స్టార్ట్ చేస్తాడు. ఇందులోనే మోసాలు, కుట్రలు, స్వార్థలు అన్ని కనిపిస్తూ ఉంటాయి. ఇక మొత్తానికైతే ఈ ప్రైజ్ మనీ దక్కించుకోవడం కోసం వాళ్లు చేసే పోరాటాన్ని దర్శకుడు చాలా బాగా చూపించాడనే చెప్పాలి.
ప్రతీ క్యారెక్టర్ తాలూకు ఎమోషన్ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది…ఇక దర్శకుడు రాసుకున్న ప్రతి సీన్ స్క్రీన్ మీద అలరిస్తుంది. తను రాసుకున్న స్క్రీన్ ప్లే ప్రకారం ప్రతి ఒక్క మూమెంట్ కూడా ప్రేక్షకుడికి ఎగ్జైట్ మెంట్ ని కలిగిస్తూ ముందుకు సాగుతూ ఉండటం అనేది విశేషం…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఇందులో నటించిన ప్రతి ఆర్టిస్టు కూడా తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించేలా నటించడమే కాకుండా ప్రేక్షకుల యొక్క మన్ననలను పొందడానికి వాళ్ళు తీవ్ర తరమైన కృషి చేశారనే చెప్పాలి. ప్రతి క్యారెక్టర్ లో ఒక్కొక్క వ్యక్తి ఒదిగిపోయి నటిస్తూ సిరీస్ మీద అంచనాలు పెంచడమే కాకుండా ప్రతి ఒక్క వ్యక్తి సీరీస్ ను చూసే విధంగా వల్ల నటనతో ఆకట్టుకున్నారనే చెప్పాలి…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికొస్తే ఈ సిరీస్ లో ప్రతి ఒక్క సీన్ హైలెట్ గా నిలవడానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా వరకు హెల్ప్ అయిందనే చెప్పాలి… ఇక వాళ్ళు గేమ్స్ ఆడుతున్నప్పుడు చూపించిన విజువల్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో నిలిచాయి.ముఖ్యంగా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగుంటాయి…
ప్లస్ పాయింట్స్
కథ
గేమ్స్ ఆడుతున్నప్పుడు వచ్చే సీన్లు
మ్యూజిక్
మైనస్ పాయింట్స్
మధ్యలో ఒక రెండు ఎపిసోడ్స్ కొంచెం బోరింగ్ గా అనిపిస్తాయి…
హేవి ఎమోషన్ సీన్స్…