https://oktelugu.com/

Zodiac Signs: ఈ రాశుల వారికి కుజుడు అందించనున్న అదృష్టం.. ఏడు రాశులకు చాలా కలిసి వస్తుంది.

2025 సంవత్సరంలో కుజసంచారం వల్ల కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు రానున్నాయి. కుజుడు కర్కాటక రాశిలో 2025 జనవరి 23 వరకు తిరుగుతాడు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 24, 2024 / 11:54 AM IST

    Zodiac Signs

    Follow us on


    Zodiac Signs: 2025 సంవత్సరంలో కుజసంచారం వల్ల కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు రానున్నాయి. కుజుడు కర్కాటక రాశిలో 2025 జనవరి 23 వరకు తిరుగుతాడు. ఆ తర్వాత అంటే జనవరి 23వ తేదీన కుజుడు కర్కాటక రాశి నుంచి మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు అంటున్నారు పండితులు. కర్కాటక రాశిలో కుజుడు తిరోగమనములో సంచారం చేస్తాడు. దీని వల్ల జనవరి 23వ తేదీన కుజుడు మిధున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మళ్లీ మిధున రాశి నుంచి ఏప్రిల్ మూడవ తేదీన కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు.

    మొత్తం 7 రాశుల్లో కుజ సంచారం ఉంటుంది. ఆ తర్వాత జూన్ 7వ తేదీన సింహరాశిలోకి వెళతాడు. జూన్ 7వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు సింహరాశిలో సంచారం చేస్తాడు. ఆ తర్వాత కన్యరాశిలోకి సంచారాన్ని ప్రారంభిస్తాడు కుజుడు. ఆ తర్వాత సెప్టెంబరు 13వ తేదీన తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 27వ తేదీన వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. మళ్లీ తిరిగి డిసెంబర్ 7వ తేదీన ధనుస్సురాశిలోకి సంచారం చేస్తాడు. మొత్తం ఏడు రాశుల్లో తిరుగుతూ కుజుడు అనేక రాశుల వారికి అదృష్టాన్ని అందిస్తాడు అంటున్నాడు పండితులు.

    2025 సంవత్సరంలో మిధున రాశి వారికి చాలా ప్రత్యేకంగా, అదృష్టంగా ఉంటుంది. కుజ సంచారం ప్రభావంతో మిధున రాశి వారి జీవితంలో చాలా మంచి ఫలితాలు రానున్నాయి. ఇక ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న పనులు మొత్తం పూర్తి అవుతాయి. కెరీర్లో పురోగతి ఉంటుంది. విద్యార్థులకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఇది మిధున రాశి వారికి మంచి సమయం. వ్యాపారంలో స్నేహితుల మద్దతుతో లాభాలు వస్తాయి. ఈ సంవత్సరం మీరు కన్న కలలు నెరవేరుతాయి. కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కుజ సంచారం శుభప్రదంగా ఉంటుంది. కార్యాలయంలో బాగా సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉపాధి సమస్యలు పరిష్కారం అవుతాయి. కర్కాటక రాశి వారి జీవితం ముందు కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. ఈ సమయంలో సంతోషంగా బ్రతకడానికి అన్ని మార్గాలు తెరుచుకుంటాయి. అవివాహితులకు వివాహాలు సెటిల్ అవుతాయి. విద్యార్థులకు సానుకూలంగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు వస్తాయి.

    వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఏ పని చేసిన విజయాలు వరిస్తాయి అంటున్నారు నిపుణులు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. 2025 సంవత్సరంలో మీరు ఆరోగ్యంగా ఉంటారు. వర్తక వ్యాపారాలు విస్తరించడానికి ఇది మంచి సమయం. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను చూస్తారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..