https://oktelugu.com/

YCP Social Media: బీఆర్ఎస్ లాగానే వైసీపీ ‘సోషల్’ వార్.. కూటమి సర్కార్ పై కొత్త యుద్ధం?

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు కాలం చెల్లింది. ఇప్పుడంతా డిజిటల్ మీడియా ప్రభావం నడుస్తోంది. సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. దీంతో అన్ని పార్టీలు దానిపైనే ఆధారపడుతున్నాయి.

Written By: , Updated On : December 24, 2024 / 12:16 PM IST
YCP Social Media

YCP Social Media

Follow us on

YCP Social Media: వైసీపీకి అతి పెద్ద అండ సోషల్ మీడియా విభాగం.ఆ పార్టీ ఆవిర్భావం నుంచి సోషల్ మీడియా వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. జగన్ తో పాటు వైసిపి పై ఎవరు విమర్శలు చేసినా వాటిని తిప్పి కొట్టడంలో ముందుండేది.ఆ విమర్శలు చేసిన పార్టీతో పాటు గతంలో వారు వ్యవహరించిన తీరును సైతం ఆధారాలతో సహా బయట పెట్టేది.ప్రజల్లో వారిని చులకన చేసేది. చివరికి న్యాయమూర్తులపై సైతం వైసీపీ సోషల్ మీడియా దాడి కొనసాగింది.అయితే ఇదంతా అధికారం అనే మత్తులో సాగింది. ఎప్పుడైతే వైసీపీ అధికారానికి దూరమైందో అప్పుడే ఆ పార్టీ సోషల్ మీడియా కాలం పాటు వచ్చింది.ఇటీవల కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా విభాగం పై దాడి కొనసాగించింది. కేసులతోపాటు అరెస్టులు కొనసాగడంతో సోషల్ మీడియా వింగ్ భయాందోళనకు గురైంది.మునుపటిలా సాహసం,ధైర్యం కనబరచలేకపోతోంది.అసలే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి మింగుడు పడని విషయం. అయితే ఈ విషయంలో తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని వైసిపి అనుసరించాలని భావిస్తోంది.

* వేల మంది వారియర్స్ తో
గత ఐదేళ్ల కాలంలో వైసీపీ సోషల్ మీడియా పటిష్టంగా కనిపించింది.4500 మంది సోషల్ మీడియా వారియర్లతో తిరుగులేని శక్తిగా ఉండేది. అయితే వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రచారం కల్పించడంతోపాటు ప్రత్యర్థులను వేటాడేది వైసిపి సోషల్ మీడియా. ఏపీలోవైసీపీ అధికారంలో ఉండగా..తెలంగాణలో బిఆర్ఎస్ పవర్ లో ఉండేది. కెసిఆర్, జగన్ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే ఏపీ మాదిరిగా తెలంగాణలో సైతం బిఆర్ఎస్ సోషల్ మీడియా బలోపేతం చేసుకుంది. అయితే ముందుగా తెలంగాణలో కేసీఆర్ అధికారానికి దూరమయ్యారు. ఏపీలో జగన్ తరువాత అపజయం పాలయ్యారు.అక్కడ రోజురోజుకు బీఆర్ఎస్ పతనం అవుతోంది.ఇక్కడ ఏపీలో సైతం వైసీపీ కష్టాల్లో మునిగిపోతోంది.

* ఎన్నారై విభాగాలతో
తెలంగాణలో ధైర్యం పోగుచేసుకుని బిఆర్ఎస్ గట్టిగానే పోరాడుతోంది.అయితే అక్కడ కాంగ్రెస్ తో పాటు బిజెపి ప్రత్యర్థిగా ఉంది.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా.. కేంద్రంలో బిజెపి పవర్ లో ఉంది. ఆ రెండు పార్టీలను అధిగమించాలంటే సోషల్ మీడియా వింగ్ అవసరం. అప్పుడే కేటీఆర్ భారీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సుమారు 100 డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను ఆశ్రయించినట్లు ప్రచారం సాగింది. ప్రధానంగా అమెరికా, లండన్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి సోషల్ మీడియాను ఆపరేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేక ప్రచారంతో పాటు బి ఆర్ఎస్ కు మద్దతుగా సదరు సంస్థలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఈ విషయంలో బిఆర్ఎస్ ఎన్నారై విభాగాలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం అవుతున్నాయి. అయితే విదేశాల్లో వైసీపీకి సైతం బలమైన విభాగాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు వాటి ద్వారా సోషల్ మీడియా ప్రచారానికి జగన్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.