అర‌ణ్య‌ మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

నటీనటులుః రానా, విష్ణువిశాల్‌, ప‌రాస్ అరోరా, శ్రీయా పింగోల్క‌ర్‌, ర‌ఘుబాబు, హుస్సేన్ త‌దిత‌రులు దర్శకత్వంః ప్ర‌భు సాలోమ‌న్‌ నిర్మాణంః ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్‌‌‌ సంగీతంః శాంత‌ను మొయిత్రా సినిమాటోగ్ర‌ఫీః అ‌శోక్ కుమార్‌‌ రిలీజ్ డేట్ః 26 మార్చి, 2021 Also Read: ‘రంగ్ దే’ రివ్యూ .. హిట్టా ఫట్టా? క‌థః న‌రేంద్ర భూప‌తి ఉర‌ఫ్ అర‌ణ్య (రానా) ఒక ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికుడు. అడ‌వులు, జంతువులు అంటే ఆయ‌న‌కు ప్రాణం. గ‌తంలో ఆయ‌న తాత‌ముత్తాత‌లు 500 ఎక‌రాల అడ‌విని […]

Written By: NARESH, Updated On : March 26, 2021 3:58 pm
Follow us on

నటీనటులుః రానా, విష్ణువిశాల్‌, ప‌రాస్ అరోరా, శ్రీయా పింగోల్క‌ర్‌, ర‌ఘుబాబు, హుస్సేన్ త‌దిత‌రులు
దర్శకత్వంః ప్ర‌భు సాలోమ‌న్‌
నిర్మాణంః ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్‌‌‌
సంగీతంః శాంత‌ను మొయిత్రా
సినిమాటోగ్ర‌ఫీః అ‌శోక్ కుమార్‌‌
రిలీజ్ డేట్ః 26 మార్చి, 2021

Also Read: ‘రంగ్ దే’ రివ్యూ .. హిట్టా ఫట్టా?
క‌థః

న‌రేంద్ర భూప‌తి ఉర‌ఫ్ అర‌ణ్య (రానా) ఒక ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికుడు. అడ‌వులు, జంతువులు అంటే ఆయ‌న‌కు ప్రాణం. గ‌తంలో ఆయ‌న తాత‌ముత్తాత‌లు 500 ఎక‌రాల అడ‌విని స‌ర్కారుకు విరాళంగా ఇస్తారు. అయితే.. వ‌న్య ప్రాణుల‌ను ఇష్ట‌ప‌డే అర‌ణ్య‌.. అక్క‌డే ఉంటూ జంతువుల‌ను సంరక్షిస్తూ కాలం గ‌డుపుతుంటాడు. అంతేకాదు.. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా ల‌క్ష‌కు పైగా మొక్క‌లు నాటుతాడు. దీనికి రాష్ట్ర‌ప‌తి నుంచి ‘ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అనే అవార్డును కూడా అదుకుంటాడు. అయితే.. అటవీశాఖ మంత్రి రాజగోపాలం (అనంత్ మహదేవన్) ఆ అడ‌విపై క‌న్నేస్తాడు. ఆ ప్రాంతాన్ని ద‌క్కించుకొని టౌన్ షిప్ నిర్మించాల‌ని ప్లాన్ వేస్తాడు. దీనికి అర‌ణ్య అడ్డుప‌డ‌తాడు. ఈ క్ర‌మంలో ఏం జ‌రిగింది? ఈ పోరాటంలో మంత్రి గెలిచాడా? అర‌ణ్య విజ‌యం సాధించాడా? అన్న‌ది మిగ‌తా క‌థ‌.

పెర్ఫార్మెన్స్ః

ఇమేజ్ చ‌ట్రంలో ఇరుక్కుపోకుండా.. వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషిస్తూ.. వెర్స‌టైల్ ప‌ర్ఫార్మ‌ర్ గా స‌త్తా చాటుతున్నారు రానా. బాహుబ‌లిలో భ‌ల్లాల దేవ‌గా, ఘాజీలో అర్జున్ గా, ఇప్పుడు అర‌ణ్య‌గా త‌న‌దైన న‌ట‌న‌తో చెల‌రేగిపోతున్నాడు. ఈ సినిమాలో న‌రేంద్ర భూప‌తి పాత్ర‌లో ఒదిగిపోయాడు. సినిమా మొత్తం రానా క‌టౌట్ తో నిండిపోయింది. అడ‌వి మ‌నిషి పాత్ర‌లో రానా జీవించాడు. ఇక‌, సింగ పాత్ర‌కు విస్ణు విశాల్ న్యాయం చేశాడు. రిపోర్ట‌ర్ గా శ్రీయా పింగోల్క‌ర్, న‌క‌లైట్ పాత్ర‌లో హుస్సేన్ మెప్పించారు. ర‌ఘుబాబు న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు.

Also Read: రూ.75 లక్షల బహుమతి అందుకున్న ‘ఉప్పెన’ డైరెక్టర్

విశ్లేష‌ణః

మంచి క‌థను ఎంచుకున్న ద‌ర్శ‌కుడు క‌థ‌నంపై స‌రిగా దృష్టి సారించలేక‌పోయాడు. ప్రేక్ష‌కుల‌ను క‌థ‌లో లీనం చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు సోలోమ‌న్‌. ఎక్క‌డా ట్విస్టులు లేకుండా సినిమా సాగిపోవ‌డం ప్ర‌ధాన లోపం. ఏనుగుల‌తో రానా అటాచ్ మెంట్ బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. దాన్ని పండించే సీన్లు రాసుకోలేక‌పోయారు. అడ‌వి కోసం, జంతువుల కోసం అర‌ణ్య పోరాటాన్ని బ‌లంగా చూపించలేక‌పోయాడు. మ‌ధ్య‌లో న‌క్స‌లైట్ల‌ను తీసుకురావ‌డం కూడా అతికించిన‌ట్టుగా ఉంటుంది. కొన్ని సీన్లు పొంత‌న లేకుండా ఉంటాయి. ఇక‌, సినిమాలో ఆక‌ట్టుకునే అంశాలో విజువ‌ల్ ఎఫెక్ట్స్ ముందు వ‌ర‌స‌లో ఉంటాయి. సినిమా బ్యాక్ డ్రాప్ మొత్తం అడ‌వి చుట్టే తిర‌గ‌డంతో ఎక్కువ శాతం అట‌వీ ప్రాంతంలోనే షూట్ చేశారు. ఇందులో ప‌లు స‌న్నివేశాల‌ను విజువ‌ల్ ఎఫెక్ట్స్ వాడి అద్భుతంగా చూపించారు. సినిమాటోగ్రాఫ‌ర్ అశోక్ కుమార్ క‌ష్టం ప్ర‌తీ ఫ్రేమ్ లోనూ క‌నిపిస్తుంది. ఇక‌, మ‌రో అసెట్ మ్యూజిక్‌. పాట‌ల‌క‌న్నా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో అద‌ర‌గొట్టాడు. ఎడిటింగ్ కు ఇంకాస్త ప‌నిపెడితే బాగుండేద‌నిపిస్తుంది.

బ‌లాలుః రానా, క‌థ‌, విజువ‌ల్స్‌, బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌

బ‌ల‌హీన‌త‌లుః ట్విస్టులు లేని క‌థ‌నం, సాగ‌దీత స‌న్నివేశాలు

లాస్ట్ లైన్ః ‘అర‌ణ్య’‌ను కాపాడ‌లేక‌పోయిన సాలోమ‌న్‌

ఓకే తెలుగు.కామ్ రేటింగ్ః 2

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్