https://oktelugu.com/

Nindha Movie Review: నింద ఫుల్ మూవీ రివ్యూ…

కొత్త 'బంగారులోకం ' సినిమాతో యూత్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత 'ఏమైంది ఈవేళ' అనే సినిమాతో కూడా మరోసారి మంచి సక్సెస్ ని అందుకున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : June 21, 2024 / 09:33 AM IST

    Nindha Movie Review

    Follow us on

    Nindha Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ‘హ్యాపీడేస్ ‘ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్న నటుడు వరుణ్ సందేశ్…ఇక ఆ సినిమాలో తను మెయిన్ లీడ్ గా నటించి మెప్పించడమే కాకుండా ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలతో కూడా సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. ముఖ్యంగా కొత్త ‘బంగారులోకం ‘ సినిమాతో యూత్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత ‘ఏమైంది ఈవేళ’ అనే సినిమాతో కూడా మరోసారి మంచి సక్సెస్ ని అందుకున్నాడు.

    ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత చేసిన సినిమాలేవి అంతగా కలిసి రాలేదు. ఇక దాంతో ఇప్పుడు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో ‘నింద ‘ అనే ఒక సినిమాని చేశాడు. అయితే ఈ సినిమా ఇవాళ్ళ రిలీజ్ అయింది. ఆ మూవీ ఎలా ఉంది వరుణ్ సందేశ్ కి మరొక సక్సెస్ ని తీసుకొచ్చి పెట్టిందా? లేదంటే ఇది కూడా ఫ్లాప్ గానే మిగిలిందా? అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక ఊరిలో అమ్మాయి రేపు కి గురై చనిపోతుంది. ఇక ఆ అమ్మాయిని ఎవరు చంపారు అనే విషయం మీద ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. ఇక ఈ క్రమంలో పోలీసులు ఆ అమ్మాయిని ఒకరు చంపితే మరొకరిని జైలుకు పంపించాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ అమ్మాయిని చంపిన అసలు నేరస్తులు ఎవరు.? వాళ్ల వెనకాల ఎవరు ఉన్నారు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు రాజేష్ జగన్నాథం ఎంచుకున్న పాయింట్ బాగానే ఉంది. అయినప్పటికీ ఈ సినిమాని మొదటి నుంచి కూడా తను ఎంగేజింగ్ గా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. ఇక తనకి ఇది మొదటి సినిమా కావడం వల్ల అక్కడక్కడ కొద్దివరకు డైరెక్షన్ పరంగా తడబడినట్టుగా అనిపించింది. అయినప్పటి ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే మాత్రం బాగుండటం తో సినిమాను చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. ఇక అందులో భాగంగానే ఈ సినిమాలో వచ్చే కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ మాత్రం చాలా బాగా రాసుకున్నాడనే చెప్పాలి. ఇంకా కొన్ని ట్విస్ట్ లు కూడా సినిమాకి హెల్ప్ అయ్యాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాలో ఎవరు మర్డర్ చేశారు అనే ఒక అంశం మీద సినిమాను చాలా ఇంట్రెస్టింగా తీసుకెళ్లి చివరలో రివిల్ చేయడం అనేది నిజంగా చాలా ఎగ్జైటింగ్ గా ఉందనే చెప్పాలి.

    ఇక మొత్తానికైతే ఈ సినిమాని దర్శకుడు నడిపించిన విధానం ప్రతి ఒక్క సినిమా ప్రేక్షకుడిని కూడా ఎంగేజ్ చేసే విధంగా ఉంటుంది. ఇతను రాసుకున్న స్క్రీన్ ప్లే అయితే సినిమాని ముందుకు తీసుకెళ్లడంలో చాలావరకు హెల్ప్ అయింది. ఇక ఎప్పుడైతే వరుణ్ సందేశ్ ఎంట్రీ ఉంటుందో అప్పటినుంచి సినిమా చాలా ఫాస్ట్ గా ముందుకు సాగుతుంది. అక్కడక్కడ సినిమా కథపరంగా కొంచెం తగ్గినట్టు అనిపించినప్పటికీ స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశాడనే చెప్పాలి. ఇక ఈ సినిమా మ్యూజిక్ కూడా కొంతవరకు పర్లేదు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. మరికొంత ఎఫర్ట్ పెట్టి ఉంటే సినిమా అవుట్ పుట్ ఇంకా బాగా వచ్చిండేది…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఇక ఈ సినిమాలోని ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే వరుణ్ సందేశ్ చాలా రోజుల తర్వాత ఒక డీసెంట్ పాత్రలో నటించాడు. ఇక మొదటి నుంచి చివరి వరకు అసలు ఎక్కడ బోర్ కొట్టించకుండా అతని పాత్ర ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే విధంగా నటించి మెప్పించాడు… ఇక ఇంతకు ముందు తను చాలా సినిమాలు చేసినప్పటికి. అందులో లవ్ స్టోరీ సినిమాలే ఎక్కువ గా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ కొత్త జానార్స్ అటెంప్ట్ చేయడం అనేది ఆయనకు చాలావరకు హెల్ప్ అవుతుందనే చెప్పాలి… ఇక ఈ సినిమాలో తనికెళ్ళ భరణి కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించాడు. ఆయన పాత్ర కూడా సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది. అలాగే ఛత్రపతి శేఖర్ కూడా చాలా ఇంపార్టెంట్ పాత్రను పోషించడమే కాకుండా ఆయన మీదే ఈ సినిమా మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆయన తన పాత్రకి 100% న్యాయం చేశారనే చెప్పాలి… భద్రం లాంటి ఆర్టిస్టులు కూడా తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…

    టెక్నికల్ అంశాలు

    ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన సంతు ఓంకార్ ఇంకొంచెం బెటర్ మ్యూజిక్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే సినిమాలోని సస్పెన్స్ ఎలిమెంట్స్ ని హైలెట్ చేయడానికి ఆయన మ్యూజిక్ అనేది కొంతవరకు డల్ అయిందనే చెప్పాలి. విజువల్స్ పరంగా చూసుకుంటే ఒక్కొక్క విజువల్ మరి అంత ఎక్స్ ట్రా ఆర్డినరీ గా లేకపోయిన కూడా సినిమా చూసే ప్రేక్షకుడికి ఒక మూడ్ ను క్రియేట్ చేయడంలో మాత్రం సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే కొన్ని సీన్లలో అవసరం లేకపోయిన కూడా కొంత పార్ట్ మరి ఎక్కువగా షూట్ చేసి పెట్టారు దాన్ని షార్ప్ గా ట్రిమ్ చేస్తే బాగుండేదని సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడికి అనిపిస్తూ ఉంటుంది…

    ప్లస్ పాయింట్స్

    వరుణ్ సందేశ్ యాక్టింగ్
    స్క్రీన్ ప్లే

    మైనస్ పాయింట్స్

    రోటీన్ స్టోరీ
    మ్యూజిక్

    రేటింగ్
    ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.25/5

    చివరి లైన్
    వరుణ్ సందేశ్ గత సినిమాలతో పోలిస్తే కొంతవరకు ఒకే…