https://oktelugu.com/

Venkatesh: కూతురు వయసున్న హీరోయిన్ తో వెంకీ రొమాన్స్.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్

మెగా హీరో వరుణ్ తేజ్ మరో హీరోగా నటించారు. ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 పర్లేదు అనిపించుకుంది. పార్ట్ 1 స్థాయిలో విజయం సాధించలేదు. కాగా వెంకటేష్ ఈ ఏడాది సైంధవ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : June 21, 2024 / 09:21 AM IST

    Venkatesh

    Follow us on

    Venkatesh: హీరో వెంకటేష్ వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్నారు. కొన్నేళ్లుగా ఆయన ఫిల్మోగ్రఫీ పరిశీలిస్తే… పెళ్లీడుకొచ్చిన పిల్లలకు తండ్రిగా కూడా నటిస్తున్నారు. దృశ్యం, దృశ్యం 2, నారప్ప చిత్రాల్లో ఆయన మిడిల్ ఏజ్ మెన్ గా కనిపించారు. కమర్షియల్ సబ్జక్ట్స్ కి బదులు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నాడు. వెంకీకి ఒకప్పుడున్న స్టార్డం లేదు. అందుకే మల్టీస్టారర్స్ తో నెట్టుకొస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 2 భారీ హిట్. ఓ దశాబ్ద కాలంలో వెంకీకి ఇదే అతిపెద్ద విజయం.

    అయితే ఇది మల్టీస్టారర్. మెగా హీరో వరుణ్ తేజ్ మరో హీరోగా నటించారు. ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 పర్లేదు అనిపించుకుంది. పార్ట్ 1 స్థాయిలో విజయం సాధించలేదు. కాగా వెంకటేష్ ఈ ఏడాది సైంధవ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలా గ్యాప్ తర్వాత భారీ కమర్షియల్ సబ్జెక్టు ట్రై చేశాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సైంధవ్ డిజాస్టర్ అయ్యింది. సంక్రాంతి చిత్రాల్లో అత్యంత వరస్ట్ మూవీగా సైంధవ్ నిలిచింది.

    లాభం లేదని తనకు కలిసొచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఎంచుకున్నాడు. దర్శకుడు అనిల్ రావిపూడితో ముచ్చటగా మూడోసారి జతకడుతున్నాడు. ఈ చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే విచిత్రమైన టైటిల్ నిర్ణయించారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తెరకెక్కనుంది. ప్రీ ప్రొడక్షన్ జరుగుతుండగా త్వరలో షూటింగ్ మొదలు కానుంది. కాగా దర్శకుడు అనిల్ రావిపూడి హీరో వెంకీ కోసం హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నాడట.

    మొదట మీనాక్షి చౌదరిని అనుకున్నారు. ఆమెను తప్పించి ఐశ్వర్య రాజేష్ కి ఛాన్స్ ఇచ్చారంటూ ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే యంగ్ హీరోయిన్ తో వెంకీ రొమాన్స్ చేయాల్సి వస్తుంది. ఐశ్వర్య రాజేష్ పై లుక్ టెస్ట్ కూడా నిర్వహించారు. ఆమె ఈ చిత్రంలో పాత్రకు చక్కగా సరిపోతుందని భావించారట. ఈ క్రమంలో ఐశ్వర్య రాజేష్ కి ఛాన్స్ దక్కిందని అంటున్నారు. మీనా వంటి సీనియర్ హీరోయిన్స్ తో నటిస్తున్న వెంకీ కూతురు వయసున్న ఐశ్వర్యతో రొమాన్స్ చేయనున్నాడని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజం చెప్పాలంటే చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణలతో నటించే హీరోయిన్స్ అందరూ… వాళ్ల పిల్లల వయసున్న వారే..