https://oktelugu.com/

Max Movie Review: ‘మ్యాక్స్ ‘ఫుల్ మూవీ రివ్యూ…

'మ్యాక్స్ ' సినిమా తెలుగులో డబ్ అయింది... మరి ఈ సినిమా ఎలా ఉంది? కిచ్చా సుదీప్ ఇమేజ్ ని పెంచే విధంగా ఉందా? లేదంటే సగటు ప్రేక్షకుడిని నిరాశపరిచిందా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Written By:
  • Gopi
  • , Updated On : December 31, 2024 / 05:54 PM IST

    Max Movie Review

    Follow us on

    Max Movie Review: కన్నడ సినిమా ఇండస్ట్రీ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు సుదీప్… ఆయనకు తెలుగులో కూడా మంచి ఆదరణ అయితే లభించింది. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన ‘ఈగ ‘ సినిమాలో విలన్ గా నటించి తనదైన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఇక అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ నటుడు… అడపదడప తెలుగు సినిమాల్లో కనిపిస్తూ వస్తున్నప్పటికి తెలుగులో ఫుల్ లెంత్ క్యారెక్టర్ అయితే ఇప్పటివరకు పోషించలేకపోయాడు. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఆయన చేసిన ‘మ్యాక్స్ ‘ సినిమా తెలుగులో డబ్ అయింది… మరి ఈ సినిమా ఎలా ఉంది? కిచ్చా సుదీప్ ఇమేజ్ ని పెంచే విధంగా ఉందా? లేదంటే సగటు ప్రేక్షకుడిని నిరాశపరిచిందా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే అర్జున్ మహక్షయ్ అలియాస్ మ్యాక్స్ (కిచ్చ సుదీప్) ఒక పోలీసు ఆఫీసర్… ఇక అతని ఎంటైర్ కెరియర్ లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఉండడం వల్ల చాలా ఎక్కువసార్లు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాడు…ఇక ఎట్టకేలకు ఒక పోలీస్ స్టేషన్ కి బాధ్యతలు తీసుకున్న రోజే ఒక ఇద్దరు ఆకతాయిలు లేడీ పోలీస్ కానిస్టేబుల్ తో అసభ్యంగా ప్రవర్తిస్తారు. వాళ్ళు మంత్రుల కొడుకులు అని తెలిసినా కూడా వాళ్లను తీసుకొచ్చి జైలు లో పెడతాడు అనుకోకుండా రాత్రికి రాత్రే వాళ్ళు చనిపోతారు. ఈ విషయం బయటికి తెలిస్తే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశ్యంతో మ్యాక్స్ ఒక ఉపాయాన్ని పన్నుతాడు…

    ఇక రాత్రికి రాత్రే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు. ఇక ఈ క్రమంలోనే క్రైమ్ సీఐగా ఉన్న రూప (వరలక్ష్మి శరత్ కుమార్) వీళ్ళ మీద ఎలాంటి చార్జ్ తీసుకుంది. మరి వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఎలా చనిపోయారు.? అసలు సిఐ రూప కి మ్యాక్స్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాని దర్శకుడు విజయ్ కార్తికేయ గిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నడిపించే ప్రయత్నం అయితే చేశాడు. అయితే ఈ సినిమాలో కథ పెద్దగా లేకపోవడంతో కథనం మీద ఆయన దృష్టి అంతా పెట్టి మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుడికి బోరింగ్ లేకుండా సినిమాను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. మరి ఏది ఏమైనా కూడా ఫస్ట్ అఫ్ కొంతవరకు స్లో సో గా నడిచినప్పటికి సెకండ్ హాఫ్ లో మాత్రం సుదీప్ తన విశ్వరూపాన్ని చూపిస్తూ దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే యావత్ ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా ఈ సినిమాని మరొక మెట్టు పైకెక్కిస్తుందనే చెప్పాలి…

    సుదీప్ ఆడే మైండ్ గేమ్ గాని పొలిటికల్ యాక్సెప్ట్ లో వాళ్లు తీసుకునే నిర్ణయాలకు సుదీప్ పెట్టే మెలికలు బాగుంటాయి. ఇక అలాగే ఆయన పోలీస్ స్టేషన్ ని అందులో ఉన్న పోలీసులను కాపాడుకుంటూ చేస్తున్న ఈ ఒక పోరాటం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సినిమా మొత్తం ఒక రాత్రిలో మాత్రమే జరుగుతుంది. ఇక సినిమా చూస్తున్నంత సేపు మనకు కార్తీ చేసిన ఖైదీ సినిమా అయితే గుర్తుకొస్తుంది. సేమ్ అదే టోన్ లో అదే టెంప్లేట్ లో సినిమా అనేది సాగుతూ ఉంటుంది. అయినప్పటికి స్క్రీన్ ప్లే బలంగా ఉండడం వల్ల ఈ సినిమా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండటమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా అభిమానులందరిని ఆకట్టుకుంటుందనే చెప్పాలి…

    ఇక అక్కడక్కడ కొంచెం స్లో నరేషన్ తో నడిచినప్పటికి సినిమా మీద మాత్రం దర్శకుడు స్క్రీన్ ప్లే ఎక్కడ తేడా లేకుండా చాలా టైట్ గా వేసుకోవడం వల్ల సినిమా ఎంతసేపు ముందుకు సాగినా కూడా ప్రేక్షకుడికి సినిమాను చూడాలనే ఒక ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. ముఖ్యంగా సెకండాఫ్ అయితే ఉత్కంఠతో సినిమా సాగడమే కాకుండా నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటూ ప్రతి ఒక్క ప్రేక్షకుడి లో టెన్షన్ అయితే కలుగుతుంది. మరి అలాంటి సీన్లను బిల్డ్ చేసిన దర్శకుడు యొక్క విజన్ కి మనం హాట్సాఫ్ చెప్పాల్సిందే…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఇందులో సుదీప్ ఒంటరి పోరాటం చేశారనే చెప్పాలి. సినిమా మొత్తాన్ని తన భుజాల మీద వేసుకొని మోసుకుంటూ విజయతీరాలకు చేర్చాడు. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఆయనకు బాగా సపోర్ట్ చేస్తూ సినిమాని ఎంగేజ్ చేస్తూ వచ్చారు. ఇంకా సునీల్ పోషించిన పాత్ర కూడా ఈ సినిమాకు చాలావరకు ప్లస్ అయిందనే చెప్పాలి. ఇక మిగిలిన ఆర్టిస్టులందరూ కూడా వాళ్ల పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…

    టెక్నికల్ అంశాలు

    ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాలో మ్యూజిక్ అనేది చాలా అద్భుతంగా కుదిరింది. ఇక కాంతార సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న అంజనీష్ లోక్ నాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ముఖ్యంగా సినిమాలోని కొన్ని సీన్లని ఎలివేట్ చేయడంలో ఈ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనేది బాగా హెల్ప్ అయిందనే చెప్పాలి…ఇక శేఖర్ చంద్ర అందించిన సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది. ఇక ఫైట్ సీక్వెన్స్ లో వచ్చే షాట్స్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా డీల్ చేశారనే చెప్పాలి. ముఖ్యంగా కొన్ని ఎలివేషన్ సీన్స్ లో కూడా సినిమాటోగ్రఫీకి చాలా స్కోప్ అయితే ఉంది. దాన్ని సరిగ్గా వాడుకొని మంచి విజువల్స్ ని అందించడంలో ఆయన సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి…. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమా రేంజ్ కి తగ్గట్టుగా ఉండటం విశేషం…

    ప్లస్ పాయింట్స్

    సుదీప్
    స్క్రీన్ ప్లే
    సెకండాఫ్

    మైనస్ పాయింట్స్

    కథ లేకపోవడం
    అక్కడక్కడ స్లో నేరేషన్ తో ఉండటం…

    రేటింగ్

    ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.75/5