New Year : 2024కు వీడ్కోలు చెబుతున్నాం.. 2025కు స్వాగతం చెప్పబోతున్నాం.. ఈ పోయిన సంవత్సరం భారత్ కు ఎలా ఉంది.. కలిసివచ్చిందా? కలవరపెట్టిందా? సంవత్సరం అయిపోతున్న వేళ సమీక్ష చేసుకుందాం. ఈ ఏడాది జరిగిన అతిపెద్ద ఘటన అయోధ్య. 500 ఏళ్ల అయోధ్య సమస్య పరిష్కారానికి ముగింపు పడింది. రామాలయాన్ని ప్రారంభించిన సంవత్సరం 2024.. మోడీ మూడో సారి ముచ్చటగా అధికారంలోకి వచ్చిన సంవత్సరం 2024.. నెహ్రూ తర్వాత రికార్డ్ క్రియేట్ చేశారు. కశ్మీర్ లో తిరిగి ప్రశాంతంగా ఎన్నికలు జరిపి ప్రపంచాన్ని నోరు మూయించిన సంవత్సరం కూడా ఇదే. అత్యంత ఎక్కువ ఓటింగ్ పర్సంటేజీతో ఎన్నికలు నిర్వహించారు.
2024 లో జరిగిన విషాదం ఏంటంటే.. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోవడం.. ఈ మహ్మద్ యూనస్ వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ లో హిందువులపై తీవ్ర దాడులు జరగడం చూస్తున్నాం. మయన్మార్ అంతర్గత పోరాటంలో మునిగిపోయింది. మన సరిహద్దు రాష్ట్రాలైన అరఖాన్, చిన్ రాష్ట్రాలు తిరుగుబాటు దారుల వశమైంది. 2024 అంతా గందరగోళంగా మారింది.
అందరూ సంతోషపడాల్సింది ట్రంప్ తిరిగి అధికారంలోకి రావడం గుడ్ న్యూస్ గా చెప్పొచ్చు. భారత్ కు ఇది ఊరట.. హెచ్1 బీ వీసాల విషయంలో స్కిల్ ఉన్న వారికి ఇస్తానని ప్రకటించడం గొప్ప న్యూస్ గా చెప్పొచ్చు. ఇవ్వాళ అమెరికాలో 60 శాతం హోటల్స్, 10 యూఎస్ పేటంట్స్ లో భారతీయ మూలాల వారే.. 12 శాతం ఫ్యార్చూన్ సీఈవోలు భారతీయులే ఉన్నారు.
2024కి వీడ్కోలు 2025కి స్వాగతం పలుకుతూ ‘భారతీయుల’ ప్రాముఖ్యతపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.