Kara Movie Review: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ సినిమాలను చేస్తున్న నటులలో ధనుష్ మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన సినిమా సినిమాకి వైవిధ్యాన్ని చూపిస్తాడు. అలాగే చాలా తక్కువ రోజుల్లో సినిమాలు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ ఉంటాడు. అందుకే ఒక ఇయర్లో ఆయన నుంచి దాదాపు రెండు నుంచి మూడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇక ఈ క్రమంలోనే ఆయన ఇప్పుడు విగ్నేష్ రాజా దర్శకత్వంలో ‘కర’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
కర (ధనుష్) అనే వ్యక్తి దొంగతనాలు చేస్తు లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా ఆయన చేసిన కొన్ని దొంగతనాల వల్ల తను కొన్ని ప్రాబ్లమ్స్ లో ఇరుక్కోవాల్సి వస్తుంది… అలాగే ఆ ప్రాబ్లమ్స్ ని ఆయన ఎలా ఫేస్ చేశాడు… దొంగతనం నుంచి తను ఎలా రియలైజ్ అయ్యాడు. ఫైనల్ గా ఆయన ఎవరి కోసం దొంగతనాలు చేశాడు…ఎందుకోసం చేశాడు. మొత్తానికైతే ఆయన పోలీసులకి దొరికిపోయాడా? లేదంటే పోలీసుల నుంచి తప్పించుకున్నాడా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
డైరెక్టర్ విగ్నేష్ రాజా మొదటినుంచి ఈ సినిమాని చాలా గ్రిప్పింగ్ గా నడిపించే ప్రయత్నం చేశాడు. మొదటి 25 నిమిషాలు అసలు ఎక్కడా కూడా తగ్గకుండా ఈ సినిమాతో ఒక హైప్ లోకి తీసుకెళ్లాడు. ఇక 25 నిమిషాల తర్వాత నుంచి సినిమా కొంచెం డల్ అవుతూ రావడం సినిమాలో అనవసరమైన ఎమోషన్ ఎలిమెంట్స్ యాడ్ చేసి సినిమాను కొంత వరకు డైల్యూట్ చేశారనే చెప్పాలి. నిజానికి ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ముందుకు సాగుతున్న కథలో దొంగతనాలు ఎలా జరుగుతున్నాయి.
హీరో వాటిని ఎలా చేశాడు అనే విషయాలను కూడా దర్శకుడు స్క్రీన్ మీద చాలా డీటెయిల్ గా చూపించాడు. దొంగతనం జరిగే కొన్ని సన్నివేశాలైతే చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఇంటర్వెల్ కి ముందు వచ్చే దొంగతనం ఎపిసోడ్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచిందనే చెప్పాలి… సెకండాఫ్ లో హీరోకి పోలీసు కి మధ్య ఒక వార్ నడుస్తుంది. ఒకరిని మించి మరొకరు ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ ముందుకు సాగుతారు. ఈ మూవీని సక్సెస్ ఫుల్ గా డీల్ చేసిన దర్శకుడు మూవీలో ఫాదర్ ఎమోషన్ ని అనవసరం గా మిక్స్ చేసి కొంతవరకు కథను డైల్యూట్ చేశారు. దాంతో ఈ సినిమా కొంతవరకు డల్ అయింది. ఇక అప్పటివరకు హ్యాపీగా సాగిన ఈ సినిమాలో క్లైమాక్స్ సైతం చాలా రొటీన్ గా ఉంది.
సినిమా స్టోరీ మొత్తం తెలిసిపోయిన తర్వాత క్లైమాక్స్ ని చాలా రొటీన్ పద్ధతిలో ముగించినట్టుగా అనిపించింది…ధనుష్ యాక్టింగ్ ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది. జీవి ప్రకాష్ అందించిన మ్యూజిక్ కూడా ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలిపింది. ముఖ్యంగా బ్యా గ్రౌండ్ స్కోర్ విషయంలో ఆయన స్పెషల్ కేర్ తీసుకున్నాడు ఆయనవల్లె కొన్ని సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టులు పర్ఫామెన్స్ విషయానికి వస్తే ధనుష్ ఈ సినిమాని తన ఒంటిచేత్తో ముందుకు తీసుకెళ్లడనే చెప్పాలి. స్క్రీన్ మీద ధనుష్ కనిపించినంత సేపు అసలు ప్రేక్షకులు విజిల్స్ తో కేక పుట్టించారు. ఇక దానికి తగ్గట్టుగానే అతని పాత్ర ఎక్కడ డల్ అవ్వకుండా ప్రేక్షకులను మెప్పించింది… నమిత బైజు సైతం తన క్యారెక్టర్ కి తగ్గట్టుగా చాలా చక్కటి పర్ఫామెన్స్ ఇచ్చింది.
క్యారెక్టర్ లో డెప్త్ ఉండటం వల్ల అయ్యే విధంగా ఆమె ఒకే టెంపో ను మైంటైన్ చేస్తూ సినిమా చేయడానికి సహాయపడింది. ఇక కె ఎస్ రవికుమార్ సైతం తన పాత్రలో ఒదిగిపోయి నటించాడు. సూరజ్ వెంజరముడు అనే నటుడు సైతం ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్లో నిలిపాడు. మొత్తానికైతే ఈ సినిమాలో ఉన్న నటులందరు సినిమాని టాప్ లెవల్లో నిలిపే ప్రయత్నం చేశారు. కొంతమంది ఆర్టిస్టులు సైతం మన పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. అలాగే డిఓపి వర్క్ కూడా చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ గా ఉంది. ఫస్టాప్ లో వచ్చే దొంగతనం సన్నివేశాలను తెరకెక్కించడంలో సినిమాటోగ్రాఫర్ చాలా వరకు కన్సిస్టెంట్ గా సినిమా మూడు చెడిపోకుండా షాట్స్ కంపోజ్ చేసుకున్నాడు…ప్రొడక్షన్ వాల్యూస్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి…
ఈ సినిమాలో బాగోలేనివి
సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు…
రొటీన్ క్లైమాక్స్
ఈ సినిమాలో బాగున్నవి
ఫస్ట్ 25 మినిట్స్
ప్రీ ఇంటర్వెల్
ట్విస్ట్ లు
రేటింగ్ : 2.5/5