Homeప్రత్యేకంJigarthanda Double X Review: జిగర్ తండ మూవీ ఫుల్ రివ్యూ...

Jigarthanda Double X Review: జిగర్ తండ మూవీ ఫుల్ రివ్యూ…

Jigarthanda Double X Review: ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమాకి సంబంధించిన అంచనాలు ప్రేక్షకుల్లో విపరీతంగా ఉంటాయి. ఇక అదే సినిమా ఒక సిక్వెల్ సినిమా అయితే మాత్రం మొదటి పార్ట్ సాధించిన విజయం కంటే రెండో పార్ట్ భారీ విజయాన్ని సాధించాలి అనే ఉద్దేశ్యం తో ఆ సినిమా మీద విపరీతమైన అంచనాలైతే ఉంటాయి. ఇక దానికి తగ్గట్టుగానే మేకర్స్ కూడా చాలా మంచి స్టోరీ ని ఎంచుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.అందులో భాగంగా 2014 లో వచ్చిన జిగర్ తండ మూవీ కి సీక్వెల్ గా వచ్చిన సినిమానే జిగర్ తండా డబుల్ ఎక్స్ మూవీ… ఈ మూవీ ఎలా ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…

ముందుగా ఈ సినిమా కథ గురించి తెలుసుకుంటే 1975 సంవత్సరంలో ఒక థియేటర్ దగ్గర ఒక రౌడీ (లారెన్స్)కి జరిగిన గొడవ వల్ల తను హీరోగా మారాలి అనుకుంటాడు. అయితే ఆయన చూడడానికి చాలా నల్లగా అసహ్యంగా ఉంటాడు ఇక అలాంటి ఆరౌడీ హీరో అవుతాను అనడంతో అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతారు.వాళ్ళు అలా నవ్వడం చూసిన ఆ రౌడీ వాళ్ళందరికీ గుణపాఠం చెప్పాలి అంటే తను హీరో అవ్వాలనే స్ట్రాంగ్ గా డిసైడ్ అయి తనను పెట్టి సినిమా తీసే డైరెక్టర్ కోసం వెతుకుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఎస్ జె సూర్య అతనికి దొరుకుతాడు. సినిమా అంటే ప్యాషన్ గా ఉండే ఎస్ జె సూర్య ఒక బిగ్గెస్ట్ హిట్టు సినిమా తీసి తను ఒక పెద్ద డైరెక్టర్ గా గుర్తింపు పొందాలి అనుకుంటాడు.కానీ అదే సమయంలో ఈ రౌడీతో సినిమా చేయమని ఎస్ జే సూర్య ఫోర్స్ చేస్తూ ఉంటారు.

మొదట్లో రౌడీతో సినిమా చేయడానికి అతను ఒప్పుకోనప్పటికీ ఆ తర్వాత రౌడీతో సినిమా చేస్తే అది కొత్త రకమైన ఎక్స్పరిమెంట్ అవుతుందనే ఉద్దేశ్యం తో ఆయన ఒప్పుకోవడం జరుగుతుంది. ఇక అప్పటినుంచి సూర్య లారెన్స్ ని పెట్టి సినిమా తీయడానికి ఎలాంటి కథను ఎంచుకోవాలి అనే కథాంశం మీదనే ఈ కథ నడుస్తూ ఉంటుంది.అయితే ఈ ప్రాసెస్ లో ఆ రౌడీ కి కొంతమంది రాజకీయ నాయకులతో ఏర్పడిన కలహాల వలన రౌడీ మంచి వ్యక్తిగా మారతాడా ఆయనతో సినిమాని తీసే ఎస్ జె సూర్య ఆ సినిమాని ఫినిష్ చేసి రిలీజ్ చేస్తాడా లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

ఇక ముందుగా ఈ సినిమా డైరెక్టర్ అయిన కార్తిక్ సుబ్బరాజు గురించి తెలుసుకుంటే ఈయన తమిళంలో తీసిన సినిమాలు అన్నీ కూడా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇక. అందులో ముఖ్యంగా ఆయన తీసిన జిగర్ తండ మూవీ ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసిందనే చెప్పాలి.ఇక ఈ సినిమా లో బాబి సింహ రోల్ లో చేసి ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేశాడు. ఇక ఆ సినిమానే తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన వాల్మీకి అనే సినిమాగా రీమేక్ అయింది. ఇక ఈ సినిమా తెలుగులో అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించినన్పటికీ తమిళం లో మాత్రం బిగ్గెస్ట్ హిట్టవ్వడమే కాకుండా నటుడు బాబి సింహ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది… అయితే దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఈ సినిమా కి సిక్వల్ గా వచ్చిన జిగిర్ తాండ డబల్ ఎక్స్ మూవీ ఎలా ఉంది అనేది మన బ్రీఫ్ అనాలసిస్ లో తెలుసుకుందాం…

ఈ సినిమాలో స్టోరీ పెద్దగా లేనప్పటికీ స్క్రీన్ ప్లే గాని ఈ సినిమా ని డైరెక్టర్ నడిపించిన విధానంగాని చాలా బాగున్నాయి అనే చెప్పాలి.ఇక ఈ సినిమాలో కొన్ని కొన్ని మైనర్ డీటెయిల్స్ కూడా డైరెక్టర్ చాలా అద్భుతంగా డీల్ చేశాడు . అలాగే రౌడీ పాత్రలో లారెన్స్ ని డిజైన్ చేసిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది.ఈ మూవీ లో.కథ ఏం లేకున్నా కథాంశంతో సినిమాని నడిపించాడు. ముఖ్యంగా కొన్ని మేజర్ ఎలిమెంట్స్ లో అంటే లారెన్స్ పొలిటిషన్ ని ఎదుర్కునే సీన్స్ లలో ఎలివేషన్స్ ని చాలా బాగా రాసుకొని అందులో ఉన్న డెప్త్ ని చాలా అద్భుతంగా చూపించాడు.అలాగే ఆ రౌడీ తాలూకు ఎమోషన్ ని కూడా చాలా డెప్త్ గా రాసుకున్నాడు. ఎస్ జె సూర్య పాత్రలోని ఇంటెన్స్ ని ఎక్కడ తగ్గకుండా ఒక ప్యాషనేట్ డైరెక్టర్ ఎలాగైతే ఉంటాడో అలాగే ఈ సినిమాలో ఎస్ జే సూర్య కారెక్టర్ ని డిజైన్ చేశాడు…
ఈ సినిమాతో జిగర్ తాండ రేంజ్ కాకపోయిన తన సాధ్యమైనంతవరకు కార్తీక్ సుబ్బరాజు తన ఎఫర్ట్ మొత్తం పెట్టి తెరకెక్కించాడు…

ఇక ఈ సినిమాలో ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే లారెన్స్ రౌడీ పాత్రలో ఒదిగిపోయి చాలా అద్భుతంగా నటించాడు.ఇక ఈ సినిమా స్టార్ట్ అయిన పది నిమిషాల్లోనే లారెన్స్ మనల్ని ఆ రౌడీ పాత్రలోకి తీసుకెళ్తాడు ఇక మనకు అక్కడ లారెన్స్ కనిపించడు అ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. అలాగే ఎస్ జే సూర్య కూడా టాప్ నాచ్ నటనతో తన కెరీర్ లో మరో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన సినిమాగా ఈ సినిమా నిలిచిపోతుందనే చెప్పాలి. ఇక నవీన్ చంద్ర కూడా అద్భుతమైన పాత్రలో తన పరిధి మేరకు నటించాడు. ఇక నిమిష సజయాన్ కూడా తన పాత్రలో ఒదిగిపోయి నటించింది…

ఇక మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ కూడా సాంగ్స్ కొద్దిపాటి గా అలరించినప్పటికీ బిజిఎం కూడా సినిమాకి వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అయిందనే చెప్పాలి. ముఖ్యంగా లారెన్స్ కొన్ని సీన్లలో కొంతమందికి వార్నింగ్ ఇచ్చినప్పుడు ఆ ఎలివేషన్ ని డైరెక్టర్ చాలా బాగా ఎలివేటర్ చేసే ప్రాసెస్ లో సంతోష్ నారాయణ బీజియం చాలా బాగా హెల్ప్ అయింది. తిరు సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. 1975 టైం పీరియడ్ ని తన విజువల్స్ తో చాలా బాగా క్రియేట్ చేశాడు అలాగే షఫీక్ మహమ్మద్ అలీ ఎడిటింగ్ వర్క్ కూడా బాగుంది…

ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ వచ్చేసి లారెన్స్, ఎస్ జె సూర్య యాక్టింగ్..కార్తిక్ సుబ్బరాజు రాసుకున్న పాయింట్ అలాగే దాన్ని డెలివరీ చేసిన విధానం… తిరువిజువల్స్…

మైనస్ పాయింట్స్ వచ్చేసి కథలో డెప్త్ లేకపోవడం ఎంతసేపు అవే క్యారెక్టర్స్ ని చూస్తూ ప్రేక్షకుడు నిరుత్సాహానికి గురవుతాడు. అలాగే మధ్యలో కొన్ని సీన్స్ లాగ్ అయ్యాయి ఇంకొంచెం క్రిస్పీగా ఉంటే బాగుండేది… సాంగ్స్ పరంగా సంతోష్ నారాయణ మ్యూజిక్ కూడా మైనస్ అయింది…

ఇక ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.75/5

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version