https://oktelugu.com/

Raghavendra Rao: శ్రీలీల మీద నేను జామ పండు మాత్రమే వాడాను… ఆ దర్శకుడు అన్ని విధాలుగా వాడాడు!

నటన అవలీలగా చేసింది, డాన్స్ అవలీలగా చేసింది, ఫైట్స్ అవలీలగా చేసింది, ఎమోషన్స్ అవలీలగా చేసింది. నేను శ్రీలీల మీద జామ పండు మాత్రమే వాడాను. అంటే గ్లామర్ రోల్ లో అల్లరిగా చూపించాను.

Written By: , Updated On : November 10, 2023 / 11:02 AM IST
Raghavendra Rao

Raghavendra Rao

Follow us on

Raghavendra Rao: భగవంత్ కేసరి సక్సెస్ మీట్ కి గెస్ట్ గా వచ్చిన దర్శకుడు రాఘవేంద్రరావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన శ్రీలీలను పొగిడే క్రమంలో… శ్రీలీల మీద నేను జామపండు మాత్రమే వాడాను. అనిల్ రాఘవపూడి మాత్రం అన్ని విధాలుగా ఆమెను చూపించాడని అన్నారు. బాలయ్య-అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన భగవంత్ కేసరి అక్టోబర్ 19న విడుదలైంది. దసరా బరిలో నిలిచిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వరల్డ్ వైడ్ భగవంత్ కేసరి రూ. 65 కోట్లకు పైగా షేర్ రాబట్టింది.

ఈ క్రమంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. అతిథిగా హాజరైన రాఘవేంద్రరావు మాట్లాడుతూ… బాలయ్య బాబు ఈ చిత్రంలో తండ్రి ఎన్టీఆర్ ని గుర్తు చేశాడు. తండ్రి పేరు ఎప్పుడో నిలబెట్టాడు. ఆంధ్రప్రదేశ్ అంతగా జై బాలయ్య నినాదాలు వినిపిస్తున్నాయన్నారు. అనంతరం శ్రీలీల గురించి మాట్లాడుతూ… శ్రీలీల గురించి ఏం చెప్పాలి. ఆమె ఏదైనా అవలీలగా చేసేస్తోంది.

నటన అవలీలగా చేసింది, డాన్స్ అవలీలగా చేసింది, ఫైట్స్ అవలీలగా చేసింది, ఎమోషన్స్ అవలీలగా చేసింది. నేను శ్రీలీల మీద జామ పండు మాత్రమే వాడాను. అంటే గ్లామర్ రోల్ లో అల్లరిగా చూపించాను. అనిల్ రావిపూడి మాత్రం అనేక కోణాల్లో చూపించాడు. అందుకు శ్రీలీల అనిల్ రావిపూడికి రుణపడి ఉండాలని అన్నారు. రాఘవేంద్ర రావు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

శ్రీలీలను టాలీవుడ్ కి పరిచయం చేశారు రాఘవేంద్రరావు. శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్ళిసందD చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఆ మూవీ అంతగా ఆడలేదు. అయితే శ్రీలీల గ్లామర్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ క్రమంలో ఆమెకు తెలుగులో ఆఫర్స్ మొదలయ్యాయి. ధమాకాతో హిట్ కొట్టిన శ్రీలీల ఏకంగా మహేష్, పవన్ కళ్యాణ్ పక్కన ఛాన్స్ కొట్టేసింది.

 

Director Raghavendra Rao Speech | Bhagavanth Kesari Boxoffice Ka Sher Celebrations | Balakrishna