Hidimba Movie Review : హిడింబా’ మూవీ ఫుల్ రివ్యూ

స్క్రీన్ ప్లే కాస్త తికమక పెట్టినా కొన్ని సన్నివేశాలు మాత్రం చాలా బాగా వచ్చాయి. వాటి కోసం సినిమా చూడాలి అనుకునేవాళ్లు ఈ చిత్రాన్ని చూడొచ్చు. అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే ఈ సినిమా నచ్చుతుంది.

Written By: Vicky, Updated On : July 20, 2023 12:18 pm
Follow us on

Hidimba Movie Review: నటీనటులు : అశ్విన్ బాబు , నందిత శ్వేతా , శ్రీనివాస రెడ్డి , సాహితి అవంఛ, శుభలేఖ సుధాకర్ , రఘు కుంచె తదితరులు

నిర్మాత : గంగపట్నం శ్రీధర్
దర్శకత్వం : అనిల్ కన్నెగంటి
సంగీతం : వికాస్ బాడీస

ప్రముఖ యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ సినిమాల్లో  హీరోగా ఎప్పటి నుండో కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. వైవిద్యభరితమైన కథలు ఎంచుకుంటూ, విభిన్నమైన పాత్రలను పోషిస్తూ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పర్చుకున్నాడు. ‘రాజు గారి గది’ సిరీస్ తో కెరీర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్స్ ని అందుకున్న అశ్విన్, ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన ‘హిడింబా’ అనే చిత్రం చేసాడు. నందిత శ్వేతా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ లో మంచి అంచనాలను ఏర్పాటు చేసుకున్న ఈ సినిమా, నేడు గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉందో లేదో ఒకసారి ఈ రివ్యూ లో చూద్దాం.

కథ :

అభయ్ (అశ్విన్ బాబు) మరియు ఆద్య (నందిత శ్వేతా) పోలీస్ శిక్షణ లో ట్రేనింగ్ తీసుకుంటున్న సమయం లోనే ప్రేమించుకుంటారు. ఆ తర్వాత కొన్ని అనుకోని సంఘటన కారణం గా వీళ్లిద్దరు విడిపోతారు. పోలీస్ ట్రైనింగ్ ఆద్య మరియు అభయ్ ఇద్దరు కూడా ఐపీఎస్ అధికారులుగా మారిపోతారు . అయితే నగరం లో ఆడవాళ్లు వరుసగా కిడ్నాప్ కి గురి అవుతున్న ఘటన సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసు కోసం అభయ్ , ఆద్య మళ్ళీ ఒక టీం గా పని చెయ్యాల్సిన సందర్భం ఏర్పడుతుంది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయం లో కాలా బండోలోని బోయా అనే కరుడుగట్టిన నేరస్తుల ముఠాను పట్టుకుంటారు. వీళ్ళ ముఠా లో చిక్కుకున్న ఆడవాళ్లను విడిపిస్తారు. అక్కడితో ఈ కిడ్నాప్ కేసు ముగిసింది అని అనుకునేలోపే మరో అమ్మాయి కిడ్నాప్ కి గురి అవుతుంది. ఆమె కోసం వెతుకుతూ పోగా మొన్న పట్టుకున్న ముఠా, ఇప్పుడు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసిన ముఠా వేరు అని తెలుస్తుంది. అసలు ఎవరూ ఈ కిడ్నాప్ లు చేస్తున్నారు. వాళ్లకి అసలు ఏమి కావాలి అనేది, ఈ కిడ్నాప్ కి హిడింబా జాతికి మధ్య ఉన్న లింక్ ఏంటి? ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

హిస్టరీ తో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇది. డైరెక్టర్ ఈ కథ ని నాన్ లినియర్ పద్దతి లో స్క్రీన్ ప్లే నడిపించాడు. అంటే వర్తమానం లో జరుగుతున్నా సన్నివేశాలు చూపిస్తూనే, గతం లో జరిగిన సన్నివేశాలను చూపిస్తాడు. ఇలాంటి స్క్రీన్ ప్లే ఉన్న సినిమాలకు టేకింగ్ చాలా ముఖ్యం. దానికి తోడు ఎడిటింగ్ కూడా జాగ్రత్తగా చెయ్యాలి. ఈ రెండిట్లో ఏది తేడా జరిగిన ఆడియన్స్ తికమక పడే ఛాన్స్ ఉంటుంది. ఈ సినిమాకి డైరెక్టర్ ఇక్కడే ఫెయిల్ అయ్యాడు. సినిమా ప్రారంభం నుండి ఫస్ట్ హాఫ్ వరకు చాలా స్పీడ్ గా స్క్రీన్ ప్లే సాగిపోతుంది. కానీ ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ ప్రారంభం అవుతుందో అప్పటి నుండి ఆడియన్స్ లో కన్ఫ్యూజన్ మొదలు అవుతుంది. అసలు డైరెక్టర్ ఏమి చెప్పాలి అనుకున్నాడు ఏమి చెప్తున్నాడు అనే సందిగ్ద పరిస్థితి చూసే ప్రతీ ప్రేక్షకుడిలో కనిపిస్తాది.

ఒక మంచి కథని డైరెక్టర్ చెప్పాల్సిన పద్దతిలో చెప్పకపోవడం వల్ల ఈ చిత్రం చూసే వాళ్లకు గజిబిజి స్క్రీన్ ప్లే లాగా అనిపిస్తాది. ఇక నటీనటుల విషయానికి వస్తే అశ్విన్ బాబు చాలా కస్టపడి ఈ సినిమాని చేసినట్టు గా  వెండితెర పైన కనిపిస్తాది. ముందు సినిమాలతో పోలిస్తే ఆయన నటన బాగా ఇంప్రూవ్ అయ్యింది. ఇక నందిత శ్వేతా గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆమె ఎప్పటి లాగానే ఈసారి కూడా అద్భుతమైన నటన తో దంచి కొట్టేసింది. అలాగే వికాస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్ గా నిల్చింది.

చివరి మాట :

స్క్రీన్ ప్లే కాస్త తికమక పెట్టినా కొన్ని సన్నివేశాలు మాత్రం చాలా బాగా వచ్చాయి. వాటి కోసం సినిమా చూడాలి అనుకునేవాళ్లు ఈ చిత్రాన్ని చూడొచ్చు. అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే ఈ సినిమా నచ్చుతుంది.

రేటింగ్ : 2.5/5