రైతుల ఆందోళనకు దేశవ్యాప్త మద్దతు..కొనసాగుతున్న బంద్‌

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేట్టాలని డిమాండ్‌ చేస్తూ నాలుగు నెలలుగా ఢిల్లీ వేదికగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కానీ.. ఈ ఆందోళనలపై కేంద్రం ఏ మాత్రం స్పందించకపోగా తన పని తాను చేసుకుంటూ పోతోంది. దీంతో రైతు ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసేందుకు శుక్రవారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ బంద్‌.. సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. భారత్ బంద్ కారణంగా ఇవాళ […]

Written By: Srinivas, Updated On : March 26, 2021 9:51 am
Follow us on


కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేట్టాలని డిమాండ్‌ చేస్తూ నాలుగు నెలలుగా ఢిల్లీ వేదికగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కానీ.. ఈ ఆందోళనలపై కేంద్రం ఏ మాత్రం స్పందించకపోగా తన పని తాను చేసుకుంటూ పోతోంది. దీంతో రైతు ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసేందుకు శుక్రవారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ బంద్‌.. సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. భారత్ బంద్ కారణంగా ఇవాళ దేశంలో రైళ్లు, రోడ్డు వ్యవస్థపై ప్రభావం పడింది. అలాగే మార్కెట్లు, మాల్స్, షాపింగ్‌ మాల్స్, జనసాంద్రత ప్రదేశాలను సైతం మూసివేయాలని నిర్ణయించారు. అటు బ్యాంక్ సేవలకు సైతం ఆటంకం కలిగే అవకాశం ఉంది. కేంద్ర కార్మిక, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు ఈ బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటించాయి. అంబులెన్స్, అత్యవసర ఆరోగ్య సేవలన్నింటికీ మినహాయింపు ఇచ్చినట్లు సీనియర్ రైతు నాయకుడు బల్బీర్ సింగ్ రాజేవాల్ స్పష్టం చేశారు.

Also Read: కరోనా ఎఫెక్ట్.. బెంగళూరు వెళ్లేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ?

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ, ఘాజీపూర్, సింఘ్, టిక్రీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న నిరసనలు నాలుగు నెలలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ బంద్‌ను తలపెట్టామని.. దేశ ప్రజలందరూ కూడా దీన్ని విజయవంతం చేయాలని రైతు నాయకుడు బల్బీర్ సింగ్ రాజేవాల్ వెల్లడించారు. రైతులు పలు ప్రాంతాల్లోని రైల్వే ట్రాక్‌లపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ బంద్‌కు కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్‌ సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో ఈ బంద్ ప్రభావం పలు రాష్ట్రాల్లోని సామాన్యులపై పడే అవకాశం ఉంది.

మరోవైపు.. ఈ బంద్‌కు జగన్ సర్కార్ సంఘీభావం తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో మధ్యాహ్నం 1 గంట వరకు ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ బస్సులు బంద్ కానున్నాయి. అత్యవసర సేవలు మాత్రం యథావిధిగా కొనసాగనున్నాయి. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బంద్‌ను శాంతియుతంగా నిర్వహించాలని ఏపీ రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు.

Also Read: సీఎం జగన్ కు థ్యాంక్స్ చెప్పిన చిరంజీవి

భారత్ బంద్ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మార్కెట్లు, జనసాంద్రత ప్రదేశాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్‌కు రాజకీయ పార్టీల నుంచి పూర్తిస్థాయి మద్దతు లభించింది. అటు కేంద్ర కార్మిక, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు సైతం మద్దతు ప్రకటించాయి. కాగా.. రైతుల నిరసనలను వ్యతిరేకిస్తున్న ట్రేడర్లు భారత్ బంద్‌కు తమ మద్దతు లేదని పేర్కొన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఈ మేరకు ప్రకటన చేసింది. శుక్రవారం మార్కెట్లు తెరిచే ఉంచుతామని, చర్చల ద్వారానే చట్టాలపై ప్రతిష్టంభన వీడుతుందని, అందువల్ల సాగు చట్టాలపై చర్చలు జరపాలని ట్రేడర్ల సమాఖ్య నేత ప్రవీణ్‌ ఖండేల్‌వాల్‌ అన్నారు. భారత్ బంద్ ప్రభావం ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్‌లో ఎక్కువగా కనిపిస్తోంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్