https://oktelugu.com/

Aa Okkati Adakku Review: ఆ ఒక్కటి అడక్కు మూవీ ఫుల్ రివ్యూ…

సబ్ రిజిస్టర్ గా పనిచేసే అల్లరి నరేష్ దాదాపు 200లకు పైన పెళ్ళిళ్ళు చేస్తాడు. కానీ 30 సంవత్సరాల పైబడిన ఈయనకు మాత్రం ఇంకా పెళ్లి అవదు.

Written By:
  • Gopi
  • , Updated On : May 3, 2024 / 11:38 AM IST

    Aa Okkati Adakku Review

    Follow us on

    Aa Okkati Adakku Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు రాజేంద్రప్రసాద్ కామెడీ సినిమాలు చేస్తూ వరుసగా సక్సెస్ లను అందుకున్నాడు. ఇక ఆయన తర్వాత అల్లరి నరేష్ హీరోగా వచ్చి కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. ఇక తనదైన రీతిలో వరుస కామెడీ సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకునే ప్రయత్నం అయితే చేశాడు. ఇక అందులో భాగంగానే అల్లరి నరేష్ ను జూనియర్ రాజేంద్రప్రసాద్ అని కూడా పిలిచారు. ఇక ఇదిలా ఉంటే వరుస గా ఆయన కామెడీ సినిమాలు చేయడం ప్రేక్షకులకు బోర్ కొట్టింది. దాంతో ఆయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టాయి.

    ఇక దాని తర్వాత ఆయన కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను చేయడం ప్రారంభించాడు. ఇక అందులో భాగంగా చేసిన నాంది, ఉగ్రం సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. కానీ ఇప్పుడు మరోసారి తను కామెడీ బాట పట్టాడు. ఒకప్పుడు రాజేంద్రప్రసాద్ సూపర్ హిట్ సినిమా అయిన “ఆ ఒక్కటి అడక్కు ” అనే టైటిల్ తో సినిమా చేశాడు. ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. మరి ఈ సినిమాతో అల్లరి నరేష్ మరొక సక్సెస్ ని అందుకున్నాడా లేదా అనే విషయాలను మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    సబ్ రిజిస్టర్ గా పనిచేసే అల్లరి నరేష్ దాదాపు 200లకు పైన పెళ్ళిళ్ళు చేస్తాడు. కానీ 30 సంవత్సరాల పైబడిన ఈయనకు మాత్రం ఇంకా పెళ్లి అవదు. తనకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు ఏ అమ్మాయి అయినా సరే పెళ్లి చేసుకోవడానికి తను సిద్ధంగా ఉన్నాను అంటూ అందరికీ చెబుతూ కొన్ని సంబంధాలు అయితే చూస్తాడు. అందులో చాలా వరకు సంబంధాలను రిజెక్ట్ చేస్తూ వస్తుంటాడు. ఇంకా కొందరు మాత్రం తనని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో తను పెళ్లి చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతూ ఉంటాడు.అయితే ఈ సినిమాలో ఆయన పెళ్లికి గల అడ్డంకులు ఏంటి.? చివరికి ఆయనకి పెళ్లి అయిందా లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాలో అల్లరి నరేష్ మరోసారి తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. ఇక దర్శకుడు మల్లి అంకం రాసుకున్న కథలో పెద్ద వైవిధ్యం అయితే లేనప్పటికీ ఇది మొత్తం కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. ఇక అందులో ఆయన కొద్ది వరకు సక్సెస్ అయినప్పటికీ కామెడీ మీదనే దృష్టి పెట్టి సినిమాలో ఉన్న కోర్ ఎమోషన్ ని పక్కన పెట్టాడు. దానివల్ల ఈ సినిమాలో ఎంతసేపు ప్రేక్షకుడి ని నవ్వించే ప్రయత్నం చేశారు కానీ ఎమోషన్ ని మాత్రం పండించడంలో ఈ సినిమా చాలా వరకు ఫెయిల్ అయిందనే చెప్పాలి. జనాలు ఈరోజుల్లో కామెడీ సినిమాలు చూడడం తగ్గించేశాడు. ఎందుకంటే కొన్ని రియాల్టీ షో ల వల్ల ప్రతిచోట కామెడీ అనేది ఈజీగా జనరేట్ అవుతుంది. ఈ సినిమాలో కొంతమేరకు వైవిధ్యం ఉండి అందులో కామెడీ వస్తే బాగుంటుంది.

    తప్ప ఫుల్ ఫ్లెడ్జ్ డ్ గా కామెడీ సినిమాలు మాత్రం ప్రేక్షకులు చూడడం తగ్గించేశారు. ఇక అందులో భాగంగానే ఈ సినిమాతో మరోసారి అది ప్రూవ్ అయింది. తన పర్ఫామెన్స్ తో సినిమాని పైకి లేపే ప్రయత్నం చేసినప్పటికీ సినిమా కంటెంట్ కరెక్ట్ గా లేకపోవడంతో ఈ సినిమా ఆశించిన మేరకు ఫలితాన్ని సాధించలేకపోయింది…ఇక ఈ సినిమాకి గోపి సుందర్ అందించిన మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకొనప్పటికి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అక్కడక్కడ ఒకే అనిపించింది. ఇక అబ్బురి రవి రాసిన డైలాగులు ఓకే అనిపించేలా ఉన్నాయి…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఇక ఈ సినిమాలో ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికొస్తే అల్లరి నరేష్ సోలో గా కామెడీ పండించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక నరేష్ కి జోడిగా వెన్నెల కిషోర్ లాంటి దిగ్గజ నటుడు నటించినప్పటికీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చే సీన్లు మాత్రమే హైలెట్ గా నిలిచాయనే చెప్పాలి. ఇక పెళ్లి కోసం తను పడే ఆరాటంలో ఆయన నటన చాలా అద్భుతంగా ఉంది. ఒకప్పుడు వెంకటేష్ చేసిన మల్లీశ్వరి సినిమాలో ఎలాంటి పాత్రను అయితే పోషించాడో ఇప్పుడు నరేష్ అలాంటి పాత్రను చేసి దాంట్లో ఇంకో వేరియేషన్ ని మరొకసారి ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశాడు… ఇక హీరోయిన్ గా చేసిన ఫైరా అబ్దుల్లా జాతి రత్నాలు తర్వాత మరొకసారి కామెడీ సినిమాలో నటించి మెప్పించింది. తన పాత్ర మేరకు ఒకే అనిపించింది. అలాగే వైవా హర్ష కూడా తనదైన రీతిలో కామెడీని పండించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక మిగిలిన ఆర్టిస్టులందరూ వాళ్ళ పాత్రలా పరిధి మేరకు ఓకే అనిపించారు…

    టెక్నికల్ విషయాలు..

    ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాలో గోపి సుందర్ అందించిన మ్యూజిక్ కొద్ది వరకు ఓకే అనిపించింది. ఇక సూర్య అందించిన విజువల్స్ సినిమాకి కొంతవరకు ప్లస్ అయ్యాయి అయితే ప్రతి ఒక్క సీన్ ని తను ఓన్ చేసుకొని విజువల్స్ ని అందించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. చోటా కే ప్రసాద్ తనదైన రీతిలో ఎడిటింగ్ ను అందించాడు. కానీ కొన్ని ఎమోషన్స్ సీన్స్ లో మాత్రం షార్ప్ ఎడిట్ చేసి ఉంటే బాగుండేది…

    ప్లస్ పాయింట్స్

    నరేష్ యాక్టింగ్
    కొన్ని కామెడీ సీన్లు…

    మైనస్ పాయింట్స్

    ఎమోషన్ మిస్సయింది..
    డైరెక్షన్ కూడా చాలావరకు మైనస్ అయింది..

    రేటింగ్

    ఈ సినిమాకు మేము ఇచ్చే రేటింగ్ 2.25/5

    చివరి లైన్

    రాజేంద్ర ప్రసాద్ చేసిన ఆ ఒక్కటి అడక్కు సినిమా మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయింది..