https://oktelugu.com/

Actress Laya: అమ్మను మించిన అందం.. హీరోయిన్ లయ కూతురిని చూస్తే మైండ్ బ్లాంక్ అంతే

లేటేస్టుగా లయ తన కూతురితో కలిసి దిగిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో లయ కూతురు శ్లోకా ఫొటోస్ చూసి సినీ ఇండస్ట్రీ షాక్ అవుతోంది.

Written By:
  • Srinivas
  • , Updated On : May 3, 2024 / 11:21 AM IST

    Actress Laya

    Follow us on

    Actress Laya: ఒకప్పుడు తెలుగు సినిమాల్లో అలరించిన ముద్దుగుమ్మలు ఇప్పుడు కనిపించకుండా పోయారు. అయితే వీరిలో కొందరు పెళ్లిళ్లు చేసుకొని విదేశాలకు వెళ్లారు. మరికొందరు పిల్లలు పెద్దయ్యాక తిరిగి సినిమాల్లో సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఓ నటి మాత్రం అలనాడు హీరోయిన్ గా ఎంతో అలరించి ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ కే అంకితమైంది. మళ్లీ సినిమాల్లోకి రావాలని అస్సలు అనుకోవడం లేదట. కానీ ఆమె కూతురు మాత్రం ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే తాజాగా ఆమె లేటేస్ట్ ఫొటోలు రిలీజ్ చేయడంతో సినీ ఇండస్ట్రీ షాక్ అవుతోంది. తల్లిని మించిన అందం ఉన్న ఈమె సినిమాల్లో నటిస్తే స్టార్ డమ్ కావడం ఖాయం అని కామెంట్లు పెడుతున్నారు.

    మధుర గీతాలను అందించిన ‘స్వయంవరం’ సినిమా గురించి 90స్ కిడ్స్ కు తెలిసే ఉంటుంది. వేణు తొట్టెంపూడి హీరోగా వచ్చిన ఇందులో లయ హీరోయిన్ గా నటించింది. ఈ సమయంలో లయ ఇంటర్మీడియట్ మాత్రమే చదువుతుండడం విశేషం. అయితే ఈ సినిమాలో లయ ను చూసి చాలా మంది ఆమె స్టార్ హీరోయిన్ అవుతారని ఎవరూ అనకోలేదు. అంతేకాకుండా ఇందులో కాస్త డీ గ్లామర్ గానే కనిపించారు. కానీ ఆ తరువాత లయకు వరుస అవకాశాలు వచ్చాయి.

    ఈ క్రమంలో ఆమె ప్రేమించు సినిమాతో స్టార నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకు ఉత్తమ నటిగా అవార్డును కూడా తెచ్చుకుంది. అలా పదేళ్లపాటు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించిన లయ చివరగా బ్రహ్మలోకం టూ యమలోకం యా భూ లోకం అనే సినిమాలో నటించింది. ఆ తరువాత అమెరికాకు చెందిన గణేష్ గోగుర్తిని వివాహం చేసుకుంది. పెళ్లయిన తరువాత తయ పూర్తిగా సినిమాలకు దూరమైంది. వీరికి ఇద్దరు పిల్లలు.

    వీరిలో కూతురు శ్లోకా రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ అంటోని’ అనే సినిమాలో బాల నటిగా కనిపించింది. ఆ తరువాత మళ్లీ సినిమాల్లో నటించలేదు. సినిమాల్లో కనిపించకపోయినా లయ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. రీల్స్ చేస్తూ సినీ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. లేటేస్టుగా లయ తన కూతురితో కలిసి దిగిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో లయ కూతురు శ్లోకా ఫొటోస్ చూసి సినీ ఇండస్ట్రీ షాక్ అవుతోంది. ఇంత అందంగా ఉన్న అమ్మాయి సినిమాల్లోకి వస్తే తప్పకుండా స్టార్ అవుతుందని అనుకుంటున్నారు.