SRH Vs KKR Final 2024: ఫైనల్ మ్యాచ్ లో గంభీర్ వ్యూహాలు ఇవే.. హైదరాబాద్ కు చుక్కలే..

కోల్ కతా జట్టుకు చంద్రకాంత్ పండిట్ కోచ్ గా వ్యవహరిస్తున్నప్పటికీ.. జట్టును ముందుకు నడిపిస్తోంది మాత్రం ముమ్మాటికీ గౌతమ్ గంభీరే అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Written By: Anabothula Bhaskar, Updated On : May 26, 2024 8:32 am

SRH Vs KKR Final 2024

Follow us on

SRH Vs KKR Final 2024: గౌతమ్ గంభీర్ కు, కోల్ కతా జట్టుకు విడదీయరాని బంధం ఉంది. 2012, 2014లో ఆ జట్టుకు అతడు ఐపిఎల్ కప్ లు అందించాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లినప్పటికీ.. భారతీయ జనతా పార్టీ నుంచి ఢిల్లీ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా గెలిచినప్పటికీ.. తన పదవికి కూడా రాజీనామా చేసి కోల్ కతా జట్టు కోసం వచ్చాడు.. మెంటార్ గా మారి ఆ జట్టు విజయాలలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. దీనిని బట్టి కోల్ కతా అంటే గౌతమ్ గంభీర్ కు ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. కోల్ కతా జట్టుకు చంద్రకాంత్ పండిట్ కోచ్ గా వ్యవహరిస్తున్నప్పటికీ.. జట్టును ముందుకు నడిపిస్తోంది మాత్రం ముమ్మాటికీ గౌతమ్ గంభీరే అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఈ సీజన్లో కోల్ కతా జట్టు నిలకడగా రాణిస్తోంది. లీగ్ దశలో మొదటి స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్ లోనూ అదే జోరు కొనసాగించింది. గత సీజన్ తో పోల్చితే ఆ జట్టులో పెద్దగా మార్పులు లేనప్పటికీ.. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, స్టార్క్, రస్సెల్ వంటి వారు రాణిస్తున్నారు అంటే దానికి ప్రధాన కారణం గౌతం గంభీర్. ఈ సీజన్లో స్టార్క్ ను భారీ ధరకు కోల్ కతా కొనుగోలు చేసింది. అయితే ప్రారంభంలో స్టార్క్ తేలిపోయాడు. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో అతడిని రాటు తేలేలా చేశాడు గౌతమ్ గంభీర్. దీంతో అతడు తన లయను అందుకొని.. కోల్ కతా జట్టుకు కీలక ఆయుధంగా మారాడు..ప్లే ఆఫ్ మ్యాచ్ లో హైదరాబాద్ ఓపెనర్ హెడ్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. హెడ్ అవుట్ కావడంతో.. అది హైదరాబాద్ జట్టు భారీ స్కోరుపై తీవ్ర ప్రభావం చూపింది.

ఈ సీజన్లో గౌతమ్ గంభీర్ కోల్ కతా జట్టులో సమూల మార్పులు తీసుకొచ్చాడు. నరైన్ ను ఓపెనర్ గా తీసుకురావడంలో అతనిది కీలక పాత్ర. అంతేకాదు వైభవ్ ఆరోరా, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ మెరుగవడంలో కీలక భూమిక పోషించాడు. ఆటగాళ్లల్లో పట్టుదల పెంచాడు. దూకుడుగా ఎలా ఆడాలో నేర్పించాడు. సమష్టి తత్వానికి సిసలైన అర్థం చెప్పాడు.. ఒత్తిడిలోనూ తలవంచని ధీరత్వాన్ని నూరిపోశాడు. అందువల్లే కోల్ కతా వరుస విజయాలు సాధించింది. కప్ వేటలో ఒక్క అడుగు దూరంలో నిలిచింది.. ఫైనల్ మ్యాచ్ లో గంభీర్.. మరింత మెరుగైన వ్యూహాలను పన్నుతాడనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ టాస్ హైదరాబాద్ గెలిస్తే.. కచ్చితంగా స్పిన్నర్లతో బౌలింగ్ వేయిస్తాడు. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ ఆరోరా వంటి వారితో అటాక్ చేయిస్తాడు. ఫీల్డింగ్ లో కూడా కోల్ కతా జట్టు మెరుగ్గా ఉంది కాబట్టి.. హైదరాబాద్ ఆటగాళ్లు పరుగులు తీసేందుకు ఇబ్బంది పడే అవకాశం ఉంది.. ప్రారంభ ఓవర్లలో వికెట్లు తీసేందుకు స్టార్క్ ఎలాగూ రెడీగా ఉంటాడు కాబట్టి.. హైదరాబాద్ జట్టుకు ఇబ్బందులు తప్పవు.

ఒకవేళ కోల్ కతా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే..సునీల్ నరైన్, రెహమనుల్లా, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రస్సెల్, రింకూ సింగ్ వంటి వారు ఆకాశమే హద్దుగా చెలరేగుతారు. వీరిలో ఈ ఇద్దరు క్లిక్ అయినా కోల్ కతా జట్టు స్కోరు.. రాకెట్ వేగంతో దూసుకెళ్ళడం ఖాయం. వారికి గౌతమ్ గంభీర్ దూకుడును అలా నేర్పించాడు మరి. చివరికి రమణ్ దీప్ సింగ్ కు కూడా భారీ సిక్సర్లు కొట్టేంత నేర్పరితనం ఉందంటే దానికి కారణం.. గౌతమ్ గంభీరే అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇతడి ఎత్తులను చిత్తు చేయడం పైనే హైదరాబాద్ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.