Chiranjeevi: చిరంజీవి ఆ సినిమా నుంచి సౌందర్యను తీసేసి రంభను ఎందుకు పెట్టారో తెలుసా..?

చిరంజీవి కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఒకే చెప్పడంతో ఈ సినిమాలో హీరోయిన్ గా రంభ ని ఫిక్స్ చేశారు.. ఇక సౌందర్యను పక్కన పెట్టడానికి ఇది ఒక కారణం అయితే మరొక కారణం ఏంటంటే అప్పటికే చిరంజీవి గుణశేఖర్ దర్శకత్వంలో చూడాలని ఉంది అనే సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు.

Written By: Gopi, Updated On : February 28, 2024 7:54 am
Follow us on

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీయార్, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు ల తర్వాత జనరేషన్ లో వచ్చిన చిరంజీవి హీరోగా ఎదగడమే కాకుండా మెగాస్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన సీనియర్లు వేసిన బాటలో నడుస్తూ, జూనియర్లను ఎంకరేజ్ చేస్తూ చిరంజీవి ఇండస్ట్రీలో ఎదిగిన తీరు అద్వితీయమనే చెప్పాలి. అలాంటి చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటించడానికి చాలామంది హీరోయిన్లు ఉత్సాహాన్ని చూపించేవారు. ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి జయంత్ సి పరంజీ దర్శకత్వంలో చేసిన బావగారు బాగున్నారా సినిమాలో రంభ హీరోయిన్ గా నటించింది.

అయితే ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా సౌందర్య ని తీసుకోవాలని అనుకున్నారట. కానీ డైరెక్టర్ అప్పటికే వెంకటేష్ తో ప్రేమించుకుందాం రా అనే సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. అయితే ఆ సినిమా లో అంజలి జవెరి ని హీరోయిన్ గా పరిచయం చేశాడు. ఇక దాంతో ఈ సినిమాలో కూడా అలానే ఒక కొత్త హీరోయిన్ ని తీసుకోవాలనుకున్నాడట. ఆ విషయాన్ని చిరంజీవితో కూడా చెప్పాడట. ఇక దాంతో చిరంజీవి ముందుగా సౌందర్య కి ఫిక్సయిన కూడా డైరెక్టర్ మాట ప్రకారం హీరోయిన్ ను సెలెక్ట్ చేసే ఛాన్స్ జయంత్ కే ఇచ్చాడట. దాంతో చాలామంది హీరోయిన్ల ను చూసిన జయంత్ కి ఎవరు కూడా ఆ క్యారెక్టర్ కి సెట్ అయ్యే వాళ్ళు దోరకలేదట. దాంతో అంతకు ముందు చిరంజీవితో హిట్లర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన రంభని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకుందామని చెప్పాడట..

చిరంజీవి కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఒకే చెప్పడంతో ఈ సినిమాలో హీరోయిన్ గా రంభ ని ఫిక్స్ చేశారు.. ఇక సౌందర్యను పక్కన పెట్టడానికి ఇది ఒక కారణం అయితే మరొక కారణం ఏంటంటే అప్పటికే చిరంజీవి గుణశేఖర్ దర్శకత్వంలో చూడాలని ఉంది అనే సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు.

అందులో హీరోయిన్ సౌందర్య కావడం వల్ల రెండు సినిమాలు ఒకే ఇయర్ లో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. కాబట్టి రెండింట్లో సౌందర్య ఎందుకు అనే ఉద్దేశ్యం లో కూడా చిరంజీవి సౌందర్యాని పక్కకు పెట్టినట్టుగా మరి కొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఇక మొత్తానికైతే బావగారు బాగున్నారా సినిమాలో చిరంజీవి రంభ ల జోడి మరొకసారి ప్రేక్షకుల్ని అలరించిందనే చెప్పాలి…