Akhil Akkineni: అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా… భారీ అంచనాలతో దసరాకు విడుదలై హిట్ గా నిలిచింది. ఇప్పుడు వసూళ్లు పరంగా కూడా తన సత్తా చాటుతున్నాడు ఈ అక్కినేని యంగ్ హీరో. 5 రోజుల్లోనే సినిమా 100 శాతం రికవరీ వెనక్కి తెచ్చేసిందని మూవీ యూనిట్ తెలిపారు. వీక్ డేస్ మొదలైన తర్వాత కూడా ఈ మూవీకి అద్భుతమైన కలెక్షన్స్ రావడం విశేషం.

అఖిల్ మూవీ తో ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ కుర్రాడు… ఆరేళ్ల కెరీర్‌లో తొలిసారి విజయం సొంతం చేసుకున్నాడు. ఇన్నేళ్లుగా ఎదురుచూసిన విజయం ఇప్పుడు వరించడంతో చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విజయాన్ని అఖిల్ కంటే కూడా ఎక్కువగా నాగార్జున ఎంజాయ్ చేస్తున్నాడు. కొడుకును వినాయక్, విక్రమ్ కే కుమార్, వెంకీ అట్లూరి లాంటి చాలా మంది హిట్ దర్శకుల చేతుల్లో పెట్టినా రాని విజయం… 14 ఏళ్లుగా హిట్ లేని బొమ్మరిల్లు భాస్కర్ ఇవ్వడం గమనార్హం.
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ 5 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్..
నైజాం: 6.64 కోట్లు
సీడెడ్: 3.52 కోట్లు
ఉత్తరాంధ్ర: 2.07 కోట్లు
ఈస్ట్: 1.03 కోట్లు
వెస్ట్: 0.84 కోట్లు
గుంటూరు: 1.19 కోట్లు
కృష్ణా: 0.93 కోట్లు
నెల్లూరు: 0.70 కోట్లు
ఏపీ + తెలంగాణ: 16.92 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 3.42 కోట్లు
వరల్డ్ వైడ్ 5 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 20.34 కోట్లు షేర్
ఇప్పటికే అన్నిచోట్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వచ్చేసారు. వీక్ డేస్ మొదలైన తర్వాత కూడా కలెక్షన్స్ బాగానే వస్తుండటంతో ఊపిరి పీల్చుకున్నారు నిర్మాతలు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అఖిల్ సినిమా త్వరలో రిలీజ్ కాబోయే సినిమాలకు మరింత బలాన్నిచ్చింది.