AP Politics: చంద్రబాబు 420, అడవి పంది.. వైసీపీ మంత్రుల బూతుల వర్షం..

AP Politics: కాదే పదం తిట్టుకు అనర్హం అన్నట్టుగా మారింది వైసీపీ మంత్రుల తీరు. నిన్న టీడీపీ అధికారి ప్రతినిధి ‘ఒరేయ్.. బోసిడేకే’ అని తిడితేనే టీడీపీ ఇల్లు పీకి పందిరి వేసిన వైసీపీ కార్యకర్తలు.. ఇప్పుడు తమ మంత్రులు తిడితే మాత్రం హాయిగా వినసొంపులా ఒక మాస్ సాంగ్ విన్నట్టు ఎంజాయ్ చేస్తున్నారట.. టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న వైసీపీ కార్యకర్తల దాడిని ఖండిస్తూ భీషణ ప్రతిజ్ఞలు చేస్తూ ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ […]

Written By: NARESH, Updated On : October 20, 2021 5:07 pm
Follow us on

AP Politics: కాదే పదం తిట్టుకు అనర్హం అన్నట్టుగా మారింది వైసీపీ మంత్రుల తీరు. నిన్న టీడీపీ అధికారి ప్రతినిధి ‘ఒరేయ్.. బోసిడేకే’ అని తిడితేనే టీడీపీ ఇల్లు పీకి పందిరి వేసిన వైసీపీ కార్యకర్తలు.. ఇప్పుడు తమ మంత్రులు తిడితే మాత్రం హాయిగా వినసొంపులా ఒక మాస్ సాంగ్ విన్నట్టు ఎంజాయ్ చేస్తున్నారట..

kodali nani anil kumar

టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న వైసీపీ కార్యకర్తల దాడిని ఖండిస్తూ భీషణ ప్రతిజ్ఞలు చేస్తూ ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఏపీ డీజీపీకి ఫోన్ చేసినా స్పందించడం లేదని.. తమకు కేంద్ర బలగాలు కావాలని కేంద్రహోంమంత్రికి ఫిర్యాదు చేశారు. ఏపీలో అరాచక పాలన సాగుతోంది. చంద్రబాబు, టీడీపీ నేతలు నిన్నటి నుంచి విరుచుకుపడుతున్నారు.

ఈ క్రమంలోనే వైసీపీ మంత్రులు తాజాగా రంగంలోకి దిగారు. వైసీపీ మంత్రుల్లోనే ఫైర్ బ్రాండ్ కొడాలి నాని అయితే చంద్రబాబును పట్టుకొని ‘420’ అని నిప్పులు చెరిగారు. నాలుగు బల్లలు, కుర్చీలు పగులకొడితే ప్రజాస్వామ్యం ఖూనీ అయినట్టా? అని నాని విమర్శించారు. నీ ఆఫీసు బల్లలు పగిలితే రాష్ట్రపతి పాలన పెట్టాలా? అని మండిపడ్డారు. చంద్రబాబు బంద్ కు పిలుపునిస్తే రాష్ట్రంలో బడ్డీకొట్టు కూడా మూయించలేదని ఎద్దేవా చేశారు.

ఇక మంత్రి అనిల్ కుమార్.. చంద్రబాబును వదిలేసి ఆయన కుమారుడు నారా లోకేష్ కు తగులుకున్నారు. ‘మగాడివైతే దమ్ముంటే రా.. చూసుకుందాం.. రాయలసీమలో పుట్టింటే నెల్లూరుకు రా అక్కడే ఉంటే తేల్చుకుందాం’ అంటూ తొడ గొట్టేశారు.

ఇక మంత్రి వెల్లంపల్లి అయితే చంద్రబాబును, టీడీపీ నేతలను అడవి పండులు అంటూ నోరుజారారు. చంద్రబాబు ఫొటోను చెప్పులతో కొడుతూ విజయవాడలో ఏకంగా మంత్రి వెల్లంపల్లి నిరసన తెలుపడం విశేషం. చంద్రబాబు, అతడి అడవిపందులు మాట్లాడితే ఖబడ్ధార్ అని తొడగొట్టేశాడు.

ఇలా ఏపీ మంత్రులు వరుసగా లైన్లోకి వచ్చేసి విరుచుకుపడ్డ తీరు చర్చనీయాంశమైంది. టీడీపీ నేతలకు ఏమాత్రం తీసిపోకుండా బూతుల వర్షం కురిపించారు.