MP Raghurama: బోసిడీకే అంటే తిట్టుకాదట..గూగుల్ లో వెతికి మరీ కొత్త అర్థం చెప్పిన ఎంపీ రఘురామ

MP Raghurama: తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే బాపతు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. వైసీపీ నుంచి గెలిచి ఆ పార్టీకి వ్యతిరేకంగా మారి సొంత పార్టీ అధినేతను జైలుకు పంపాలని పిటీషన్ వేసిన పెద్దమనిషి ఇప్పుడు తాజాగా ఏపీలో జరుగుతున్న టీడీపీ, వైసీపీ ఫైట్ లో తలదూర్చాడు. వైసీపీకి వ్యతిరేకంగా కొద్దిరోజులుగా వ్యవహరిస్తూ టీడీపీకి అనుకూల రాజకీయం చేస్తున్న ఎంపీ రఘురామ మరోసారి జగన్ ను తిట్టిన తిట్టుపై పరిశోధన చేశాడు. నిన్న […]

Written By: NARESH, Updated On : October 20, 2021 5:10 pm
Follow us on

MP Raghurama: తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే బాపతు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. వైసీపీ నుంచి గెలిచి ఆ పార్టీకి వ్యతిరేకంగా మారి సొంత పార్టీ అధినేతను జైలుకు పంపాలని పిటీషన్ వేసిన పెద్దమనిషి ఇప్పుడు తాజాగా ఏపీలో జరుగుతున్న టీడీపీ, వైసీపీ ఫైట్ లో తలదూర్చాడు. వైసీపీకి వ్యతిరేకంగా కొద్దిరోజులుగా వ్యవహరిస్తూ టీడీపీకి అనుకూల రాజకీయం చేస్తున్న ఎంపీ రఘురామ మరోసారి జగన్ ను తిట్టిన తిట్టుపై పరిశోధన చేశాడు.

mp raghurama

నిన్న టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి.. సీఎం జగన్ ను పట్టుకొని ‘ఓరేయ్ బోసిడీకే’ అని తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి వైసీపీ శ్రేణులు ఊగిపోయి టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లను రాష్ట్ర వ్యాప్తంగా ధ్వంసం చేసేశారు. ఆ రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఈ క్రమంలోనే ఇంతటి వివాదానికి కారణమైన తిట్టు ‘బోసిడీకే’ అంటే అసలు ఏంటి అనే దానిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు తాజాగా పరిశోధన చేశాడట.. తన స్నేహితులు, వైసీపీ నేతలు, ఇతర పార్టీల నేతలు, భాషాభిమానులను అందరినీ అడిగాడట.. అంతేకాదు.. గూగుల్ లోనూ సెర్చ్ చేశాడట.. చివరకు ‘బోసిడీకే’ పదానికి కొత్త అర్థాన్ని ఆయన కనుగొన్నారు. మొత్తానికి సాధించేశారు.

పట్టాభి వాడిని ‘బోసిడీకే’ తిట్టు కాదని ఎంపీ రఘురామ తేల్చేశారు. బోసిడీకే అంటే ‘మీరు బాగున్నారా?’ అని గూగుల్ లో అర్థం ఉందని రఘురామ చెప్పుకొచ్చాడు. సంస్కృతంలో ‘బోసిడీకే’ అంటే ‘సర్ .. మీరు బాగున్నారా?’ అని అర్థమని రఘురామ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. మొత్తంగా తిట్టును తిట్టు కాదంటూ జగన్ పై సెటైరికల్ సంధించిన రఘురామ అర్థాన్ని చూసి ఇప్పుడు అందరూ ముక్కున వేలేసుకున్నారు.